యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 86:
 
కథనం ప్రకారం లక్ష్మీ నరసింహస్వామివారు మొదట పాత లక్ష్మీనరసింహస్వామి ఆలయంనందు వెలసి తరువాత కొత్తలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంనకు గుర్రముమీద వెళ్ళినట్లుగా కథనం.ఇప్పటికీ అక్కడ సమీపంలో ఆ గుర్రపు అడుగులు ఆదారిన చూడవచ్చు. ఈ గుర్తులు పాత లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం నుండి కొత్తలక్ష్మీనరసింహస్వామివారి ఆలయము వరకు ఉన్నాయి. పాత లక్ష్మీనరసింహస్వామి ఆలయంనందు, ఆంజనేయ స్వామి వారి ఆలయము కూడా ఉంది. అక్కడ గోడ మీద ఉన్న చిత్రములు చాలా అద్భుతముగా ఉన్నాయి. అక్కడ నుండి కొత్త లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంనకు వెళ్ళు దారిలో ఆంజనేయ స్వామి వారి మరొక ఆలయం కూడా ఉంది. ఈ ఆలయగర్భగుడిలో స్వామివారి వద్ద నిత్యము ఒక జల ప్రవాహము ఉంది. ఆ జలముతోనే నిత్యం స్వామివారికి అభిషేకం చేస్తారు.
 
== వార్షిక బ్రహ్మోత్సవాలు - 2022 ==
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు 2022 మార్చి 4వ తేదీ నుంచి 14 వరకు 10 రోజులపాటు జరుగనున్నాయి. 10న ఎదుర్కోలు, 11న బాలాలయంలో తిరుకళ్యాణం, 12న రథోత్సవం నిర్వహించనున్నారు. 14న అష్టోత్తర శత ఘటాభిషేకంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
 
స్వయంభువులైన పంచనారసింహుల ఆలయ పునర్నిర్మాణం జరుగుతుండటంతో ప్రత్యామ్నాయంగా ఏర్పాటైన బాలాలయంలో ఆరోసారి ఉత్సవాలు జరిపేందుకు ఆలయాన్ని ముస్తాబు చేశారు. కొవిడ్‌-19 నిబంధనలను అనుసరించి వేడుకలను నిర్వహిస్తారు.<ref>{{Cite web|title=నేటి నుంచి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు|url=https://www.andhrajyothy.com/telugunews/yadadri-nallagonda-telangana-suchi-mrgs-telangana-1922030407431598|access-date=2022-03-04|website=andhrajyothy|language=te}}</ref>
 
== దగ్గరలోని దర్శనీయ స్థలాలు ==