బతుకమ్మ చీరలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
ప్రతిఏటా నవరాత్రుల సందర్భంగా ప్రజాప్రతినిధులు వారివారి ప్రాంతాలలో అర్హులైనవారికి చీరల పంపిణీని ప్రారంభిస్తారు. చీరల పంపిణీకి రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, మున్సిపల్ వార్డులు, కార్పోరేషన్ డివిజన్ల వారీగా రేషన్‌ షాపులకు సమీపంలో పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లో రేషన్‌ డీలర్‌, పంచాయతీ కార్యదర్శి, మహిళా సంఘం ప్రతినిధులతో కూడిన కమిటీ.. పట్టణాలు, నగరాల్లో రేషన్‌ డీలర్‌, మున్సిపల్ బిల్‌ కలెక్టర్‌, మహిళా సంఘం ప్రతినిధుల కమిటీ ఆధ్వర్యంలో పంపిణీ జరుగుతుంది. ఆహార భద్రత కార్డులతో వచ్చి మహిళలు చీరలు తీసుకునే అవకాశం ఉంటుంది.
 
# '''2017:''' 2017 సంవత్సరంలో 1,04,57,610 మందికి రేషన్ షాపుల ద్వారా సెప్టెంబర్సెప్టెంబరు 18, 19, 20 తేదీలలో ఈ చీరలు పంపిణీ చేశారు.
#'''2019:''' 2019 సంవత్సరంలో కోటి బతుకమ్మ చీరల కోసం ప్రభుత్వం 313 కోట్ల రూపాయలు ఖర్చు చేసి, 16 వేలమంది నేత కార్మికులలో, 26 వేలమగ్గాలపై ఈ చీరలను తయారుచేయించింది. 10 రకాల డిజైన్స్‌తో, 10 రకాల రంగులతో... 10 లక్షల చీరలను 9 మీటర్ల పొడవు, మిగతా 90 లక్షల చీరలు 6 మీటర్ల పొడుగుతో తయారుచేయబడ్డాయి. సెప్టెంబరు 23 నుంచి చీరల పంపిణీ జరిగింది.
#'''2020:''' 2020లో 287 డిజైన్లలో చీరల తయారీకి రూ.317 కోట్లు ఖర్చు చేయబడింది. సిరిసిల్ల, గర్షకుర్తి, వరంగల్ లోని మరమగ్గాలపై ఈ చీరలు తయారయ్యాయి. [[కరోనా వైరస్ 2019|కరోనా]] నేపథ్యంలో స్వయం సహాయక సంఘాల సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ వెళ్ళి చీరలను అందజేశారు. అప్పుడు తీసుకోలేని వారికి 2020 అక్టోబరు 12 నుంచి 15వ తేదీ వరకు రేషన్‌ దుకాణాల ద్వారా చీరలు పంపిణీ చేశారు.<ref>{{Cite web|url=http://www.telugudunia.in/coronavirus-news/bathukamma-sarees-distribution/,%20http://www.telugudunia.in/coronavirus-news/bathukamma-sarees-distribution/|title=Bathukamma Sarees: రేపట్నుంచి బతుకమ్మ చీరలు పంపిణీ… - Telugudunia|date=2020-10-08|website=www.telugudunia.in|language=en-US|url-status=live|archive-url=http://web.archive.org/web/20220120163839/http://www.telugudunia.in/coronavirus-news/bathukamma-sarees-distribution/|archive-date=2022-01-20|access-date=2022-01-20}}</ref>
#'''2021:''' 2021 సంవత్సరంలో కోటి బతుకమ్మ చీరల తయారీకి 318 కోట్ల రూపాయలను ఖర్చుచేశారు. దాదాపు 16 వేల మగ్గాలపై పదివేల నేత కుటుంబాలు ఆరునెలలపాటు శ్రమించి చీరలను తయారు చేశాయి. గతంలో మహిళల నుంచి అభిప్రాయాలను సేకరించి, ఈసారి సరికొత్తగా 17 రంగులు, 17 డిజైన్లతో కలిపి మొత్తం 289 రంగులతో, డాబీ అంచుతో సరికొత్తగా రూపొందించారు. సిరిసిల్లలో 75 లక్షలు, వరంగల్లులో 13 లక్షలు, కరీంనగర్ లో 12 లక్షల చీరలు తయారుచేయబడ్డాయి.<ref>{{Cite web|url=https://www.ntnews.com/news/bathukamma-sarees-2021-are-ready-and-packing-at-hyderabad-chandrayan-gutta-225340|title=చ‌క‌చ‌కా బ‌తుక‌మ్మ చీర‌ల ప్యాకింగ్‌!|date=2021-09-28|website=Namasthe Telangana|language=en-US|url-status=live|archive-url=https://web.archive.org/web/20220120170422/https://www.ntnews.com/news/bathukamma-sarees-2021-are-ready-and-packing-at-hyderabad-chandrayan-gutta-225340|archive-date=2022-01-20|access-date=2022-01-20}}</ref>
"https://te.wikipedia.org/wiki/బతుకమ్మ_చీరలు" నుండి వెలికితీశారు