"కొత్త రఘురామయ్య" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''కొత్త రఘురామయ్య''' 1912లో ఆంధ్ర దేశములోని [[గుంటూరు]] మండలమునకు చెందిన [[సంగం జాగర్లమూడి]] గ్రామములో జగన్నాధం, కోటమ్మ అను దంపతులకు జన్మించాడు. జగన్నాధం చుట్టుపక్క గ్రామాలలో పేరుగాంచిన భూస్వామి, మహాదాత.
 
స్వగ్రామములో మరియు గుంటూరులో తొలి విద్యాభ్యాసము చేసిన తదుపరి రఘురామయ్య ఇంగ్లాండు వెళ్ళి 'బార్-ఎట్-లా' చదివాడు. స్వదేశము తిరిగి వచ్చి బ్రిటీషు వారి ప్రభుత్వములో ఉద్యోగమునకు కుదురుకున్నాడు.
 
 
1949లో ప్రభుత్వ ఉద్యోగము వదలి రాజకీయరంగ ప్రవేశము చేశాడు. [[తెనాలి]] మరియు [[గుంటూరు]] లోకసభ స్థానములకు పలుమార్లు నాయకత్వము వహించి పలుసేవలందించాడు<ref>లోకసభ సభ్యత్వము: http://164.100.24.209/newls/lokprev.aspx</ref>.
 
రక్షణ, పెట్రోలియం, పౌర సరఫరాలు మరియూ లోకసభ వ్యవహారాల శాఖలకు కేంద్ర మంత్రిగా సేవలందించి పేరు సంపాదించాడు<ref>మంత్రిత్వ శాఖలు: http://www.kolumbus.fi/taglarsson/dokumentit/gandhi2.htm</ref>.
1,744

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/348787" నుండి వెలికితీశారు