భోగి: కూర్పుల మధ్య తేడాలు

Added extra information. By Sankeerthana 10 years
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 2405:201:C015:E1AF:5C0F:5AF0:BF49:C034 (చర్చ) చేసిన మార్పులను Stang చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 20:
[[File:Bhogi Mantalu (YS) (2).JPG|thumb|భోగి పండుగ రోజు తెల్లవారుజామున వేస్తున్న భోగిమంటలు]]
'''భోగి''' లేదా '''భోగి పండుగ''' అనునది [[ఆంధ్రులు]] జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఆంధ్రులు [[పెద్ద పండుగ]]గా జరుపుకునే మూడు రోజుల [[సంక్రాంతి]] పండుగలో మొదటిరోజును భోగి అంటారు. భోగి పండుగ సాధారణంగా జనవరి 13 లేదా జనవరి 14 తేదిలలో వస్తుంది. [[దక్షిణాయనం]]లో [[సూర్యుడు]] రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో [[భూమి]]కి దూరం అవుట వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు, [[ఉత్తరాయణం]] ముందురోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగ మండే మంటలు అందరు వేయటం వలన ఈ రోజుకు భోగి అనే పేరు వచ్చింది.
 
సంక్రాంతి ముచ్చటైన పండుగ. చిన్నాపెద్దా అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే వేడుక. మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి పండుగ కొత్త ఆనందాలను మోసుకొస్తుంది. భోగి, సంక్రాంతి, కనుమ.. ఇలా మూడు రోజులు ప్రతి ఇంటా సంతోషమే. తొలి రోజు జరుపుకొనే భోగి పండుగకు ప్రత్యేకత ఉంది. భగ అనే పదం నుంచి భోగి వచ్చిందంటారు పెద్దలు. దక్షిణాయనానికి చివరి రోజుగా భోగిని భావిస్తారు. అందుకే దక్షిణాయనంలో పడ్డ కష్టాలు, బాధలను భోగి మంటల రూపంలో అగ్ని దేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖసంతోషాలను ప్రసాదించాలనే పరమార్థమే భోగి పండుగ విశిష్టత.
 
==విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/భోగి" నుండి వెలికితీశారు