ఆదిత్య 369: కూర్పుల మధ్య తేడాలు

→‎చిత్రకథ: చిన్న చిన్న అక్షర దోషాలు సవరణ
ట్యాగు: 2017 source edit
సమాచార పెట్టె ఆధునికీకరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox film|
{{వేదిక|తెలుగు సినిమా}}
{{సినిమా|
name = ఆదిత్య 369|
image = Aditya 369.jpg |
director = [[సింగీతం శ్రీనివాసరావు]]|
producer =అనితాకృష్ణ, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం (సమర్పణ) |
lyricswriter = {{ubl|సింగీతం శ్రీనివాసరావు (కథ)| జంధ్యాల (మాటలు)|[[వేటూరి సుందరరామమూర్తి]],
[[సిరివెన్నెల సీతారామశాస్త్రి]] (పాటలు)}}|
starring = {{ubl|[[నందమూరి బాలకృష్ణ]] | [[మోహిని (నటి)|మోహిని]] |[[అమ్రీష్ పురి]]}}|
year = 1991|
released = {{Film date|1991|07|18}}|
language = తెలుగు|
country = భారతదేశం|
production_company = [[శ్రీదేవి మూవీస్]]|
runtime = 141 ని|
production_company studio= [[శ్రీదేవి మూవీస్]]|
music = [[ఇళయరాజా]]|
producer = అనితాకృష్ణ|
starring = [[నందమూరి బాలకృష్ణ]],
[[మాస్టర్ తరుణ్]],
[[సుత్తివేలు]],
[[మోహిని (నటి)|మోహిని]],
[[అమ్రీష్ పురి]],
[[సిల్క్ స్మిత]],
[[టినూ అనంద్]],
[[గొల్లపూడి మారుతీరావు]],
[[చంద్రమోహన్]]|
screenplay= |
cinematography = {{ubl|పి.సి. శ్రీరామ్,
|వి.ఎస్.ఆర్. స్వామి,
|కబీర్ లాల్}}|
released= 18 ఆగష్టు 1991|
editing = [[గౌతంరాజు]]|
story= [[జంధ్యాల]]|
dialogues= జంధ్యాల|
lyrics= [[వేటూరి సుందరరామమూర్తి]],
[[సిరివెన్నెల సీతారామశాస్త్రి]] |
cinematography = పి.సి. శ్రీరామ్,
వి.ఎస్.ఆర్. స్వామి,
కబీర్ లాల్|
imdb_id=

'''ఆదిత్య 369''', 1991లో విడుదలైన [[తెలుగు సినిమా]].<ref name="పాతికేళ్ల ‘ఆదిత్య 369’">{{cite web|title=పాతికేళ్ల ‘ఆదిత్య 369’|url=http://www.andhrajyothy.com/pages/cinema_article?SID=267578|website=andhrajyothy.com|publisher=ఆంధ్రజ్యోతి|accessdate=16 October 2017}}</ref> [[బాక్ టు ఫ్యూచర్]] అనే ఆంగ్ల చిత్రం, ఇంకా హెచ్.జి.వెల్స్ [[టైం మెషీన్]] నుండి స్ఫూర్తి పొంది తీసిన చిత్రం. సైన్స్‌ఫిక్షన్‌ను, చరిత్రను, ప్రేమను, క్రైమ్‌ను జోడించి తీసిన ఈ సినిమా బాలకృష్ణ నటించిన సినిమాలలో ఒక ముఖ్యమైన గుర్తింపును పొందింది.<ref>[http://www.idlebrain.com/nosta/aditya369.html ఐడిల్ బ్రెయిన్‌లో వ్యాసం] {{Webarchive|url=https://web.archive.org/web/20090219002611/http://idlebrain.com/nosta/aditya369.html |date=2009-02-19 }} - రచన: గుడిపూడి శ్రీహరి</ref>

