శెట్టిబలిజ: కూర్పుల మధ్య తేడాలు

added Content about setti balija
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 43.241.64.136 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 3410346 ను రద్దు చేసారు. సరైన ఆధారాలు లేవు
ట్యాగులు: రద్దుచెయ్యి చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 2:
శెట్టిబలిజ కుల చరిత్ర
 
శెట్టిబలిజ లు చాలా పురాతనమైన వారు. వీరిని శెట్టి, శెట్టిగాళ్లు, శెట్టిగారు వంటి పేర్లతో పిలుస్తారు. వీరు తూర్పు , పశ్చిమ గోదావరి జిల్లాల్లో అధికంగా కనిపిస్తారు. వీరు బర్మా, రంగూన్ వంటి దేశాల్లో వ్యాపార, వర్తకులను నడిపేవారు. వీరు కుల పెద్దలు గా, మోతు బార్లు గా సంఘము లో తీర్పులు చెప్పేవారు. 1920 లో శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారు తన జాతి పేరుని మొట్టమొదటసారిగా రిజిస్టర్ చేయించారు. కోనసీమ లో అధికం గా ఉండే శెట్టి బలిజలు ఆధునిక సమాజం లో అనేక కుల వృత్తి ల మీద ఆధారపడి జీవిస్తున్నారు. వీరి వంశ గోత్ర నామాలు ఒరిస్సాలోని పర్లాకిమిడి రాజుల ఆస్థానం లో తాళపత్ర గ్రంధాలో భద్ర పరచబడి ఉన్నవి. శెట్టి బలిజ లకి గౌడ, బలిజ కులానికి ఎటువంటి సంబంధమూ లేదు.
శెట్టి బలిజలు( గ్రేటర్ రాయలసీమ) బలిజ కులానికి ఉప కులం
 
శెట్టిలు, శెట్టి కులస్తులు, శెట్టిబలిజలు
 
శెట్టిలు, శెట్టి కులస్తులు, శెట్టిబలిజలుఅని పిలవబడే వీరు పురాతన కాలం నుండి వందలమంది గుంపు గుంపులుగా - మిరియాలు, యాలకులు, పోకలు, ధనియాలు, పప్పు దినుసులు, సుగంధ ద్రవ్యాలు, ముత్యాలు, పగడాలు, బంగారం, వెండి వంటివి దూర దేశాలనుండి వందలాదిగా ఎడ్లబండ్లలో నింపుకుని వాటిని కావలసిన చోటకు తీసుకుని పోయి అమ్మేవారు. వీరిది వణిజ వర్ణం లేదా వైశ్య వర్ణం.
 
వీరి వద్ద ఉన్న కుల పురాణాల ప్రకారం వీరు, అంధకాసుర అనే రాక్షసుణ్ణి సంహరించడానికి, దేవతల వర ప్రసాదంగా యజ్ఞగుండంలోనుండి పుట్టిన పృధ్విశ్వర అనే యజ్ఞ సంభవుని వంశీయులు. అంధకాసురుని పుర్రెను తక్కెడ తట్టలుగా, వెన్నుపూసను తక్కెడ కోలగా, ప్రేగులను తక్కెడ త్రాళ్లుగా చేసుకుని దాని సహాయంతో దేశదేశాలలోను వాణిజ్యము చేసి జీవించెను. ఈతను కాశీనగరానికి అధిపతిగ ఉండెను. గంధర్వ రాజకన్యను వివాహమాడెను. ఈతనికి 8మంది కుమారులు 2 కుమార్తెలు గలగగా వీరెవ్వరికి సంతానం లేకపోవడంతో దక్షిణాదిన కంచి వచ్చి కామాక్షి అమ్మను ప్రార్ధించగా ఆమె వరప్రసాదం వలన ఈతనికి 24 గురు మనుమలు పుట్టగా వీరందరూ తరువాత వారి వారి వంశాలకు వంశకర్తలు అవడం వలన వీరి సంతతిలో 24 గోత్రాలు ఏర్పడినవి. వీరిలో 16 వంశకర్తలు పురుష సంతతికి చెందినవారు కాగా 8 వంశకర్తలు స్త్రీ సంతతికి చెందినవారు కావడంతో 16 వంశకర్తల గోత్ర సంతతులు 8 వంశ కర్తల గోత్ర సంతతులతో మాత్రమే వైవాహిక సంబంధాలు కలిగి ఉండాలి అనే సంప్రదాయాన్ని తరతరాలుగా అనుసరిస్తూ వచ్చినారు. వీరు నేడు అనేక వందల గృహనామాలతో ఉన్నారు. కంచికామాక్షమ్మ వీరికి ఇలవేలుపు. కంచి ప్రాంతాన్ని 24 వీడులు చేసుకుని పరిపాలన చేసినారు. వీరికి కంచి కామాక్షమ్మ వరప్రసాదులు, కాంచిపుర వరాధీశ్వర అనే బిరుదులు గలవు. వీరికి పృధ్విశెట్టి, పట్టణస్వామి, దేశాయిశెట్టి, దేశాధిపతి, శెట్టి అనే సామాజిక పెద్దలుగా హోదాలు ఉన్నాయి.
చోళ రాజుల కాలంలో వ్యాపార ప్రముఖులుగా, సైన్యాధిపతులుగా ఉంటూ, రాజబంధువులుగా ఉంటూ, పాండ్య రాజులతో, చేర రాజులతో, కొంకణ రాజులతో, గుజరాతు దేశం రాజులతో అనేక యుద్దాలు చేసినట్టు వీరి కుల చరిత్రలో వివరాలు గలవు. బలిజ శెట్టి సమయాలకు పెద్దలుగా, కుడిచేయి కులాలన్నింటికీ కుల పెద్దలుగా వ్యవహారాలు చక్కబెట్టేవారు. ఏ కులంలో తగాదాలు వచ్చినా వీరి తీర్పే అంతిమ తీర్పుగా ఉండేది. అంతటి ధర్మ నిరతులు వీరు. దీనికి సంబందించిన శాసనం కంచి లో ఉన్నదని తెలుస్తుంది. మంత్రి మహానాడు బలిజ సమయంలో కులాల కుల కట్టుబాట్లు నిర్ణయించి, అమలు జరిపేవారు. వర్ణాశ్రమ ధర్మాలు అతిక్రమణ జరగకుండా కాపాడేవారు. కంచి ప్రాంతంనుండి ఈ శెట్టిబలిజ తెగవారు తరతరాలుగా ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ప్రాంతాలకు విస్తరిస్తూ వచ్చెను.
 
18వ శతాబ్దంలో కల్నల్ మెకంజీ అనే బ్రిటిష్ అధికారి సేకరించిన అనేక వేల తాళపత్ర గ్రంధాలలో వీరికి సంబందించిన వంశ చరిత్రలు కుల గాధలు - వలంగై ఇడంగై వరలారు వంటివి మద్రాస్ ఓరియంటల్ లైబ్రరీ, లండన్ బ్రిటిష్ లైబ్రరీ, కలకత్తా లైబ్రరీ వంటి చోట్ల భద్రపరచబడి ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/శెట్టిబలిజ" నుండి వెలికితీశారు