కొండపనేని రామలింగేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
మద్రాసు చేరుకున్న రామలింగం తన తండ్రికి స్నేహితుడైన నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు వద్ద పబ్లిసిటీ డిజైనర్‌గా తన ఉద్యోగాన్ని ప్రారంభించాడు. అక్కడ [[భార్యాభర్తలు]], [[కలసి ఉంటే కలదు సుఖం]] మొదలైన సినిమాలకు పనిచేశాడు. తరువాత కాట్రగడ్డ నరసయ్య, [[గుమ్మడి వెంకటేశ్వరరావు|గుమ్మడి]], [[కొంగర జగ్గయ్య|జగ్గయ్య]]ల సహకారంతో [[టి. వి. యస్. శర్మ]]వద్ద అప్రెంటిస్‌గా చేరాడు. కొంత కాలానికే ఇతడికి [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]] పరిచయమయ్యాడు. రామలింగం పనితీరు పట్ల ఆకర్షితుడైన కృష్ణ ఇతడికి డిజైనింగ్ వృత్తి నుండి కళా దర్శకత్వంవైపు మళ్ళమని సలహా ఇచ్చాడు. ఇతడు ఆ రంగంలో ప్రవేశించడానికి తీవ్రమైన కృషి చేసి చివరకు [[కుదరవల్లి నాగేశ్వరరావు]] వద్ద సహాయకుడిగా చేరి [[పేదరాసి పెద్దమ్మ కథ]] సినిమాకు పనిచేశాడు. అక్కడ ఇతడు కొన్ని మెలకువలు నేర్చుకున్నాడు. 1962-64ల కాలంలో ఇతనికి గడ్డు పరిస్థితి ఏర్పడి గత్యంతరంలేక తిరిగి ఉత్త చేతులతో దుగ్గిరాలకు వెళ్ళిపోయాడు.
 
కొన్ని సంవత్సరాలు గడిచాక అలపర్తి సురేంద్ర ఇతని గురించి తెలుసుకుని 1967లో తిరిగి మద్రాసుకు పిలిపించాడు. రామలింగం కళాదర్శకత్వ శాఖలో నిలదొక్కుకోవడానికి సురేంద్ర సహకరించాడు. తిరిగి ఇతడు కుదరవల్లి నాగేశ్వరరావు వద్ద సహాయకుడిగా చేరాడు. 1968లో దొండేపూడిదోనేపూడి కృష్ణమూర్తి, వీర్రాజులు నిర్మాతలుగా [[కె.ఎస్.ఆర్.దాస్]] దర్శకత్వంలో [[తాడేపల్లి లక్ష్మీకాంతారావు|కాంతారావు]] నటించిన [[రాజయోగం]] సినిమాతో ఇతడు కళాదర్శకుడిగా మారాడు. ఆ సినిమా విజయవంతం కావడంతో ఇతనికి మంచి అవకాశాలు రావడం ప్రారంభమయ్యింది. చారిత్రక, సోషియో ఫాంటసీ సినిమాల స్క్రిప్టుకు, పాత్రలకు తగినట్లుగా సెట్టింగులను సమకూర్చడంలో ఇతడు పేరుగడించాడు.
 
కృష్ణ తన సోదరులతో కలిసి [[పద్మాలయా స్టూడియోస్]] ప్రారంభించాక ఇతడిని ఆ సంస్థలో ఆస్థాన కళాదర్శకుడిగా నియమించుకున్నాడు. అప్పటి నుండి 12 సంవత్సరాలు ఆ బ్యానర్‌కు కళాదర్శకునిగా పనిచేసి తన జీవితంలో మధురమైన అనుభూతులను సంపాదించుకున్నాడు. [[అల్లూరి సీతారామరాజు (సినిమా)|అల్లూరి సీతారామరాజు]] సినిమా కోసం [[చింతపల్లి (విశాఖపట్నం)|చింతపల్లి]]లో 5 ఎకరాల స్థలంలో ఇతడు డిజైన్ చేసిన సెట్టింగ్‌ను లక్ష రూపాయలు ఖర్చుపెట్టి నిర్మించారు. దీనిని పద్మాలయా కాలనీగా పిలుస్తున్నారు. [[మోసగాళ్ళకు మోసగాడు]] సినిమాకు ఇతడు కళాదర్శకత్వంతో పాటు కాస్ట్యూములు కూడా డిజైన్ చేశాడు. ఈ సినిమాలో కృష్ణకు ఇతడు డిజైన్ చేసిన దుస్తులు బాగా పాపులర్ అయ్యి కృష్ణకు బ్రాండ్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. [[ఈనాడు (1982 సినిమా)|ఈనాడు]] సినిమా కోసం మద్రాసు అరుణాచలం స్టూడియో ప్రక్కన ఇతడు నిర్మించిన సెట్టింగ్ కృష్ణా గార్డెన్స్ పేరుతో పద్మాలయా స్టూడియోస్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. షోలే సినిమా సెట్టింగ్ తరువాత అంత వాస్తవిక సెట్టింగ్‌గా దీనిని పేర్కొంటారు. ఈ సెట్టింగ్ పలువురి ప్రశంసలను పొందింది.