అజయ్ దేవ్‌గణ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
==నేపధ్యము==
[[File:Padma Shri India IIIe Klasse.jpg|right|thumb|60px|[[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]]పురస్కారం]]
అజయ్‌ దేవగణ్‌ తండ్రి వీరూ దేవగణ్‌ [[బాలీవుడ్|బాలీవుడ్‌]] దర్శకుడు, [[స్టంట్‌ మాస్టర్‌]]. తండ్రి వల్ల అజయ్‌కు మొదట్నుంచీ మార్షల్‌ ఆర్ట్స్‌పై ఇష్టం ఏర్పడింది. [[ఫూల్‌ ఔర్‌ కాంటే]] చిత్రంతో ఆయన వెండితెరకు పరిచయమయ్యాడు. తొలి చిత్రంలోనే నటనతో మెప్పించి [[ఫిల్మ్‌ఫేర్|ఫిలింఫేర్‌ పురస్కారం]] అందుకున్నాడు. రెండో చిత్రం జిగర్‌లో తన మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రావీణ్యం చూపించి యాక్షన్‌ హీరోగా పేరుతెచ్చుకున్నాడు. జఖ్మ్‌ చిత్రంలో మతవిద్వేషాల మధ్య నలిగిపోయిన యువకుడిగా అద్భుత నటన ప్రదర్శించి జాతీయ పురస్కారం సాధించాడు. [[హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌]] అజయ్‌ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ చిత్రంలో ఆయన నటనకు మంచి ప్రశంసలతో పాటు ఫిలింఫేర్‌ నామినేషన్‌ దక్కింది. '''ది లెజెండ్‌ ఆఫ్‌ భగత్‌ సింగ్‌ ''' లో [[భగత్ సింగ్|భగత్‌ సింగ్‌]] పాత్రకు ప్రాణం పోసి జాతీయ పురస్కారం సాధించాడు. దీవాంగేలో ప్రతినాయక పాత్రతోనూ [[ఫిలింఫేర్|ఫిలింఫేర్‌]] పురస్కారం గెలుచుకున్నాడు. బాలీవుడ్‌లో ప్రముఖ యాక్షన్‌ హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నా గోల్‌ మాల్‌ సిరీస్‌, ఆల్‌ ది బెస్ట్‌ లాంటి వినోద ప్రధాన చిత్రాల్లోనూ ఆకట్టుకున్నాడు. 'యూ మీ ఔర్‌ హమ్‌'తో దర్శకుడిగా మారాడు. అజయ్‌ దేవగణ్‌ ఫిలింస్‌ స్థాపించి పలు చిత్రాలను నిర్మించాడు. కంపెనీ, రెయిన్‌ కోట్‌, గంగాజల్‌, ఓంకార, రాజ్‌నీతి, సింగం, దృశ్యం, [[జఖ్మ్]], [[తానాజీ]], [[గంగూబాయి కతియావాడి]] తదితర చిత్రాల్లో ఆయన మంచి [[నటన]] కనబర్చాడు.<ref name="వెండితెర అజేయుడు">{{cite web|url=http://www.eenadu.net/telugumovies/cinemanews.aspx?item=cinema&no=11|title=వెండితెర అజేయుడు|publisher=[[ఈనాడు]]|date=2016-1-26|accessdate=2016-1-26|website=|archive-url=https://web.archive.org/web/20160125233253/http://www.eenadu.net/telugumovies/cinemanews.aspx?item=cinema&no=11|archive-date=2016-01-25|url-status=dead}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/అజయ్_దేవ్‌గణ్" నుండి వెలికితీశారు