దేవదాసి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గుడిగుడి
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 3:
'''దేవదాసి''' అంటే [[దేవాలయం|గుడి]] లోని దేవుడి [[ఉత్సవాల]]లో నాట్య [[సేవ]] చేస్తూ జీవితాంతం [[అవివాహిత]] గానే ఉండే [[స్త్రీ]]. [[సతి]], [[బాల్యవివాహాలు]], [[గణాచారి]], లాంటి సాంఘిక దురాచారం. భారతదేశంలో ప్రధాన సాంఘిక దురాచారంగా ఉన్న ఈ వ్యవస్థ తెలంగాణ సమాజంలో కూడా కనపడుతుంది. దేవదాసి వ్యవస్థ దక్షిణ భారతదేశంలో ఒక్క కేరళలో తప్ప అన్ని రాష్ట్రాలలో విభిన్న రూపాల్లో కొనసాగుతున్నది. నరబలికి బదులుగా దేవాలయాలకు అమ్మాయిలను సమర్పించే దురాచారమే దేవదాసి వ్యవస్థ. గ్రామంలో అన్ని అరిష్టాలు, అనర్థాలకు మూల కారణం గ్రామ దేవతలకు ఆగ్రహం కలగడమే అని నమ్మి గ్రామ దేవతలను శాంతింపచేయడానికి అమ్మాయిలను దేవుళ్లకు అర్పించడం జరిగేది. మతం ముసుగులో ఉన్నత కులస్తులు ఆధీన వర్గంలోని స్త్రీలను దోపిడీ చేసే ప్రక్రియ ఇది. స్వాములు వివాహేతర లైంగికవాంఛలను తీర్చడం కోసం పూజారులకు లైంగిక సంతృప్తి చేకూర్చడం కోసం ఏర్పడ్డ సామాజిక దురాచారమే ఈ దేవదాసి వ్యవస్థ.
 
==చారిత్రక నేపథ్యం==
'''చారిత్రక నేపథ్యం:''' మత సంబంధిత వ్యభిచారం భారతదేశంతోపాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో కనపడుతుంది. దక్షిణ ఐరోపా, ఏషియా మైనర్, ఈజిప్టు, మెసపటోమియాలో ఈ దురాచారం ఉంది. గ్రీసు చరిత్రకారుడు హెరిడోటస్ బాబిలోనియాలోని మైలిట్టా దేవాలయంలో స్త్రీల శీలాన్ని అర్పించారని తన రచనల్లో తెలిపారు. లూసియన్ అనే రోమన్ రచయిత ఫోనియాలో ఇటువంటి ఆచారం ఉన్నట్లు రాశాడు. పొనీషియా, కానన్, పేఫస్, సైప్రస్ మొదలైన దేశాల్లో మాతృదేవతారాదన ప్రధానంగా అమల్లో ఉంది. ఈ దేవతను ఎస్టార్ట్, అఘారెత్, ఎస్ట్రేట్ వంటి పేర్లతో పిలుచుకొంటారు. అరేబియాలో అలాట్, ఆల్-ఉజ్జా వంటి సామాజిక దురాచారాలు మత సంబంధిత వ్యవహారాలతో ముడిపడి ఉన్నాయని టాని పెంజర్ పేర్కొన్నాడు. పశ్చిమాఫ్రికాలోని అనేక దేశాల్లో మతపరమైన వ్యభిచారం ఉన్నట్లు హెరిడోటస్ తన రచనల్లో పేర్కొన్నాడు.
 
