చర్ల గణపతిశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
వీరు [[జనవరి 1]], [[1909]] సంవత్సరంలో నారాయణ శాస్త్రి మరియు వెంకమ్మ దంపతులకు [[పశ్చిమ గోదావరి]] జిల్లాలోని [[కాకరపర్రు]] గ్రామంలో జన్మించారు. గ్రామంలో ప్రాథమిక విద్యానంతరం, కాకినాడలో విద్యార్ధి దశలో ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్త్ర బహిష్కరణ వంటి స్వాతంత్ర్యోద్యమాలలో చురుకుగా పాల్గొన్నారు. వీరు వేదుల సూర్యనారాయణ మూర్తి గారి కుమార్తె సుశీలను వివాహం చేసుకున్నారు.
 
వీరి తొలి అనువాద కావ్యం [[మేఘ సందేశం (సంస్కృతం)]] 1927లో పూర్తయింది. తరువాత కాలంలో వీరు 150 కి పైగా ప్రాచీన సంస్కృత గ్రంథాలను, దర్శనాలను, విమర్శనలను, నాటకాలను తెలుగులోకి అనువదించారు. వీరి రచనలలో ముఖ్యమైనవి గణపతి రామాయణ సుధ, భగవద్గీత, చీకటి జ్యోతి. 1961లో హైదరాబాదులో లలితా ప్రెస్ ప్రారంభించారు.
 
వీరు జీవిత కాలమంతా [[ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం]] వేద పండితులుగా, మత సంబంధ సలహా సంఘ సభ్యులుగా మరియు [[తిరుమల తిరుపతి దేవస్థానాలు]] ఆస్థాన విద్వాంసులుగా తమ అనుభవాన్ని పంచారు.
"https://te.wikipedia.org/wiki/చర్ల_గణపతిశాస్త్రి" నుండి వెలికితీశారు