హెచ్.నరసింహయ్య: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి delinking File:Gandhi and hn.jpg as it is deleted
 
పంక్తి 2:
'''హెచ్.నరసింహయ్య''' సుప్రసిద్ధ విద్యావేత్త, హేతువాది. హెచ్. (హనుమంతప్ప) నరసింహయ్య (కన్నడ: ಹೆಚ್ ನರಸಿಂಹಯ್ಯ) హోసూరు నరసింహయ్యగా, డా.హెచ్.ఎన్‌గా ప్రజానీకానికి సుపరిచితుడు. ఈయన [[కర్ణాటక రాష్ట్రం]], [[గౌరిబిదనూరు]] సమీపంలోని [[హోసూరు]]లో [[జూన్ 6]], [[1921]]న హనుమంతప్ప, వెంకటమ్మ దంపతులకు ఒక బీద కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి హనుమంతప్ప వీధిబడిలో చదువు చెప్పే ఉపాధ్యాయుడు. తల్లి వెంకటమ్మ కూలి పని చేసుకుని బ్రతుకు సాగించిన వ్యక్తి<ref>మూఢాచారాలపై ఎక్కుపెట్టిన అస్త్రం - డా. హెచ్.నరసింహయ్య - కన్నడ కస్తూరి - పుటలు: 134-138- [[జానమద్ది హనుమచ్ఛాస్త్రి]]</ref>.
==విద్య, ఉద్యోగం==
 
[[దస్త్రం:Gandhi and hn.jpg|thumb|మహాత్మాగాంధీతో బాలుడైన నరసింహయ్య]]
హెచ్.ఎన్. కుగ్రామంలో పుట్టి ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటూ కూడా చదువులో ప్రతిభను కనపరిచాడు. ఇతనిప్రాథమిక విద్య గౌరీబిదనూరు సమీపంలోని హోసూరు ప్రభుత్వ పాఠశాలలో నడిచింది. 8వ తరగతి వరకు మాత్రమే ఉన్న ఆ పాఠశాలలో అంత వరకు చదివి ఆ తరువాత ఒక సంవత్సరం ఖాళీగా ఉన్నాడు. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.ఎన్.నారాయణరావు బెంగళూరులోని బసవనగుడి నేషనల్ హైస్కూలుకు బదిలీ కావడంతో ఇతడిని అక్కడికి ఆహ్వానించాడు. నరసింహయ్యకు బెంగళూరు వెళ్లడానికి డబ్బులు లేక పోవడంతో రెండురోజులు కాలినడకన ప్రయాణించి బెంగళూరు చేరుకున్నాడు. అక్కడ నేషనల్ హైస్కూలులో 1935లో చేరాడు. 1936లో ఆ హైస్కూలుకు గాంధీజీ సందర్శించినప్పుడు ఇతడి ఉపాధ్యాయుడు ఇతడిని గాంధీ ప్రసంగానికి కన్నడ అనువాదకుడిగా ఎంపిక చేశాడు. గాంధీజీ ప్రభావంతో ఆనాటి నుండి మరణించేదాక హెచ్.నరసింహయ్య ఖద్దరును ధరించసాగాడు. ఆ తర్వాత ఇతడు బెంగళూరు సెంట్రల్ కాలేజీలో బి.ఎస్.సి. చదవడానికి చేరాడు. ఇతడు చివరి సంవత్సరం చదువుతున్నప్పుడు 1942లోగాంధీ ఇచ్చిన పిలుపు మేరకు చదువు అర్థాంతరంగా మానేసి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. ఫలితంగా ఎర్వాడ జైలులోను, మైసూరు జైలులోను, బెంగళూరు సెంట్రల్ జైలులోను 9 నెలలు జైలుశిక్షను అనుభవించాడు. తరువాత బి.ఎస్.సి. భౌతికశాస్త్రంలో ఆనర్సు పూర్తి చేసి భౌతికశాస్త్రంలో ఎం.ఎస్.సి. ప్రథమ శ్రేణిలో 1946లో ఉత్తీర్ణుడయ్యాడు. అదే సంవత్సరం నేషనల్ కాలేజి, [[బెంగళూరు]]లో అధ్యాపకుడిగా ఉద్యోగం చేయసాగాడు. పది సంవత్సరాలు అధ్యాపకుడిగా పనిచేసి 1957లో అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్శిటిలో ఉన్నత విద్యకోసం చేరాడు. 1960లో న్యూక్లియర్ ఫిజిక్స్‌లో పి.హెచ్.డి సంపాదించాడు. 1961 నుండి 1972 వరకు బెంగళూరులోని బసవనగుడి నేషనల్ కాలేజికి ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు. అమెరికాలోని సదరన్ ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయానికి విజిటింగ్ ప్రొఫెసర్‌గా కూడా సేవలను అందించాడు. 1972లో బెంగళూరు విశ్వవిద్యాలయానికి నాలుగవ ఉపకులపతిగా నియమించబడ్డాడు. 1975లో పునర్నియామకంతో 1977వరకు ఉపకులపతిగా కొనసాగాడు. ఇతడు ఉపకులపతిగా ఉన్న సమయంలో బెంగళూరు విశ్వవిద్యాలయంలో మనస్తత్వశాస్త్రం, సామాజిక శాస్త్రం, నాట్యం, నాటకం, సంగీతాలను పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టాడు. తరువాత ఇతడు కర్ణాటక శాసనమండలిలో సభ్యుడిగా కూడా పనిచేశాడు. మరణించేనాటికి ఇతడు కర్ణాటక నేషనల్ ఎడ్యుకేషనల్ సోసైటీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈసొసైటీ తరఫున కర్ణాటక రాష్ట్రంలో నాలుగు కళాశాలలు, ఐదు ఉన్నత పాఠశాలలు, రెండు ప్రాథమిక పాఠశాలలు పనిచేస్తున్నాయి.
 
"https://te.wikipedia.org/wiki/హెచ్.నరసింహయ్య" నుండి వెలికితీశారు