అంతర్జాలంలో తెలుగు: కూర్పుల మధ్య తేడాలు

రచ్చబండ గురించి
→‎తొలి అడుగులు: ఫాంట్ల గురించి మరి కొంత
పంక్తి 12:
ఆ తరువాత యాహూ గ్రూప్స్ లో రచ్చబండ అనే ఒక సమూహం చాలా చురుగ్గా ఉండేది. తెలుగు సాహిత్యం గురించి, సాహితీకారుల గురించీ పరిణతితో కూడిన చర్చలు జరుగుతూ ఉండేవి. కొందరు సాహితీకారులు ఇందులో సభ్యులుగా ఉండేవారు. కొన్నాళ్ల తరువాత ఈ యాహూ గ్రూపుకు, గూగుల్ గ్రూప్స్ లో ఒక మిర్రరు సమూహాన్ని సృష్టించారు. 2011 తరువాత దానిలో చురుకుదనం తగ్గి చర్చలు ఆగిపోయాయి. యాహూ సంస్థ 2020 లో గ్రూప్స్‌ను శాశ్వతంగా మూసివేయడంతో రచ్చబండ మూతబడింది.
 
=== కంప్యూటర్లలో తెలుగును చూపించడం ===
== ఫాంట్ల తయారీ ==
 
=== కంప్యూటరులో తెలుగు రాయడం ===
 
== ఫాంట్ల తయారీరంగంలో ==
మొదట్లో తెలుగు ఫాంట్లు యుణికోడులో కాకుండా వేరే ఎన్‌కోడింగు పద్ధతుల్లో ఉండేవి. అను ఫాంట్స్ అనేవి అటువంటి ఒక ఫాంట్లే. ఇవి ఉచితంగా లభించవు, కొనుక్కోవాలి. వీటిని డెస్క్ టాప్ పబ్లిషింగులో విస్తృతంగా వాడేవారు. ఇప్పటికీ వాడుతున్నారు. [[ఈనాడు]], [[ఆంధ్రజ్యోతి]] వంటి పత్రికల వారు ప్రత్యేకంగా తయారు చేసుకున్న ఫాంటులు వాడేవారు. ఆ పత్రికలు చదవాలంటే ఆ వెబ్‌సైట్లలో వాళ్ళ ఫాంట్లను పాఠకుల కంప్యూటర్ల లోకి దించుకోవాలి. అప్పుడే ఆ తెలుగు అక్షరాలు కనిపించేవి. లేకపోతే అర్థం కాని బొమ్మలు, పెట్టెలూ కనిపించేవి. యూనికోడ్ ఫాంట్ల రాకతో ఆ సమస్య తీరిపోయింది. అయితే ఆ తరువాత కూడా అనేక సంవత్సరాల పాటు ఈనాడు తమ స్వంత ఫాంట్లనే వడడం చేత, ఆ సైటులో తెలుగు చూడాలంటే వారి ఫాంట్లను దించుకోక తప్పేది కాదు.
 
తెలుగు ఫాంట్లు అప్పటికి ఇంకా అందుబాటు లోకి రాలేదు. మొదటి తెలుగు ఫాంటు పోతనను తిరుమల కృష్ణ దేశికాచారి సృష్టించాడు. అయితే ఇది ISO-8859-1 ఎన్‌కోడింగు ప్రమాణాలకు అనుగుణంగా లేనందున వెబ్‌పేజీల్లో వాడే వీలు లేకపోయింది. జువ్వాడి రమణ దాన్ని సవరించి తిక్కన 1.0 అనే పేరుతో విడుదల చేసాడు. కానీ అందులో కొన్ని తీవ్రమైన లోపాలు ఉండటాన, దాన్ని చోడవరపు ప్రసాదు, జువ్వాడి రమణలు సవరించి తిక్కన 1.1 గా విడుదల చేసారు.<ref>{{Cite web|url=http://www.ghantasala.info/help/tikkana_help.html|title=తిక్కన ఫాంట్స్|website=www.ghantasala.info|url-status=live|archive-url=https://web.archive.org/web/20220102214953/http://www.ghantasala.info/help/tikkana_help.html|archive-date=2022-01-27|access-date=2022-01-27}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/అంతర్జాలంలో_తెలుగు" నుండి వెలికితీశారు