టి.రుక్మిణి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5 |
|||
పంక్తి 21:
| website =
}}
'''టి.రుక్మిణి''' (1936-2020) కర్ణాటక వాయులీన విద్వాంసురాలు.<ref name="SNA">{{cite web |last1=web master |title=T. Rukmini |url=https://sangeetnatak.gov.in/sna/citation_popup.php?id=526&at=2 |website=SANGEET NATAK AKADEMI |publisher=SANGEET NATAK AKADEMI |accessdate=2 April 2021 }}{{Dead link|date=డిసెంబర్ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
==విశేషాలు==
తిరువేంగడం రుక్మిణి [[కర్ణాటక]] రాష్ట్రం, [[శివమొగ్గ]] పట్టణంలో [[1936]] [[నవంబర్ 27]]వ తేదీన జన్మించింది.<ref name="శృతి">{{cite web |last1=web master |title=Vidushi T Rukmini passes away |url=http://srutimag.blogspot.com/2020/05/vidushi-t-rukmini-passes-away.html |website=Sruti Magazine |publisher=Sruti Magazine |accessdate=2 April 2021}}</ref> ఈమె [[ఆర్.ఆర్.కేశవమూర్తి]], [[లాల్గుడి జయరామన్|లాల్గుడి జయరామన్]]ల వద్ద వాయులీనా వాద్య సంగీతాన్ని అభ్యసించింది. [[సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్]] వద్ద గాత్ర సంగీతాన్ని నేర్చుకుంది. ఈమె తన 16వ యేట [[టి.ఆర్.మహాలింగం]] కచేరీకి వాయులీన సహకారం అందించడంతో తన ప్రదర్శనను ప్రారంభించి 65 సంవత్సరాలకు పైగా అనేక కచేరీలు నిర్వహించింది. ఈమె ఐదు తరాల సంగీత విద్వాంసులకు వాద్య సహకారం అందించడమే కాక సోలో ప్రదర్శనలు కూడా అనేకం చేసింది.<ref name="హిందూ">{{cite news |last1=Poorna Vaidhyanathan |title=Her voice was as sweet as her bow |url=https://www.thehindu.com/entertainment/music/her-voice-was-as-sweet-as-her-bow/article31746856.ece |accessdate=2 April 2021 |work=The Hindu |date=4 June 2020}}</ref> ఈమె [[సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్]], టి.కె.రంగాచారి, [[వోలేటి వెంకటేశ్వర్లు]], రామనాథ కృష్ణన్, [[డి.కె.పట్టమ్మాళ్]], [[డి.కె.జయరామన్]], [[చెంబై వైద్యనాథ భాగవతార్]], [[సుందరం బాలచందర్]], [[ఎం.డి.రామనాథన్]], [[ఎం.ఎల్.వసంతకుమారి]], [[ఎం.ఎస్. సుబ్బులక్ష్మి]], [[టి.ఆర్.సుబ్రహ్మణ్యం]], [[సిక్కిల్ సిస్టర్స్]] వంటి అగ్రశ్రేణి సంగీత కళాకారుల కచేరీలలో పాల్గొన్నది. ఈమె వాయులీన ప్రదర్శనలే కాక గాత్ర సంగీత ప్రదర్శనలు కూడా చేసింది. పద్మలోచన నాగరాజన్, [[వైజయంతిమాల|వైజయంతిమాల బాలి]] వంటి భరతనాట్య కళాకారిణుల నాట్యప్రదర్శనలలో గాత్రాన్ని అందించింది. [[మంగళంపల్లి బాలమురళీకృష్ణ]]తో కలిసి గాత్ర సంగీత కచేరీలు నిర్వహించింది. ఈమె భారతదేశంలోనే కాక ప్రపంచంలోని అనేక దేశాలలో తన ప్రదర్శనలు ఇచ్చింది.
|