అలమేలు మంగ: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''అలమేలు మంగ''' లేదా '''పద్మావతి''', కలియుగంలో వేంకటేశ్వరుని దేవేరి...
 
కొంత సమాచారం
పంక్తి 1:
'''అలమేలు మంగ''' లేదా '''పద్మావతి''', కలియుగంలో వేంకటేశ్వరుని దేవేరిగా శ్రీమహాలక్ష్మి స్వరూపం. తిరుపతి సమీపంలోని [[తిరుచానూరు]] లేదా "ఆలమేలు మంగాపురం"లోని అలమేలు మంగ ఆలయం ప్రసిద్ధమైనది.
[[Image:TiruchanurThayaar.jpg|thumb|right|తిరుచానూరులో అలమేలు మంగ ఆలయం.]]
 
శ్రీనివాసుని దేవేరులుగా అలమేలు మంగ, లక్ష్మి, భూదేవి, శ్రీదేవి, పద్మావతి, అండాళ్, గోదాదేవి, బీబీ నాంచారి వంటి అనేక పేర్లు పేర్కొనబడడంవల్ల సామాన్యభక్తులలో కొంత అయోమయం నెలకొంటుంది. సంప్రదాయ గాధలను బట్టి ఈ దేవతలను గురించి ఇలా చెప్పవచ్చును.
 
* శ్రీదేవి ([[లక్ష్మి]]), [[భూదేవి]] ఇరువురూ శ్రీమహావిష్ణువును వరించిన దేవతలు. ఉత్సవ మూర్తియైన [[మలయప్పస్వామి]] ఉభయ నాంచారులతో కూడి ఉన్నాడు.
 
* వెంకటేశ్వర మహాత్మ్యం కధ (తిరుమల క్షేత్రం స్థలపురాణం) ప్రకారం వైకుంఠంలో భృగుమహర్షి చర్యవలన కోపించి లక్ష్మీదేవి వైకుంఠం విడచి పాతాళానికి వెళ్ళింది. లక్ష్మీవియోగం వలన ఖిన్నుడైన స్వామి భూలోకంలో తపస్సు చేశాడు. పాతాళంలో ఉన్న లక్ష్మీదేవి ప్రసన్నురాలై స్వర్ణముఖీ నది తీరాన తిరుచానూరు పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు బంగారు పువ్వులో ప్రత్యక్షమై కలువపూదండలతో స్వామివారిని వరించింది. కనుక '''లక్ష్మీ దేవి'''యే పద్మములో జనించిన '''పద్మావతి''' లేదా '''అలమేలు మంగ''' - (తమిళంలో "అలర్" అనగా పువ్వు. "మేల్" అనగా పైన. "మంగై" అనగా అందమైన స్త్రీ - "అలమేలు" అనగా "పద్మంలో ప్రకాశించున సుందరి")
 
* మరొక కధనం ప్రకారం త్రేతాయుగంలో [[సీత]] బదులు రావణుని చెర అనుభవించిన [[వేదవతి]]ని మరుజన్మలో పెండ్లాడుతానని శ్రీరాముడు చెప్పాడు. ఆ వేదవతియే ఆకాశరాజు కూతురు పద్మావతిగా అవతరించి శ్రీనివాసుని వరించి పెండ్లాడినది. శ్రీనివాసుడు శిలగా అయినపుడు లక్ష్మీదేవి కొల్హాపూర్‌లో వెలసింది. పద్మావతి అలమేలుగా తిరుచానూరులో వెలసింది.
 
* భూదేవియే [[గోదాదేవి]]గా అవతరించి శ్రీరంగనాధుని వరించింది. ఈమెను ఆండాళ్, ఆముక్త మాల్యద (తాల్చి ఇచ్చిన తల్లి), చూడి కొడుత నాచియార్ అని కూడా అంటారు. భూదేవి స్వరూపమే సత్యభామ అనికూడా పురాణ కధనం గమనించాలి.
 
* కొండపై వెలసిన దేవుడు "బీబీ నాంచారి" అనే ముస్లిం కన్యను పెండ్లాడాడని ఒక కధనం. తమ ఆడపడుచుపై గౌరవంతో కొండలరాయుని దర్శించుకొన్న ముస్లిం సోదరులను చూసి హైదర్ ఆలీ తిరుమల కొండపైని సంపద జోలికి పోలేదని అంటారు.
 
 
 
The main temple to Sri Alamelu is situated at [[Thiruchanoor]], also known as ''Alamelu-Mangapuram'', a suburb of Tirupati City. Tradition dictates that every pilgrim to Tirupati must offer obeisance at this temple ''before'' proceeding to the temple at Tirupati-Tirumala balaji.
"https://te.wikipedia.org/wiki/అలమేలు_మంగ" నుండి వెలికితీశారు