అంతర్జాలంలో తెలుగు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
→తెలుగులో వెబ్సైట్లు: కంప్యూటర్లలో తెలుగును చూపించడం విభాగంలో సమాచార్ం చేర్పు |
→పత్రికలు: ఆర్కుట్ గురించి |
||
పంక్తి 27:
=== పత్రికలు ===
తెలుగు వార్తా పత్రికల్లో మొదటగా అంతర్జాలంలో ప్రవేశించినది ఈనాడు. తొలుత ఈసైటులో వార్తలను కారెక్టర్ల రూపంలో కాకుండా, బొమ్మల రూపంలో ప్రచురించేవారు. ఆ తరువాత తమ స్వంత ఫాంట్లతో ప్రచురించడం మొదలుపెట్టారు. అయితే వాడుకరులకు తెలుగు కనబడేది కాదు చిక్కిరి బిక్కిరి కారెక్టర్లు కనబడేవి. ఆ సైటు నుండి ఫాంట్లను వాడుకరి కంప్యూటరు లోకి దించుకుంటే, అప్పుదు తెలుగు అక్షరాలు కనబడేవి. ఈ పద్ధతినే అంధ్రజ్యోతి వంటి ఇతర వెబ్సైట్లు కూడా అనుసరించాయి. యూనికోడ్ వచ్చాక ఈ సమస్య తీరిపోయింది. యూనికోడు రూపంలో ఏ భాషలో ప్రచురించిన పేజీ అయినా ఫాంట్లేవీ దించుకునే అవసరం లేకుండానే ఏ కంప్యూటరులోనైనా కనబడేది.
=== సామాజిక మాధ్యమాలు - ఆర్కుట్తో తెలుగు మొదలు ===
గూగుల్ వారి అర్కుట్, సామాజిక నెట్వర్కింగు సైట్లలో మొదటిది. ఇది 2004 లో మొదలైంది. 2007 నాటికి ఆర్కుట్ ఇంటర్ఫేసును తెలుగులోకి అనువదించింది.
== ఫాంట్ల రంగంలో ==
|