33వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన: కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''33వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన (హైదరాబాద్ బుక్ ఫెయిర్)''' [[హైదరాబాదు|హైదరాబాద్‌]], [[ఇందిరా పార్కు|ఇందిరా పార్క్‌]] వద్దగల [[యన్టీఆర్ స్టేడియం (హైదరాబాద్)|తెలంగాణ కళాభారతి]] (ఎన్టీఆర్‌ స్టేడియం) ప్రాంగణంలో జరిగింది. ఈ పుస్తక ప్రదర్శన డిసెంబర్ 23 నుంచి 1 జనవరి 2020 వరకు జరిగింది.<ref name="పుట్టెడు పుస్తకాలతో... హైదరాబాద్ పుస్తక ప్రదర్శన">{{cite news |last1=ETV Bharat News |title=పుట్టెడు పుస్తకాలతో... హైదరాబాద్ పుస్తక ప్రదర్శన |url=https://www.etvbharat.com/telugu/telangana/state/hyderabad/book-fair-in-hyderabad/ts20191224162746931 |accessdate=26 December 2021 |date=24 December 2019 |archiveurl=http://web.archive.org/web/20211220140407/https://www.etvbharat.com/telugu/telangana/state/hyderabad/book-fair-in-hyderabad/ts20191224162746931 |archivedate=26 December 2021}}</ref><ref name="హైదరాబాద్‌లో 33వ నేషనల్ బుక్ ఫెయిర్">{{cite news |last1=10TV |title=హైదరాబాద్‌లో 33వ నేషనల్ బుక్ ఫెయిర్ |url=https://10tv.in/hyderabad/hyderabad-national-book-fair-monday-21777-41318.html |accessdate=26 December 2021 |date=23 December 2019 |archiveurl=http://web.archive.org/web/20211226080712/https://10tv.in/hyderabad/hyderabad-national-book-fair-monday-21777-41318.html |archivedate=26 December 2021 |language=telugu}}</ref>
==నిర్వహణ==
33వ జాతీయ పుస్తక ప్రదర్శన డిసెంబర్ 23 నుంచి 1 జనవరి 2020 వరకు మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు, శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో మధ్యాహ్నం 12.30 నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహించారు. మాజీ ప్రధాని డాక్టర్ [[పీవీ నరసింహారావు|పీవీ నర్సింహారావు]] పేరిట ప్రత్యేక ప్రాంగణాన్ని, ప్రముఖ అనువాదకుడు ఉర్దూ - తెలుగు సాహిత్యంలో పండితుడు, ఆచార్య డాక్టర్ [[నోముల సత్యనారాయణ]] పేరిట వేదికను ఏర్పాటు చేశారు. 330 స్టాళ్లతో ఏర్పాటు చేసిన ఈ పుస్తక ప్రదర్శనను రాష్ట్ర గవర్నర్ [[తమిళిసై సౌందరరాజన్]] ప్రారంభించగా, రాష్ట్ర సాంస్కృతిక & పర్యాటక శాఖ మంత్రి [[వి. శ్రీనివాస్‌ గౌడ్‌|వి. శ్రీనివాస్‌గౌడ్‌]], ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు [[బి. వినోద్ కుమార్]], టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌ [[ఘంటా చక్రపాణి]], హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ అధ్యక్ష, కార్యదర్శులు [[జూలూరు గౌరీశంకర్]], కోయ చంద్రమోహన్‌, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు [[మామిడి హరికృష్ణ]] పాల్గొన్నారు.. పిల్లలకు, ఐడీ కార్డుతో వచ్చిన విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించారు. తొలిసారిగా బాలల కోసం బాలమేళాను, సాహితీ సభలు, పుస్తకావిష్కరణలు, [[తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ]] ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
1,05,007

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3433624" నుండి వెలికితీశారు