జొన్న: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, typos fixed: భారత దేశం → భారతదేశం, ) → )
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
}}
 
అందరూ ఇష్టపడే [[చిరుధాన్యం]] '''జొన్న''' ([[ఆంగ్లం]]: Sorghum). శరీర నిర్మాణానికి తోడ్పడే మాంసకృత్తులు, శక్తినిచ్చే పదార్థాలతో పాటు రక్తవృద్ధికి తోడ్పడే [[ఇనుము]], [[కాల్షియం]], బి-విటమిన్లు, [[ఫోలిక్‌ ఆమ్లం]] వంటి సూక్ష్మపోషకాలు జొన్నలో పుష్కలంగా లభిస్తాయి. అందుకే రొట్టెలతో పాటు, జొన్నతో చేసిన పేలాల [[లడ్డు]], [[అప్పడాలు]], [[అంబలి]] వంటివి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. 30 దేశాలలో 500 మిలియన్ల ప్రజలు జొన్నలను ప్రధాన ఆహార ధాన్యంగా తీసుకొని జీవిస్తున్నారు. సింధునాగరికతకు సమాంతరంగా కృష్ణా గోదావరీ పరీవాహక ప్రాంతాలలో జొన్నల్నీ బాగానే పండించారు. ఇతర ధాన్యాల కన్నా ఇనుము, జింకు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, జొన్నలు కేలరీలను పెరగనీకుండా శక్తినిస్తాయి. గోధుమలలో ఉండే, గ్లూటెన్ అనే మృదువైన ప్రొటీన్ చాలామందికి సరిపడటం లేదు. జొన్నల్లో గ్లూటెన్ ఉండదు. అందువలన ఈ ప్రత్యామ్నాయ ధాన్యం మీదకు ప్రపంచం తన దృష్టి సారించింది. ఒకవైపున జొన్నలకు ప్రపంచ వ్యాప్తంగా ఈ విధంగా గిరాకీ పెరుగుతుంటే, మనవాళ్ళు పండించటం తగ్గించేస్తున్నారు. భారతదేశంలో గడచిన రెండు దశాబ్దాల కాలంలో 12 మెట్రిక్ టన్నుల నుంచి 7 మెట్రిక్ టన్నులకు జొన్న ఉత్పత్తి పడిపోయిందని [[ఇక్రిశాట్‌|ఇక్రిశాట్]] నివేదిక చెప్తోంది. జొన్నలు ఇప్పుడు బియ్యం కన్నా ఎక్కువ ధర పలుకుతున్నాయి. ధర పెరగటానికి పంట తగ్గిపోవటం, గిరాకి పెరగటం కారణాలు.
రంగు, రుచి, వాసనా లేకుండా తటస్థంగా ఉంటుంది కాబట్టి, జొన్నపిండి ఏ ఇతర వంటకంలో నయినా కలుపుకోవటానికి వీలుపడుతుంది.
 
"https://te.wikipedia.org/wiki/జొన్న" నుండి వెలికితీశారు