శ్రీహరికోట: కూర్పుల మధ్య తేడాలు

→‎నేపథ్యం: విస్తరణ
పంక్తి 1:
'''శ్రీహరికోట''' ([[ఆంగ్లం]] : '''Sriharikota''') [[నెల్లూరు]] జిల్లాలోని ఒక తీరప్రాంతపు ద్వీపము, ఆంధ్రప్రదేశ్ లోని కోరమాండల్ తీరంలో గలదు. ఇచ్చట [[సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం]] గలదు, ఈ కేంద్రాన్ని [[ఇస్రో]] వారు ఉపయోగిస్తున్నారు. ఇక్కడి నుండి భారతదేశం తన [[రాకెట్|రాకెట్ల]]ను ప్రయోగిస్తుంది. దీనికి దగ్గరలోని పట్టణం [[సూళ్ళూరుపేట]].
==నేపథ్యం==
శ్రీరాముడు ఈదీవిలో అరకోటి లింగాలను ప్రతిష్టించి, ఇక్కడ రాక్షస ప్రభావాన్ని తొలగించాడనీ అందువల్లనే ఈ ప్రాంతానికి '''శ్రీ అరకోటై''' గా పేరు వచ్చి కాలక్రమంలో ఈ పేరు ప్రజల నోళ్ళలో నాని, శ్రీహరికోట గా మారిందిన అక్కడి ప్రజలు భావిస్తారు. రాకెట్ ప్రయోగ కేంద్రం స్థాపించక మునుపు ఈ ప్రాంతం నాగరికతకు ఎంతో దూరం. అమాయకులైన గిరిజన తెగలు నివసించే ప్రాంతం. [[1970]] వరకూ అంతరిక్ష పరిశోధనలకు [[కేరళ]] లోని తిరువనంతపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న '''తుంబా''' అంతరిక్ష కేంద్రాన్ని ఉపయోగించేవారు. కానీ దీని చుట్టూ జనసంచారం ఎక్కువగా ఉండేది. పైగా ఆ కేంద్రం మినీ రాకెట్ ప్రయోగాలకే పరిమితం. భవిష్యత్తులో చేయబోయే భారీ రాకెట్ ప్రయోగాల దృష్ట్యా భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం మరోచోట రాకెట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో డాక్టర్ [[విక్రమ్ సారాభాయ్]] నేతృత్వంలో అనువైన రాకెట్ ప్రయోగ కేంద్ర స్థలం కోసం అన్వేషణలో భాగంగా దేశంలో అన్ని ప్రాంతాలనూ పరిశీలిస్తూ రాగా ఈ దీవి కంటపడింది. భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ఈ దీవి రాకెట్ ప్రయోగాలకు అత్యంత అనువైనదిగా భావించిన సారాభాయ్ బృందం ఆ విషయాన్ని ఇస్రోకు తెలిపింది. శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగ కేంద్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులివ్వగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేల ఎకరాల స్థలాన్ని ఉచితంగా ఇచ్చింది.
 
==అనుకూలాంశాలు==
[[పులికాట్ సరస్సు]], [[బంగాళా ఖాతం]], మధ్య శ్రీహరికోట ద్వీపంలా ఉంది. తూర్పు తీరాన భూమధ్యరేఖకు సమీపంగా ఉండటం, సువిశాలమైన సముద్రం ఒక వైపు, నిర్జీవ పులికాట్ సరస్సు మరో వైపు ఉన్నాయి. రాకెట్ ప్రయోగ దిశలో భూభాగాలేవీ లేకపోవడం లాంటి కారణాలు కూడా కలిసి రావడం దీని ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఒకవేళ ప్రయోగమేదైనా విఫలమైనా రాకెట్ శకలాలు సముద్రంలో పడిపోయేందుకు వీలుంది. మరో విశిష్టత, ఈ కేంద్రం భూమధ్యరేఖకు 13 డిగ్రీల అక్షాంశంలో ఉంది. ఇలా భూమధ్య రేఖకు దగ్గరగా ఉండటం వలన రాకెట్ [[భూమ్యాకర్షణ శక్తి]]ని తేలిగ్గా అధిగమించి నింగిలోకి అనుకున్న విధంగా పంపవచ్చు.
"https://te.wikipedia.org/wiki/శ్రీహరికోట" నుండి వెలికితీశారు