నరేష్ అయ్యర్: కూర్పుల మధ్య తేడాలు

Created page with 'నరేష్ అయ్యర్‌ (1981, జనవరి 3న జన్మించారు) భారతదేశంలోని ముంబైకి చెందిన నేపథ్య గాయకుడు<ref>{{Cite web|url=https://www.filmibeat.com/celebs/naresh-iyer.html|title=All you want to know about #NareshIyer|website=FilmiBeat|language=en|access-date=2022-01-03}}</ref>. నరేష్ అయ్యర్‌ అనేక భారతీ...'
ట్యాగు: 2017 source edit
(తేడా లేదు)

11:17, 3 జనవరి 2022 నాటి కూర్పు

నరేష్ అయ్యర్‌ (1981, జనవరి 3న జన్మించారు) భారతదేశంలోని ముంబైకి చెందిన నేపథ్య గాయకుడు[1]. నరేష్ అయ్యర్‌ అనేక భారతీయ భాషల్లో సినీ గీతాలు పాడారు, ఆయన ఖాతాలో, జాబితాలో విజయవంతమైన అనేక గీతాలు ఉన్నాయి. ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం అందించిన రంగ్‌ దే బసంతి చిత్రంలో ఆయన పాడిన రూబరూ పాట అనేక వారాలపాటు సంగీత జాబితాలలో అగ్రస్థానంలో నిలిచింది మరియు అతనికి 2006 ఏడాదికిగాను, పురుషుల విభాగంలో ఉత్తమ నేపథ్యగాయకుడిగా జాతీయ అవార్డు లభించింది. . ఆర్.డి.బర్మన్ మ్యూజికల్ టాలెంట్ విభాగంలో ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నాడు. గాయకుడిగా వృత్తిపరమైన జీవితంలో అరంగేట్రం చేసిన తొలి ఏడాదే జాతీయ అవార్డు మరియు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు గెలుచుకున్న కొద్దిమంది గాయకుల్లో నరేష్‌ ఒకరు.

జీవితచరిత్ర

నరేష్ అయ్యర్ 1981 జనవరి 3న శంకర్ అయ్యర్ మరియు రాధలకు జన్మించి ముంబైలోనిమటుంగాలో పెరిగాడు. అతనికి నిషా అయ్యర్ అనే చెల్లెలు ఉంది, , ముంబైలోని మాతుంగలో పెరిగారు. SIES కళాశాలకు హాజరై, మేనేజ్‌మెంట్‌ విద్యలో, కామర్స్‌ డిగ్రీని పొందారు. గ్రాడ్యుయేషన్‌ తర్వాత చార్టెర్డ్‌ అకౌంటెంట్‌ కావాలనేది ఆయన ఉద్దేశం. కానీ, కర్ణాటక సంగీతం, హిందుస్థానీ క్లాసికల్‌ సంగీతంలో విద్యను అభ్యసించాలని నిర్ణయించారు.

వృత్తి

చానెల్‌ V యొక్క సూపర్‌ సింగర్‌ టాలెంట్‌ షోలో ఈ ప్రదర్శనలో అతను గెలవకపోయినా అయ్యర్‌లోని నైపుణ్యాన్ని సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌ గుర్తించి అతడితో అన్బె అరువైర్ ‌ అనే సినిమాలో "మయిలిరిగె" అనే పాటతో అవకాశం ఇచ్చాడు. అతడు తమిళ్‌, తెలుగు, హిందీల్లో అనేకమంది ఇతర సంగీత దర్శకులకు కూడా పాడారు.అతను ముంబైలో ఉన్న ధ్వని అనే ఫ్యూజన్ బ్యాండ్‌కు గాయకుడు కూడా[2], నరేష్ మరియు అతని బృందం అనేక కార్యక్రమాలు, ఛారిటీ కచేరీలకు ప్రదర్శనలు ఇచ్చారు.

మూలాలు

  1. "All you want to know about #NareshIyer". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2022-01-03.
  2. Nadadhur, Srivathsan (2015-07-28). "Open to work with anyone: Naresh Iyer". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-01-03.