==చిత్రకథ==
1991 లో ప్రొఫెసర్ రాందాస్ అనే శాస్త్రవేత్త తన ఇంట్లో ఏర్పాటు చేసుకున్న ప్రయోగశాలలో కాలంలో ప్రయాణించగలిగే ఒక యంత్రాన్ని తయారు చేయడానికి వివిధ రకాల ప్రయోగాలు చేస్తుంటాడు. చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా అది పనిచేస్తున్నట్లు కనిపించదు. రాజావర్మ అనే స్మగ్లర్‌కు పురాతన వస్తువులు సేకరించడం హాబీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వస్తు సంగ్రహాలయాల నుంచి విలువైన వస్తువులు దొంగతనం చేయడం అతని అలవాటు. అందుకు అవరమైతే ఎంతటి నేరాన్నైనా చేయగలడు. కృష్ణ కుమార్ కి టి.వి.లు తయారు చేసే కంపెనీ ఉంటుంది. అతను రాందాస్ కూతురు హేమను ప్రేమిస్తాడు. ఒకసారి రాజావర్మ మనుషులు [[సాలార్ జంగ్ మ్యూజియం]] నుంచి 16వ శతాబ్దం నాటి విజయనగర సామ్రాజ్యానికి చెందిన విలువైన వజ్రాన్ని దొంగిలించడం కోసం ఒక రాత్రి అక్కడికి వెళతారు. ఆ మ్యూజియం చూడటానికి వచ్చి అక్కడ తప్పిపోయిన కిషోర్ అనే కుర్రాడు దొంగతనాన్ని చూస్తాడు. ఆ దొంగలు కిషోర్ వెంటపడగా భవనం పై నుంచి కిందపడబోతున్న అతన్ని కృష్ణ కుమార్ కాపాడతాడు. ఆ దొంగతనం గురించి కిషోర్ కృష్ణకుమార్ తో పాటు ఇంకొంతమందికి చెప్పినా ఎవ్వరూ అతని మాటలు నమ్మరు. నిజానికి దొంగలు అక్కడి వజ్రాన్ని దొంగిలించి దాని స్థానంలో నకిలీ వజ్రాన్ని పెట్టి ఉంటారు.
పంక్తి 27:

అయితే కాలయంత్రం ఈసారి ప్రస్తుత కాలానికి కాకుండా మరో 500 ఏళ్ళు ముందుకు తీసుకు వెళ్ళిపోతుంది. అప్పటికి మూడో ప్రపంచ యుద్ధం జరిగి అణుబాంబుల తాకిడికి గురై భూమి అంతా నివాసయోగ్యం కాకుండా ఉంటుంది. వారు భూమి మీద రేడియేషన్ పరిస్థితులు తట్టుకోలేకుండా ఉంటే ఒక శాస్త్రవేత్త వారిని రక్షిస్తాడు. అతను అందరూ కలిసి భూగర్భంలో నివసిస్తున్నారని చెబుతాడు. అక్కడి వింతలు, విశేషాలన్నీ చూస్తారు. కానీ ఆ శాస్త్రవేత్త వాళ్ళు ఆ వాతావరణంలో ఇమడలేరనీ, వెంటనే మళ్ళీ కాలయంత్రం ఎక్కి ప్రస్తుత కాలానికి వెళ్ళిపోమని చెబుతాడు. వెళ్ళబోయే ముందు తమకు పరిచితమైన రాయలవారి వజ్రాన్ని మళ్ళీ చూస్తారు. దానికి అనుబంధంగా ఉన్న వార్తల్లో కాలయంత్రం చేజిక్కించుకోవడానికి ప్రయత్నించిన రాజావర్మతో పోరాడి కృష్ణకుమార్ దుర్మరణం పాలైనట్లు ఉంటుంది. ఆ విషయం కృష్ణకుమార్, పోలీసు మాత్రమే చూస్తారు. కృష్ణకుమార్ ఆ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని పోలీసు చేత మాట తీసుకుంటాడు. వారు ముగ్గురూ కాలయంత్రం ఎక్కి మళ్ళీ ప్రస్తుత కాలానికి వస్తారు. అప్పటికే కాలయంత్రం కోసం కిషోర్, ప్రొఫెసర్ రాందాస్ ను రాజావర్మ అపహరించి ఉంటాడు. కృష్ణ కుమార్ రాజావర్మ మనుషులతో పోరాడి వారిని విడిపిస్తాడు. కాలయంత్రంలో ప్రవేశించిన రాజావర్మతో పోరాటం సాగిస్తాడు కృష్ణ కుమార్. వారిద్దరి పెనుగులాటలో ఆ యంత్రం పేలిపోతుంది. ఈ లోపు పోలీసు తాము భవిష్యత్తులో చూసిన దుర్వార్తను గురించి అందరికీ చెబుతాడు. అందరూ అతని మరణించాడని దుఃఖిస్తుండగా ఆశ్చర్యంగా కృష్ణకుమార్ అక్కడికి వస్తాడు. ఆ యంత్రం పేలిపోబోయే కొన్ని సెకన్ల ముందే అందులోనుంచి దూకేశానని చెబుతాడు.

