అంతర్జాలంలో తెలుగు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు భాష చరిత్ర ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
→‎top: యూనీకోడ్ వివరము
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 1:
[[అంతర్జాలం]]<nowiki/>లో తెలుగు చరిత్ర 1990 లలో మొదలైంది. ఐ.ఆర్.సి చానెళ్ళలో చర్చలతో [[తెలుగు]] మొదలైంది. అది యాహూ గ్రూపులలో కొనసాగింది. అప్పట్లో తెలుగు భాషను రోమను లిపిలో రాసేవాళ్ళు. యూనికోడ్ తెలుగు ఫాంట్ల రాకతో ఆ సమస్య తీరిపోయింది. అ తరువాత తెలుగు యాహూ గ్రూపులను గూగుల్ గ్రూపులను దాటి వెబ్‌సైట్లు, బ్లాగుల లోకి ప్రవేశించింది. ఆ తరువాత ఇతర సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి వాటి లోకి విస్తరించింది.
 
2000 కు ముందు ఉన్న కంప్యూటర్లలో చాలా వరకు తెలుగును సహజంగా చూపేందుకు సాంకేతికంగా సిద్ధంగా ఉండేవి కావు. తెలుగు కనబడాలంటే వాటి ఆపరేటింగ్‌ వ్యవస్థ సెట్టింగుల్లో కొన్ని సర్దుబాట్లు చేసుకోవలసి వచ్చేది. విండోస్ ఎక్స్.పి వచ్చాక అందులో గౌతమి తెలుగు యూనీకోడ్ ఫాంటు వలన ఆ సమస్య చాలా వరకు తీరిపోయింది. అప్పటి నుండి కంప్యూటర్లు తెలుగును చూపించేందుకు సన్నద్ధమై వచ్చేవి.
 
కంప్యూటర్లో తెలుగులో రాయడం అనేది తరువాతి సమస్య. బహుశా తెలుగు ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు ఇదే. తెలుగులో రాసేందుకు అవసరమైన పనిముట్లను అభివృద్ధి చేసి వెబ్ వ్యాప్తంగా అందుబాటు లోకి తేవడం మొదలయ్యాక ఈ సమస్యకు పరిష్కారం మొదలైంది. రైస్ ట్రాన్స్‌లిటరేషన్ సిస్టమ్‌ అనేది తెలుగును తేలిగ్గా రాయగలిగే తొలి వ్యవస్థ. రోమను లిపిలో తెలుగును రాస్తే తెలుగు లిపి లోకి లిప్యంతరీకరణ చెయ్యడం ఈ పద్ధతి ప్రత్యేకత. ఈ పద్ధతినే వాడి మరింత తేలిగ్గా తెలుగులో రాయగలిగే లేఖిని వంటి ఉపకరణాలు రావడంతో తెలుగులో రాసే వీలు మరింత పెరిగింది. ఆ విధంగా తెలుగు విస్తరణ వేగం పుంజుకుంది.
 
== కంప్యూటరులో తెలుగును సాధ్యపరచిన సాధనాలు ==
"https://te.wikipedia.org/wiki/అంతర్జాలంలో_తెలుగు" నుండి వెలికితీశారు