బతుకమ్మ చీరలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
#'''2019:''' 2019 సంవత్సరంలో కోటి బతుకమ్మ చీరల కోసం ప్రభుత్వం 313 కోట్ల రూపాయలు ఖర్చు చేసి, 16 వేలమంది నేత కార్మికులలో, 26 వేలమగ్గాలపై ఈ చీరలను తయారుచేయించింది. 10 రకాల డిజైన్స్‌తో, 10 రకాల రంగులతో... 10 లక్షల చీరలను 9 మీటర్ల పొడవు, మిగతా 90 లక్షల చీరలు 6 మీటర్ల పొడుగుతో తయారుచేయబడ్డాయి. సెప్టెంబరు 23 నుంచి చీరల పంపిణీ జరిగింది.<ref>{{Cite web|url=https://zeenews.india.com/telugu/telangana/bathukamma-sarees-gets-ready-to-be-distributed-in-telangana-it-minister-ktr-16764|title=కోటి బతుకమ్మ చీరల పంపిణీకి సర్వం సిద్ధం|date=2019-09-19|website=Zee News Telugu|language=te|url-status=live|archive-url=https://web.archive.org/web/20220120172501/https://zeenews.india.com/telugu/telangana/bathukamma-sarees-gets-ready-to-be-distributed-in-telangana-it-minister-ktr-16764|archive-date=2022-01-20|access-date=2022-01-20}}</ref>
#'''2020:''' 2020లో 287 డిజైన్లలో చీరల తయారీకి రూ.317 కోట్లు ఖర్చు చేయబడింది. సిరిసిల్ల, గర్షకుర్తి, వరంగల్ లోని మరమగ్గాలపై ఈ చీరలు తయారయ్యాయి. [[కరోనా వైరస్ 2019|కరోనా]] నేపథ్యంలో స్వయం సహాయక సంఘాల సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ వెళ్ళి చీరలను అందజేశారు. అప్పుడు తీసుకోలేని వారికి 2020 అక్టోబరు 12 నుంచి 15వ తేదీ వరకు రేషన్‌ దుకాణాల ద్వారా చీరలు పంపిణీ చేశారు.<ref>{{Cite web|url=http://www.telugudunia.in/coronavirus-news/bathukamma-sarees-distribution/,%20http://www.telugudunia.in/coronavirus-news/bathukamma-sarees-distribution/|title=Bathukamma Sarees: రేపట్నుంచి బతుకమ్మ చీరలు పంపిణీ… - Telugudunia|date=2020-10-08|website=www.telugudunia.in|language=en-US|url-status=live|archive-url=http://web.archive.org/web/20220120163839/http://www.telugudunia.in/coronavirus-news/bathukamma-sarees-distribution/|archive-date=2022-01-20|access-date=2022-01-20}}</ref>
#'''2021:''' 2021 సంవత్సరంలో కోటి బతుకమ్మ చీరల తయారీకి 318 కోట్ల రూపాయలను ఖర్చుచేశారు. దాదాపు 16 వేల మగ్గాలపై పదివేల నేత కుటుంబాలు ఆరునెలలపాటు శ్రమించి చీరలను తయారు చేశాయి. గతంలో మహిళల నుంచి అభిప్రాయాలను సేకరించి, ఈసారి సరికొత్తగా 17 రంగులు, 17 డిజైన్లతో కలిపి మొత్తం 289 రంగులతో, డాబీ అంచుతో సరికొత్తగా రూపొందించారు. వృద్ధులకు 6.3 మీటర్లు, ఇతరులకు 5.5 మీటర్ల చీరలను తయారు చేశారు. సిరిసిల్లలో 75 లక్షలు, వరంగల్లులో 13 లక్షలు, కరీంనగర్ లో 12 లక్షల చీరలు తయారుచేయబడ్డాయి.<ref>{{Cite web|url=https://www.ntnews.com/news/bathukamma-sarees-2021-are-ready-and-packing-at-hyderabad-chandrayan-gutta-225340|title=చ‌క‌చ‌కా బ‌తుక‌మ్మ చీర‌ల ప్యాకింగ్‌!|date=2021-09-28|website=Namasthe Telangana|language=en-US|url-status=live|archive-url=https://web.archive.org/web/20220120170422/https://www.ntnews.com/news/bathukamma-sarees-2021-are-ready-and-packing-at-hyderabad-chandrayan-gutta-225340|archive-date=2022-01-20|access-date=2022-01-20}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/బతుకమ్మ_చీరలు" నుండి వెలికితీశారు