బతుకమ్మ చీరలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
 
# '''2017:''' 2017 సంవత్సరంలో 1,04,57,610 మందికి రేషన్ షాపుల ద్వారా సెప్టెంబరు 18, 19, 20 తేదీలలో ఈ చీరలు పంపిణీ చేశారు.
#'''2018:''' 2018 సంవత్సరంలో రూ.280 కోట్ల వ్యయంతో 80 రంగుల్లో 95లక్షల జరీ అంచు పాలిస్టర్‌ చీరలను మరమగ్గాలపై తయారుచేయించారు. అక్టోబరు 12 నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ కార్యక్రమం జరగాల్సివుండగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున చీరల పంపిణీకి రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించింది. ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడిన తరువాత డిసెంబరు 19న చీరల పంపిణి ప్రారంభమయింది.
#'''2019:''' 2019 సంవత్సరంలో కోటి బతుకమ్మ చీరల కోసం ప్రభుత్వం 313 కోట్ల రూపాయలు ఖర్చు చేసి, 16 వేలమంది నేత కార్మికులలో, 26 వేలమగ్గాలపై ఈ చీరలను తయారుచేయించింది. 10 రకాల డిజైన్స్‌తో, 10 రకాల రంగులతో... 10 లక్షల చీరలను 9 మీటర్ల పొడవు, మిగతా 90 లక్షల చీరలు 6 మీటర్ల పొడుగుతో తయారుచేయబడ్డాయి. సెప్టెంబరు 23 నుంచి చీరల పంపిణీ జరిగింది.<ref>{{Cite web|url=https://zeenews.india.com/telugu/telangana/bathukamma-sarees-gets-ready-to-be-distributed-in-telangana-it-minister-ktr-16764|title=కోటి బతుకమ్మ చీరల పంపిణీకి సర్వం సిద్ధం|date=2019-09-19|website=Zee News Telugu|language=te|url-status=live|archive-url=https://web.archive.org/web/20220120172501/https://zeenews.india.com/telugu/telangana/bathukamma-sarees-gets-ready-to-be-distributed-in-telangana-it-minister-ktr-16764|archive-date=2022-01-20|access-date=2022-01-20}}</ref>
#'''2020:''' 2020లో 287 డిజైన్లలో చీరల తయారీకి రూ.317 కోట్లు ఖర్చు చేయబడింది. సిరిసిల్ల, గర్షకుర్తి, వరంగల్ లోని మరమగ్గాలపై ఈ చీరలు తయారయ్యాయి. [[కరోనా వైరస్ 2019|కరోనా]] నేపథ్యంలో స్వయం సహాయక సంఘాల సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ వెళ్ళి చీరలను అందజేశారు. అప్పుడు తీసుకోలేని వారికి 2020 అక్టోబరు 12 నుంచి 15వ తేదీ వరకు రేషన్‌ దుకాణాల ద్వారా చీరలు పంపిణీ చేశారు.<ref>{{Cite web|url=http://www.telugudunia.in/coronavirus-news/bathukamma-sarees-distribution/,%20http://www.telugudunia.in/coronavirus-news/bathukamma-sarees-distribution/|title=Bathukamma Sarees: రేపట్నుంచి బతుకమ్మ చీరలు పంపిణీ… - Telugudunia|date=2020-10-08|website=www.telugudunia.in|language=en-US|url-status=live|archive-url=http://web.archive.org/web/20220120163839/http://www.telugudunia.in/coronavirus-news/bathukamma-sarees-distribution/|archive-date=2022-01-20|access-date=2022-01-20}}</ref>
"https://te.wikipedia.org/wiki/బతుకమ్మ_చీరలు" నుండి వెలికితీశారు