అంతర్జాలంలో తెలుగు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
=== ఈ-తెలుగు ప్రచారం ===
అంతర్జాలంలో తెలుగును వ్యాప్తి చేసేందుకు ఈ-తెలుగు సంస్థ మార్గదర్శక కృషి చేసింది. అంతర్జాలంలో తెలుగును వ్యాపింపజేసే లక్ష్యంతో కొందరు ఔత్సాహికులు 2007 మే లో ఈ-తెలుగు సంస్థను ఏర్పాటు చేసారు.2008 ఏప్రిల్‌లో అధికారికంగా నమోదు చేసారు. "''మీ కంప్యూటరుకు తెలుగొచ్చా?"'' అనే ప్రసిద్ధి గాంచిన ప్రశ్నతో సంస్థ తన ప్రచారం మొదలుపెట్టింది. వివిధ ఆపరేటింగు వ్యవస్థలలో తెలుగు కనబడేలా చేసుకోవడం ఎలా, తెలుగులో రాయడం ఎలా అనేవి చెబుతూ తెలుగుకు ప్రచారం కల్పించింది. అది చురుగ్గా పనిచేసిన సుమారు మూడేళ్ళ కాలంలో, ఉచిత కరపత్రాలతో, చిరుపొత్తాలతో పుస్తక ప్రదర్శనల వంటి ప్రదేశాల్లో క్షేత్ర స్థాయి ప్రచారం నిర్వహించింది. వివిధ బ్లాగు కూడళ్ళకు, వెబ్‌సైట్లకు, వికీపీడియాకు, అంతర్జాల సంబంధ సాంకేతిక సహాయం అందించే సైట్లకూ అది ప్రచారం కల్పించింది.
 
== స్థానికీకరణ ==
ప్రజాదరణ పొందిన వివిధ వెబ్‌సైట్ల యూజర్ ఇంటర్‌ఫేసును తెలుగు లోకి అనువదించే స్థానికీకరణ పనులు అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి దోహదం చేసిన మరొక అంశం. వర్డ్‌ప్రెస్, జూమ్లా, ద్రూపల్ వంటి కంటెంటు మేనేజిమెంట్ వెబ్‌సైట్లను, మొజిల్లా వారి అప్లికేషన్లు, గూగుల్‌కు సంబంధించిన వివిధ సైట్లు, వికీపీడియా, వికీసోర్స్ వంటి మీడియావికీ సాఫ్టువేరు వాడే సైట్లు, అనేక ఇతర సైట్ల స్థానికీకరణ ప్రాజెక్టులలో కొందరు విరివిగా పాల్గొనేవారు. ట్రాన్స్‌లేట్‌వికీ వంటి సైట్లలో స్థానికీకరణ ప్రాజెక్టులు నడిచేవి.
 
== తెలుగులో వెబ్‌సైట్లు ==
"https://te.wikipedia.org/wiki/అంతర్జాలంలో_తెలుగు" నుండి వెలికితీశారు