అష్టదిగ్గజములు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
రాయలు సర్సవతీ పీఠాన్ని పరివేష్టించి ఎనమండుగురు కవులు కూర్చొనేవారని కధ ఉంది. కృష్ణదేవరాయలు ఆస్థానంలో అష్టదిగ్గజాలుగా మన్ననలందుకొన్న ఈ ఎనిమిదిమందీ నిజంగా తెలుగు కవికవులేనా, వారి పేర్లు పై జాబితాలోనివేనా అన్న విషయంపై సాహితీ చరిత్రకారులలో భిన్నభిప్రాయాలున్నాయి. [[పింగళి లక్ష్మీకాంతం]] ఈ విషయంపై ఇలా పరిశీలించాడు.
 
[[కుమార ధూర్జటి]] వ్రాసిన [[కృష్ణరాయ విజయము]] అనే గ్రంధంలో
<poem>
సరస సాహిత్య విస్ఫురణ మొనయ
పంక్తి 43:
 
 
ఈ ఐదుగురు కాక తక్కిన మువ్వురిపేర్లు నిర్ణయించడానికి తగిన ఆధారాలు లేవు. పరిగణనలోకి తీసుకొనబడినవారు (1) [[తాళ్ళపాక చిన్నన్న]] (2) [[పింగళి సూరన]] (3) [[తెనాలి రామకృష్ణుడు]] (4) [[కందుకూరి రుద్రయ్య]] (5) [[రామరాజ భూషణుడు]] (6) [[ఎడపాటి ఎఱ్ఱన]] (7) [[చింతలపూడి ఎల్లన]]. ఈ విషయం నిర్ణయించడానికి వాడదగిన ప్రమాణాలు ...
* అతను రాయల సమకాలికుడయ్యుండాలి
* రాయల ఆస్థానంలో ప్రవేశం కలిగి ఉండాలి
 
ఇలా చూస్తే తాళ్ళపాక చిన్నన్న (పరమయోగి విలాసము, అష్టమహిషీ కళ్యాణము వంటి గ్రంధముల రచయిత) బహుశా [[తాళ్ళపాక అన్నమయ్య]] కొడుకో, మనుమడో కావలెను. ఇతడు రాయల సమకాలికుడు కావచ్చును. అష్టదిగ్గజాలలో ఒకడైయుండే అవకాశం ఉంది. కందుకూరి రుద్రకవి రాయల సరస్వతీ మహలు ఈశాన్యంలో కూర్చొనేవాడని నానుడి. ఇతని నిరంకుశోపాఖ్యానము 1580లో వ్రాయబడినది అనగా ఈ కవి చిన్నతనములోనే రాయలు గతించియుండవలెను. రామరాజభూషణుని [[వసుచరిత్ర]] [[తళ్ళికోట యుద్ధం]] తరువాత వ్రాయబడినట్లుగా అనిపిస్తుంది. కనుక ఇతని చిన్నవయసులోనే రాయల ఆస్థానంలో ఉండడం అనూహ్యం. పింగళి సూరన జననం రాయల మరణానికి 25 సంవత్సరాలముందు కావచ్చును కనుక అతడు కూడా అష్టదిగ్గజకవులలో ఉండే అవకాశం లేదు. అంతేగాక సూరన తండ్రికి రాయలు నిడమానూరు అగ్రహారం ఇచ్చినట్లు తెలుస్తున్నది. తెనాలి రామకృష్ణకవి కాలం ఊహించడం చాలా కష్టంగా ఉంది. ఉద్భటారాధ్య చరిత్ర బహుశా రాయల కాలంనాటి గ్రంధం. పాండురంగ మహాత్మ్యం రాయలు తరువాత వ్రాసినది.
 
ఈ పరిశీలనను ముగిస్తూ పింగళి లక్ష్మీకాంతం చేసిన వ్యాఖ్యలు గమనించదగినవి - "రాయలు సరస్వతీ మహలులోని ఎనిమిదిమంది కవులు తెలుగువారే కానక్కరలేదు. రాజనీతిపరంగా వివిధ భాషలకు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం ఉండిఉండాలి. ఆయన తెనుగురాజు, ఆయన రాజ్యము తెనుగు రాజ్యము అయినందును ఆస్థానంలో ఐదు స్థానాలు తెలుగు కవులకు లభించాయి. అందరూ తెలుగువారేనని చరిత్రకారులెవరైనా వ్రాయదలచినచో చిక్కులు వచ్చును"
 
 
{{అష్టదిగ్గజములు}}
 
{{రాయల యుగం}}
 
{{అష్టదిగ్గజములు}}
{{సంఖ్యానుగుణ వ్యాసములు}}
[[en:Astadiggajas]]
"https://te.wikipedia.org/wiki/అష్టదిగ్గజములు" నుండి వెలికితీశారు