శ్రీహరికోట: కూర్పుల మధ్య తేడాలు

→‎నేపథ్యం: విస్తరణ
పంక్తి 4:
==అనుకూలాంశాలు==
[[పులికాట్ సరస్సు]], [[బంగాళా ఖాతం]], మధ్య శ్రీహరికోట ద్వీపంలా ఉంది. తూర్పు తీరాన భూమధ్యరేఖకు సమీపంగా ఉండటం, సువిశాలమైన సముద్రం ఒక వైపు, నిర్జీవ పులికాట్ సరస్సు మరో వైపు ఉన్నాయి. రాకెట్ ప్రయోగ దిశలో భూభాగాలేవీ లేకపోవడం లాంటి కారణాలు కూడా కలిసి రావడం దీని ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఒకవేళ ప్రయోగమేదైనా విఫలమైనా రాకెట్ శకలాలు సముద్రంలో పడిపోయేందుకు వీలుంది. మరో విశిష్టత, ఈ కేంద్రం భూమధ్యరేఖకు 13 డిగ్రీల అక్షాంశంలో ఉంది. ఇలా భూమధ్య రేఖకు దగ్గరగా ఉండటం వలన రాకెట్ [[భూమ్యాకర్షణ శక్తి]]ని తేలిగ్గా అధిగమించి నింగిలోకి అనుకున్న విధంగా పంపవచ్చు.
 
భౌగోళికంగా, సాంకేతికంగా, ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్న ఫ్రెంచి గయానాలోని కౌరు రాకెట్ ప్రయోగ కేంద్రం భూమధ్య రేఖకు కేవలం ఏడు డిగ్రీల అక్షాంశంలో ఉండగా శ్రీహరికోట కేంద్రం రెండో స్థానంలో కొనసాగుతోంది. ఎంతో గొప్పదిగా చెప్పుకునే అమెరికాలోని కేఫ్ కెన్నెడీ రాకెట్ ప్రయోగ కేంద్రం భూమధ్య రేఖకు 28 డిగ్రీల అక్షాంశంలోనూ, రష్యాలోని రాకెట్ ప్రయోగ కేంద్రం భూమధ్య రేఖకు 55 డిగ్రీల అక్షాంశంలోనూ ఉన్నాయి. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం మొత్తం 43,360 ఎకరాల్లో విస్తరించి ఉంది. <ref>అక్టోబర్ 12, 2008, ఈనాడు ఆదివారం అనుభంధం ఆధారంగా...</ref>
 
== ఇవీ చూడండి ==
"https://te.wikipedia.org/wiki/శ్రీహరికోట" నుండి వెలికితీశారు