అష్టదిగ్గజములు: కూర్పుల మధ్య తేడాలు

చి చిన్న చిన్న మార్పులు
పంక్తి 23:
#[[రామరాజభూషణుడు]] ([[భట్టుమూర్తి]])
#[[తెనాలి రామకృష్ణుడు]]
 
రాయలు సర్సవతీ పీఠాన్ని పరివేష్టించి ఎనమండుగురు కవులు కూర్చొనేవారని కధ ఉంది. కృష్ణదేవరాయలు ఆస్థానంలో అష్టదిగ్గజాలుగా మన్ననలందుకొన్న ఈ ఎనిమిదిమందీ నిజంగా తెలుగు కవికవులేనా, వారి పేర్లు పై జాబితాలోనివేనా అన్న విషయంపై సాహితీ చరిత్రకారులలో భిన్నభిప్రాయాలున్నాయి. [[పింగళి లక్ష్మీకాంతం]] ఈ విషయంపై ఇలా పరిశీలించాడు.
 
కుమార ధూర్జటి వ్రాసిన [[కృష్ణరాయ విజయము]] అనే గ్రంధంలో
<poem>
సరస సాహిత్య విస్ఫురణ మొనయ
సార మధురోక్తి మాదయగారి మల్ల
నార్యుడల యల్లసాని పెద్దనార్యవరుండు
ముక్కు తిమ్మన మొదలైన ముఖ్య కవులు
</poem>
అనే పద్యం ఉంది.
 
వీరిలో ఐదుగురి పేర్లు నిశ్చయంగా చెప్పవచ్చును -
# అల్లసాని పెద్దన : కృష్ణరాయలకు ఆప్తుడు. తన కృతిని రాయలకు అంకితమిచ్చినాడు.
# నంది తిమ్మన : తన కృతిని రాయలకు అంకితమిచ్చినాడు. రాయల వంశముతో తిమ్మన వంశమునకు పూర్వమునుండి అనుబంధమున్నది. నంది మల్లయ, ఘంట సింగయలు తుళువ వంశమునకు ఆస్థాన కవులు.
# అయ్యలరాజు రామభద్రుడు
# ధూర్జటి : రాయల ఆస్థానంలో మన్ననలు అందుకొన్నాడు. ధూర్జటి తమ్ముని మనుమడు కుమార ధూర్జటి వ్రాసిన కృష్ణరాయ విజయంలో ఈ విషయం చెప్పబడింది. జనశృతి కూడా ఇందుకు అనుకూలంగానే ఉంది.
# మాదయగారి మల్లన : ఇతడు అష్ట దిగ్గజాలలో ఒకడని చెప్పడానికి కూడా కుమార ధూర్జటి రచనయే ఆధారం. మల్లన తన గ్రంధాన్ని కొండవీటి దుర్గాధిపతి, తిమ్మరుసు అల్లుడు అయిన నాదెండ్ల అప్పామాత్యునకు అంకితమిచ్చాడు.
 
 
 
 
 
 
 
 
"https://te.wikipedia.org/wiki/అష్టదిగ్గజములు" నుండి వెలికితీశారు