భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 160:
 
===సతీష్ ధావన్===
సతీష్ ధావన్ [[25 సెప్టెంబర్]], [[1920]]న [[శ్రీనగర్]]లో జన్మించాడు. పంజాబ్ యూనివర్సిటీలో చదువుపూర్తి చేసిన తర్వాత సతీష్ ధావన్, [[1947]]లో [[మిన్నియాపోలిస్-సెయింట్ పాల్ | మిన్నియాపోలిస్]]‌లోని యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటాలోమిన్నసోటాలో మరియు [[1949]]లో కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాడు. [[భారతదేశం]] తిరిగి వచ్చిన అనంతరం [[బెంగుళూరు]]లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో వివిధ పదవులు చేపట్టి, [[1972]]లో విక్రం సారాభాయ్ అనంతరం ఇస్రో ఛైర్మెన్ పదవిని అలంకరించాడు. ఆ తరువాతి కాలంలో భారత అంతరిక్ష చరిత్రలో ఎన్నో గొప్ప విజయాలకు మూలకారకుడు అయ్యాడు.
సతీష్ ధావన్ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం [[1981]]లో [[పద్మ భూషణ్]] అవార్డు ప్రదానం చేసింది. [[జనవరి 3]], [[2002]]న మరణించిన ఆయన స్మృత్యర్థం [[శ్రీహరికోట]]లోని అంతరిక్ష కేంద్రానికి ''సతీష్ ధావన్ స్పేస్ సెంటర్'' అని పేరు పెట్టారు.