జిక్కి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
}}
 
'''జిక్కి''' అని ముద్దుగా పిలుచుకునే '''పి.జి.కృష్ణవేణి''' ([[నవంబరు 3]], [[1938]] - [[ఆగష్టు 16]], [[2004]]) [[తెలుగు]], [[తమిళ]], [[కన్నడ]], [[మలయాళ]], [[శ్రీలంక|సింహళ]], [[హిందీ సినిమా రంగం|హిందీ]] భాషలలో సినీ గాయకురాలు. మూడు దశాబ్దాల పాటు పదివేలకు పైగా పాటలు పాడారు. [[చిత్తూరు]] జిల్లాలోని [[చంద్రగిరి]]లో జన్మించిన జిక్కి ఏ సంగీత శిక్షణ లేక పోయినా వినికిడి జ్ఞానంతో పాడటం నేర్చుకొన్నది. జిక్కి తండ్రి [[చెన్నై|మద్రాసు]]లో స్టూడియోలో చిన్నాచితక పనులు చేస్తుంటే ఆమె ఎప్పుడైనా వెళ్లినపుడు అదంతా తిరిగేది. అలా తిరుగుతున్నపుడు చూసిన దర్శకులు [[గూడవల్లి రామబ్రహ్మం]], [[పంతులమ్మ (1943 సినిమా)|పంతులమ్మ]] (1943) సినిమాలో చిన్నవేషంతో పాటు పాట పాడే అవకాశం కల్పించారు. జిక్కి గాయకుడైన [[ఏ.ఎమ్.రాజా]]ను ప్రేమవివాహం చేసుకున్నది. వీరికి ఆరుగురు సంతానం. అరవయ్యేళ్లు దాటాక కూడా ఆమె [[ఆదిత్య 369]] సినిమాలో ''[[జాణవులే నెరజాణవులే]]...'' అనే పాట పాడి తన గొంతులో ఇంకా వాడి తగ్గలేదని నిరూపించారు
 
==ప్రాచుర్యం పొందిన గీతాలు==
"https://te.wikipedia.org/wiki/జిక్కి" నుండి వెలికితీశారు