అంతర్జాలంలో తెలుగు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 13:
 
=== కంప్యూటర్లలో తెలుగును చూపించడం ===
2000 కు ముందు ఉన్న కంప్యూటర్లలో చాలా వరకు తెలుగును సహజంగా చూపేందుకు సాంకేతికంగా సిద్ధంగా ఉండేవి కావు. తెలుగు కనబడాలంటే వాటి ఆపరేటింగ్‌ వ్యవస్థ సెట్టింగుల్లో కొన్ని సర్దుబాట్లు చేసుకోవలసి వచ్చేది. విండోస్ ఎక్స్.పి వచ్చాక ఆ సమస్య చాలా వరకు తీరిపోయింది. ఎక్స్.పి ఆపరేటింగ్ వ్యవస్థలో తెలుగును చూపించే ఏర్పాటు ముందే ఉండేది. ఎలాంటి సెట్టింగులూ చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. గౌతమి ఫాంటు ముందే ఇమిడ్చి ఉండేది<ref>https://docs.microsoft.com/en-us/typography/font-list/gautami</ref>. అయితే, చాలామంది విండోస్ 95, 98 లే వాడుతూ ఉండేవారు కాబట్టి ఈ సమస్య 2007-08 వరకూ ఉంటూనే ఉండేది. ఈ సమస్య తీరిపోవడం అనేది తెలుగు వ్యాప్తిలో తొలి అడ్డంకి తొలగినట్లైంది.
 
=== కంప్యూటరులో తెలుగు రాయడం ===
పంక్తి 21:
 
=== ఈ-తెలుగు ప్రచారం ===
అంతర్జాలంలో తెలుగును వ్యాప్తి చేసేందుకు ఈ-తెలుగు సంస్థ మార్గదర్శక కృషి చేసింది. అంతర్జాలంలో తెలుగును వ్యాపింపజేసే లక్ష్యంతో కొందరు ఔత్సాహికులు 2007 మే లో ఈ-తెలుగు సంస్థను ఏర్పాటు చేసారు.2008 ఏప్రిల్‌లో అధికారికంగా నమోదు చేసారు. "''మీ కంప్యూటరుకు తెలుగొచ్చా?"'' అనే ప్రసిద్ధి గాంచిన ప్రశ్నతో సంస్థ తన ప్రచారం మొదలుపెట్టింది. వివిధ ఆపరేటింగు వ్యవస్థలలో తెలుగు కనబడేలా చేసుకోవడం ఎలా, తెలుగులో రాయడం ఎలా అనేవి చెబుతూ తెలుగుకు ప్రచారం కల్పించింది. అది చురుగ్గా పనిచేసిన సుమారు మూడేళ్ళ కాలంలో, ఉచిత కరపత్రాలతో, చిరుపొత్తాలతో పుస్తక ప్రదర్శనల వంటి ప్రదేశాల్లో క్షేత్ర స్థాయి ప్రచారం నిర్వహించింది. వివిధ బ్లాగు కూడళ్ళకు, వెబ్‌సైట్లకు, వికీపీడియాకు, అంతర్జాల సంబంధ సాంకేతిక సహాయం అందించే సైట్లకూ అది ప్రచారం కల్పించింది.
 
== తెలుగులో వెబ్‌సైట్లు ==
"https://te.wikipedia.org/wiki/అంతర్జాలంలో_తెలుగు" నుండి వెలికితీశారు