'''==భారత్‌లో..'''==
భారతదేశ చరిత్రలో జోగిని, దేవదాసి వ్యవస్థల నేపథ్యం విభిన్న కోణాల్లో, దశల్లో కనపడుతుంది. జోగిని, దేవదాసి వ్యవస్థలు వైష్ణవ సంప్రదాయంలో కనపడతాయి. కాళిదాసు కీర్తనలో మాతంగి అంటే దళిత స్త్రీ అని అర్థం. మాతంగి రూపాన్ని మహాదివ్య సరస్వతిగా అభివర్ణించారు. క్రీ.శ. 3వ శతాబ్దానికి చెందిన జోగి మరణశాసనం జోగిని వ్యవస్థ గురించి వివరిస్తుంది. వాత్సాయనుడి కామసూత్రాల్లో వీరు వివిధ కళల్లో నైపుణ్యంగలవారని, గణిక, విలాసవతి పేర్లతో ఈ సంప్రదాయాన్ని కొనసాగించేవారని పేర్కొన్నారు.
దేవదాసి అనే పదాన్ని ఆర్యులు వినియోగించిన వైదిక ధర్మాచరణ నుంచి తీసుకొన్నారు. నాడు అనార్యులను, అవర్ణులను దస్యులు అని పిలిచేవారు. దేవాలయాల్లో పరిచారికలుగా ఉండే వీరిని దేవదాసి అని పిలిచేవారు. దేవదాసి వ్యవస్థ భారతదేశమంతటా ఉందని హ్యుయాన్‌త్సాంగ్ పేర్కొన్నారు. చరిత్రను నిశితంగా పరిశీలిస్తే స్త్రీలను దేవతలు, యోగిని, శక్తిమాత, డాకిణి, షాకిని, జోగినిగా పిలిచేవారని తెలుస్తున్నది. యోగం, యాగం, యజ్ఞం కలిగిన స్త్రీలను యోగినులుగా ఆరాధించేవారు. భారతీయ సంప్రదాయంలోని 64 కళల్లో నాట్యం విలక్షణ సాంస్కృతిక జీవన విధానంగా గుర్తింపు పొందింది. రాజులు తమ రాజమందిరాల్లో మద్యం తాగుతూ నాట్యగత్తెల నాట్యాన్ని ఆస్వాదిస్తూ విందులు, వినోదాలు జరుపుకొనేవారు.
Line 11 ⟶ 12:
దేవాలయాల్లో పండుగలు, ఉత్సవాలు జరిగేటప్పుడు నాట్యాలకు అధిక ప్రాధాన్యమిచ్చేవారు. కాళిదాసు తన మేఘదూత కావ్యంలో ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో బాలికలను చిన్న వయసులోనే దేవతలు, దేవుళ్లకు సమర్పించే సంప్రదాయం ఉందని పేర్కొన్నారు. క్రీ.శ. 10వ శతాబ్దంలో ట్రావెన్‌కోర్, తంజావూరు సంస్థానాల్లో 400 మందికిపైగా దేవదాసీలు ఉండేవారని, దేవాలయాల్లో పూజారుల తర్వాత స్థానం దేవదాసి లేదా జోగినులదే అని అనేక అధ్యయనాల్లో వెల్లడయ్యింది.
 
'''==తెలంగాణలో..'''==
సామాజిక దురాచారాలైన జోగిని, దేవదాసి వ్యవస్థలు తెలంగాణ సమాజంలో నేటికీ కనపడటం బాధాకరమైన విషయం. తెలంగాణను చారిత్రకంగా పరిశీలిస్తే భౌగోళికంగా తూర్పున బంగాళాఖాతం నుంచి పశ్చిమాన అరేబియా మహాసముద్రం వరకు విస్తరించి ఉండేది. దీంతో ఈ దురాచారాలు ఆ కాలంలో చోళ రాజ్యంలో సర్వసాధారణంగా కనపడేవి. జోగిని, దేవదాసీలను దేవర్ అడిగళర్ అని పిలిచేవారు. ఈ పేరుకు అర్థం దేవతలకు బానిస.
జగన్నాథ దేవాలయంలో వీరిని మహరి అని పిలిచేవారు. దీనికి అర్థం మోహన నారి. అంటే సమ్మోహనానికి మన్మథ క్రీడలకు ఇష్టపడిన, ప్రేరేపించే స్త్రీ దేవదాసిగా మారుతుంది. ఫ్రెంచ్ మత గురువు అబుదుబేయ్ (1792-1823) రచించిన హిందూ మానర్స్, కస్టమ్స్ అండ్ సెర్మనీస్ గ్రంథంలో శైవమతాన్ని ఆచరించిన కాకతీయ, రెడ్డి రాజులు, వెలమరాజుల కాలంలో జోగిని వ్యవస్థ ఉన్నట్లుగా పేర్కొన్నాడు.
"https://te.wikipedia.org/wiki/దేవదాసి" నుండి వెలికితీశారు