యానాదులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[యానాదులు]] అనగా ఒక సంచార గిరిజన [[తెగ]]కు చెందిన ప్రజలు. [[నల్లమల]] అడవుల నుంచి నెల్లూరు సముద్రతీరం వరకూ విస్తరించిన యానాదులు, సామాజిక పరిణామంలో ఆహార సేకరణ దశకు చెందిన జాతి. ఒక యానాదికి భూస్వామి మణియంకు, మధ్య జరిగిన సంఘర్ణణను డా॥ కేశవరెడ్డి ‘‘చివరి గుడిసె’’ నవలలో చిత్రించారు. గిరిజనుల కళల్లో ముఖ్యమైనది చిందు నాట్యం. యానాదులు, ఎరుకలు, సుగాలీలు పండుగ పర్వదినాలలో చిందులేస్తారు. వివిధ పురాణ పాత్రలు గూడా ధరిస్తారు. యానాదులు ‘రంగము’ అనే ఆట ఆడతారు. ఏదైనా వస్తువు పోయిందని తెలిస్తే బాగా సారాయి తాగి వాద్యం వాయిస్తూ నృత్యం చేస్తూ వారి కులదైవాన్ని గొంతెత్తి ఆలపిస్తారు. వారి దేవత వారి శరీరంలో ప్రవేశించి ([[పూనకం]] వచ్చి) పోయిన వస్తువు జాడ తెలుపుతుంది. చిత్తూరు జిల్లా, కుప్పం మండలంలో [[యానాదిపల్లె]] అనే ఓ గ్రామం ఉంది. ఎక్కడికక్కడ వీరు నివాస స్థలాలను అమ్మి వేరే ప్రాంతాలకు తరలిపోతూ ఉంటారు. గ్రామాలలో రైతుల పొలాలలో కూలికి [[ఎలుకలు]] పడుతూ కొంతమంది జీవిస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/యానాదులు" నుండి వెలికితీశారు