== నిర్మాణం, అభివృద్ధి ==
ప్రముఖ గాయకుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ఒకసారి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తో మాట్లాడుతూ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దగ్గరున్న టైం ట్రావెల్ (కాలంలో ప్రయాణం) గురించిన కథ చెప్పాడు. అది విన్న కృష్ణప్రసాద్ వెంటనే ఆయనతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. కృష్ణదేవరాయల కాలం అనగానే ఆయనకు కథానాయకుడు బాలకృష్ణ గుర్తొచ్చాడు. బాలకృష్ణకు వెళ్ళి ఈ విషయం చెప్పగానే ఆయన కూడా ఇందులో నటించడానికి ఒప్పుకున్నాడు. రచయితగా జంధ్యాలను ఎంపిక చేశారు. ఈ సినిమా చిత్రీకరణకు 110 రోజులు పట్టింది. మొదట్లో ఈ సినిమాకు పి. సి. శ్రీరాం ఛాయాగ్రాహకుడు. ఆయనకు అత్యవసరంగా శస్త్రచికిత్స జరపవలసి రావడంతో ఆయన బాధ్యతను వి. ఎస్. ఆర్. స్వామి, కబీల్ లాల్ కి అప్పగించారు.<ref name="ఆదిత్య 369 @30: ఆ టైం మెషిన్‌కు స్ఫూర్తి ఎవరో తెలుసా?">{{cite news |last1=Sakshi |title=ఆదిత్య 369 @30: ఆ టైం మెషిన్‌కు స్ఫూర్తి ఎవరో తెలుసా? |url=https://www.sakshi.com/telugu-news/movies/balakrishna-aditya-369-movie-completed-30-years-1379635 |accessdate=18 July 2021 |work= |date=18 July 2021 |archiveurl=https://web.archive.org/web/20210718183324/https://www.sakshi.com/telugu-news/movies/balakrishna-aditya-369-movie-completed-30-years-1379635 |archivedate=18 July 2021 |language=te |url-status=live }}</ref>

మొదట్లో సుమారు 1 కోటి 30 లక్షలు అవుతుందనుకున్న బడ్జెట్ తర్వాత మరో 30 లక్షలు అదనంగా అయింది. చిత్రీకరణలో వేసిన సెట్లు, వాటికి కలిగిన ఆదరణ చూసి డిస్ట్రిబ్యూటర్లు ఈ అదనపు సొమ్మును వెచ్చించడానికి ముందుకు వచ్చారు. దీంతో సినిమాకు కోటి 52 లక్షలు ఖర్చు అయింది. మొదట్లో ఈ సినిమాకు యుగపురుషుడు, ఆదిత్యుడు అనే పేర్లు అనుకున్నారు. తర్వాత ఆదిత్య అని పేరు పెట్టి టైం ట్రావెలింగ్ కాబట్టి 369 అనే ఆరోహణా క్రమంలోని అంకెలు చేర్చారు. జులై 18, 1991 న విడుదలైన ఈ చిత్రం మంచి ప్రజాదరణకు నోచుకుంది.<ref name="పాతికేళ్ల ‘ఆదిత్య 369’"/>

కథానాయికగా మొదట విజయశాంతిని అనుకున్నారు. కానీ ఆమె డేట్స్ సర్దుబాటు కాలేదు. తర్వాత పి. సి. శ్రీరాం కి పరిచయమున్న మోహినికి ఆ అవకాశం దక్కింది. టైం మెషీన్ తయారు చేసే పాత్రకు విభిన్నంగా కనిపించడం కోసం హిందీ నటుడు టిన్నూ ఆనంద్ ని ఎంపిక చేశారు. బాల నటులుగా తరుణ్, రాశి నటించారు.<ref>{{Cite web|url=https://www.eenadu.net/cinema/newsarticle/30-years-for-classic-aditya369/0212/121145469|title=Aditya 369: తెర వెనుక జరిగింది ఇది! - 30 years for classic aditya369|website=www.eenadu.net|language=te|access-date=2021-07-18}}</ref>

==తారాగణం==
Line 52 ⟶ 45:
* [[బాబు మోహన్]]
* [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]] భవిష్యత్ కాలానికి చెందిన మనిషి

==పాటలు==
"https://te.wikipedia.org/wiki/ఆదిత్య_369" నుండి వెలికితీశారు