అన్నవరం ప్రసాదం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
== తయారీ ==
అన్నవరం ప్రసాదాన్ని ఎర్ర గోధుమనూక, బెల్లం, పంచదారల, యాలకులపొడితో తయారుచేస్తారు.<ref>{{Cite web|url=https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/annavaram-prasadam-ready-within-45-minutes-new-machines-1384632|title=సత్యదేవుడి ప్రసాదం ముప్పావుగంటలో సిద్ధం|date=2021-08-04|website=Sakshi|language=te|access-date=2022-01-01}}</ref> ఈ ప్రసాదం సుగంధభరితంగా ఉంటుంది. చిన్నపాటి ఎండిన విస్తరాకులో ఈ ప్రసాదాన్ని పెట్టి అందిస్తూ ఉంటారు.<ref name=":0">{{Cite web|url=https://10tv.in/latest/god-of-weeks-annavaram-is-the-god-of-truth-261356.html|title=Annavaram : వరాల దేవుడు... అన్నవరం సత్యదేవుడు {{!}}God of weeks ... Annavaram is the God of truth|last=telugu|first=10tv|date=2021-08-10|website=10TV|language=telugu|access-date=2022-01-01}}</ref><ref>{{Cite web|url=https://eastgodavari.ap.gov.in/te/%e0%b0%a4%e0%b1%80%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a5%e0%b0%af%e0%b0%be%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0-%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%9f%e0%b0%95-%e0%b0%b0%e0%b0%82%e0%b0%97%e0%b0%82/|title=తీర్థయాత్ర పర్యాటక రంగం {{!}} Welcome to East Godavari District Web Portal {{!}} India|language=te|access-date=2022-01-01}}</ref> దూరప్రాంతాలకు తీసుకువెళ్ళేందుకు వీలుగా గోధుమ రవ్వతో బంగి ప్రసాదంగానూ (గట్టి ప్రసాదం) తయారుచేస్తూంటారు.<ref>{{Cite web|url=http://www.hindutemplesguide.com/2020/03/famous-temples-information-in-east.html|title=తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాల వివరాలు|last=రాజా చంద్ర|website=హిందూ టెంపుల్స్ గైడ్|url-status=live|access-date=2022-01-01}}</ref> అయితే, భక్తులు బంగి ప్రసాదం కన్నా రవ్వ ప్రసాదాన్నే ఎక్కువ ఇష్టపడతారు.<ref name=":2">{{Cite web|url=https://www.bbc.com/telugu/india-59838840|title=అన్నవరం ప్రసాదం ఎందుకంత రుచిగా ఉంటుంది... ఏమిటా రహస్యం?|last=వడిశెట్టి|first=శంకర్|date=2022-01-01|website=BBC News తెలుగు|language=te|url-status=live|access-date=2022-01-01}}</ref>
 
తెల్లవారుజామున 3 గంటలకు పని ప్రారంభించి తయారుచేస్తారు. ఒక్కో తయారీ యూనిట్‌లో 68 మంది సిబ్బందితో 20 కళాయిల్లో ఈ ప్రసాదం తయారీచేస్తూ ఉంటారు. సాధారణ రోజుల్లో మొత్తం 100 కళాయిల్లో ప్రసాదాలు తయారుచేస్తారు. రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో 250 కళాయిలతో పనిచేస్తారు. గోదావరి పుష్కరాల సమయంలో రోజుకు 270 కళాయిలతో పనిచేసింది రికార్డు అని వంట బృందానికి నేతృత్వం వహించే మధుబాబు చెప్పాడు.<ref name=":2" />
పంక్తి 11:
అన్నవరం ప్రసాదాన్ని దేవస్థానంలో అన్నవరం సత్యనారాయణస్వామి వ్రతం చేసుకునే జంటలకు ఉచితంగా పంపిణీ చేస్తారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాకా ప్రసాదాన్ని తినకపోతే వ్రత ఫలితం దక్కకపోగా అనర్థం జరుగుతుందన్న విశ్వాసం కూడా ఉంది. భక్తులు కొనుక్కోదలిస్తే దేవస్థానంలోని కౌంటర్లలో 100 గ్రాములు 20 రూపాయల చొప్పున అమ్ముతారు.<ref name=":1" />
 
== ప్రాచుర్యం, విశ్వాసాలు ==
ఈ ప్రసాదం చాలా విశేషమైన పేరు ప్రఖ్యాతులు పొందింది. ప్రత్యేకించి దీని రుచికి ఎంతో పేరుపొందింది.<ref>{{Cite web|url=https://www.tnilive.com/2019/07/23/how-are-prasadams-made-across-temples-in-india/|title=దేవాలయాల్లో ప్రసాదాలు ఎందుకు అంత మధురం?|date=2019-07-23|website=Telugu News International - TNILIVE|language=en-US|access-date=2022-01-01}}</ref> భక్తులు అన్నవరం నుంచి తిరిగివెళ్ళేప్పుడు తమతో ఇంటికి ఈ ప్రసాదాన్ని ఎక్కువమొత్తంలో కొని ప్రత్యేకంగా తీసుకువెళ్తూ ఉంటారు.<ref name=":0" /> తాము వెళ్ళకపోయినా వెళ్ళేవాళ్ళతో ప్రత్యేకంగా తెప్పించుకోవడం కూడా పరిపాటి.<ref name=":1">{{Cite web|url=https://telugu.news18.com/news/andhra-pradesh/visakhapatnam-annavaram-temple-to-install-new-technology-for-making-satyavdava-prasadam-in-east-godavari-district-full-details-here-prn-vsp-983488.html|title=Annavaram Temple: అన్నవరం భక్తులకు గుడ్ న్యూస్... 45 నిముషాల్లోనే సత్యదేవుని ప్రసాదం..|website=News18 Telugu|language=te|access-date=2022-01-01}}</ref> కేవలం దేవుని ప్రసాదంగానే కాక ఒక స్వీటుగా కూడా దీనికి ప్రత్యేకమైన పేరుంది. [[కాకినాడ గొట్టంకాజా]], [[ఆత్రేయపురం పూతరేకులు]] వంటి ఇతర స్వీట్లతో కలిపి ఈ ప్రసాదాన్ని గురించి గొప్పగా చెప్తారు ఆహార ప్రియులు.<ref>{{Cite web|url=https://paperandposter.com/east-godavari-sweets/|title=The East Godavari Sweets You Should Never Miss|last=Nallam|first=Pavan Satish|date=2020-10-21|website=Paper and Poster|language=en-US|access-date=2022-01-01}}</ref> రుచికి పేరుపడ్డ ప్రసాదాల విషయంలో అన్నవరం ప్రసాదాన్ని [[తిరుపతి లడ్డు]]<nowiki/>లో పోలుస్తారు.<ref name=":1" /> ఇవే దినుసులతో, ఇదే పద్ధతిలో మరెక్కడైనా వండినా ఈ రుచి రాదని భక్తులతో పాటుగా ఈ ప్రసాదం వండే వంటవారు కూడా విశ్వసిస్తారు.<ref name=":2" />
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అన్నవరం_ప్రసాదం" నుండి వెలికితీశారు