వాడుకరి చర్చ:SATYA SAI VISSA: కూర్పుల మధ్య తేడాలు

2,674 బైట్లు చేర్చారు ,  3 నెలల క్రితం
:మీరు అభిమానంతో చేసిన సూచనలకు నా హృదయపూర్వక కృతజ్నతలు వ్యాసాలలో మూలాలు పెట్టాలి, మూలాలు లేనిచో నిర్వాహకులు వ్యాసాన్ని తొలగిస్తారు అని రాసారు అది ఏమిటో కొంచెం వివరించగలరు. అలాగే శీర్షికలో విస్సా ఫౌండేషన్ అని పెట్టకూడదు అన్నారు వెంటనే తొలగిస్తాను. దయచేసి ఇకముందు కూడా మీ అమూల్య సలహాలు, సూచనలు అందించమని మనవి [[వాడుకరి:SATYA SAI VISSA|SATYA SAI VISSA]] ([[వాడుకరి చర్చ:SATYA SAI VISSA|చర్చ]]) 10:21, 23 జనవరి 2022 (UTC)
::సత్యసాయి విస్సా గారూ, వికీలో ఏది రాయాలన్నా దానికి కనీసం రెండు మూడు ప్రామాణిక ఆధారాలు (మూలాలు) ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ప్రముఖమైన అంశాలే ఉంటాయి. ఆ ప్రామాణికతను నిర్ధారించడం కోసం మంచి రచయితలు రాసిన, పేరొందిన ప్రచురణ కర్తలు ప్రచురించిన పుస్తకాలైనా, ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి వార్తా పత్రికలైనా, ఇదివరకే ప్రచురించబడ్డ పరిశోధనా పత్రాలైనా ప్రమాణంగా తీసుకుంటారు. అంటే ఇక్కడ కేవలం మీరు ఎక్కడో విన్నవి, కన్నవి రాయకూడదు. దానికి ఆధారాలు చూపించాలి. అవి ప్రముఖమైనవే నని నిర్ధారించాలి. వీటి గురించి వివరంగా తెలియాలంటే మీకు పైన అర్జున గారు చెప్పినట్లు స్వాగత సందేశంలో కొన్ని లింకులు ఉన్నాయి. వాటిని చదివి అర్థం చేసుకుని తర్వాత రాయడం మొదలుపెట్టండి. లేదంటే వికీలో ఇదివరకే ఉన్న వ్యాసాలు ఎలా ఉన్నాయో చూడండి. మీకు ఒక అవగాహన వస్తుంది. - [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 13:35, 24 జనవరి 2022 (UTC)
 
== విస్సా వారి వంశ చరిత్ర: ==
 
[[విస్సా వారి వంశ చరిత్ర:]] వ్యాసంలో కింది అనౌచిత్యాలను గమనించాను.
 
# విషయ ప్రాముఖ్యత లేదు. విస్సా వారి వంశానికి వికీ పేజీ ఉండేంత ప్రాముఖ్యత ఉందని తగు మూలాలతో నిరూపించాలి. వివరాలకు [[వికీపీడియా:విషయ ప్రాముఖ్యత]] చూడండి.
# చూసారట, చేసారట వంటి కల్పనలు రాసారు. క్షేత్ర మాహాత్మ్యాలు రాసినట్లుగా రాయకూడదు.. [[వికీపీడియా:నమ్మదగ్గ మూలాలు|సముచితమైన]], [[వికీపీడియా:నిర్ధారత్వం|నిర్థారించదగ్గ]] మూలాలతో రాయాలి. అవసరమైతే [[వికీపీడియా:మూలాలు|మూలాల గురించి]] మరింత చదవండి.
# విదుషీమణి, పుంభావ సరస్వతి వంటి వర్ణనలు రాయకూడదు. వ్యక్తుల కీర్తిగానాన్ని వినిపించరాదు. అది [[వికీపీడియా:శైలి|వికీశైలికి]] విరుద్ధం.
ప్రస్తుతమున్న రూపంలో ఈ వ్యాసాన్ని తక్షణమే తొలగించాల్సి ఉంది. అయితే చర్చించమని మీరు అక్కడ నోటీసు పెట్టారు కాబట్టి ఇక్కడ రాస్తున్నాను. మీకు వికీపీడివిషయ ప్రాముఖ్యత గురించి తెలుసని అక్కడ అన్నారు. బహుశా పైన నేను రాసినది అసలు రాయాల్సిన అవసరం లేదేమో తెలీదు. ఏది ఏమైనప్పటికీ, ఆ వ్యాసంలో తగు మార్పులు చెయ్యవలసినదిగా వినతి. __ [[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 07:50, 27 జనవరి 2022 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3457572" నుండి వెలికితీశారు