సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు: కూర్పుల మధ్య తేడాలు

చి delinking File:Still from seetamma vaakitlo sirimalli chettu.png as it is deleted
పంక్తి 25:
 
==కథ==
 
[[దస్త్రం:Still from seetamma vaakitlo sirimalli chettu.png|250px|thumbnail|కుడి]]
ఈ చిత్రం యొక్క మొత్తం రేలంగి అనే పల్లెటూరులో జరుగుతుంది. చిత్ర కథ మొత్తం రేలంగి మావయ్య ([[ప్రకాష్ రాజ్]]) కుటుంబం చుట్టూ తిరుగుతుంది. మానవత్వ విలువలకు, కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చే మనిషి రేలంగి మామయ్య. ఆ ఊరిలో అందరికీ రేలంగి మావయ్య అంటే ఎనలేని అభిమానం. అందరితో సంతోషంగా, ఆనందంగా బ్రతకాలనుకునే ఇతనికి పెద్దోడు ([[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]]), చిన్నోడు ([[మహేష్ బాబు]]) అని ఇద్దరు కొడుకులు ఉంటారు. వీరిలో పెద్దోడు చాలా ఎమోషనల్ గా ఉండే యువకుడు. ఇంకొకరి ముందు తలవంచుకునే వ్యక్తిత్వం కాదు. తనకు నచ్చింది చేసి మంచి అవకాశం కోసం చూసే వ్యక్తి, నిరుద్యోగి, తన తమ్ముడు అంటే చాలా ఇష్టం. సీత ([[అంజలి (నటి)|అంజలి]]) అతనికి మరదలు. ఆ ఇంట్లో సీత చెయ్యలేని పనిలేదు, ప్రేమించబడని మనిషి లేడు. కానీ చిన్నప్పటి నుండి సీత ఎప్పటికి అయిన పెద్దోడే తన భర్త అవుతాడని కలలు కంటూ ఉంటుంది. మరో ప్రక్క చిన్నోడు ఎటువంటి పరిస్థితిని అయినా తనకు అనుగుణంగా మార్చుకునే యువకుడు. చిన్నోడు తన బంధువుల పెళ్ళిలో పెళ్ళికూతురు చెల్లెలైన అయిన గీత ([[సమంత]])ని చూడగానే ప్రేమలో పడిపోతాడు. రేలంగి మామయ్య కుటుంబానికి సంపద తక్కువగా ఉందని గీత తండ్రి ([[రావు రమేష్]]) చులకనగా చూస్తుంటాడు.