శత్రుఘ్న సిన్హా: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:పార్లమెంటు సభ్యులు ను తీసివేసారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 53:
ఇతడు తన మిత్రుడు [[రాజేష్ ఖన్నా]]కు వ్యతిరేకంగా మధ్యంతర ఎన్నికలలో నిలబడడం ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. తన మిత్రుడు రాజేష్ ఖన్నాకు వ్యతిరేకంగా ఎన్నికలలో నిలబడటం తన జీవితంలో చేసిన పెద్ద తప్పు అని శత్రుఘ్న సిన్హా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఆ ఎన్నికలలో రాజేష్ ఖన్నా 25,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.<ref>{{cite web|url=https://www.dnaindia.com/analysis/comment-jatin-the-sole-custodian-of-his-own-avatar-rajesh-khanna-1716769|title=Jatin: The sole custodian of his own avatar Rajesh Khanna|author=|date=18 July 2012|website=DNA India|access-date=6 April 2019}}</ref> ఈ సంఘటనతో రాజేష్ ఖన్నా కలత చెంది శత్రుఘ్న సిన్హాతో మాట్లాడటం మానివేశాడు. సిన్హా తమ స్నేహాన్ని కొనసాగటానికి ప్రయత్నించాడు కానీ 2012లో రాజేష్ ఖన్నా మృతి చెందేవరకు అది సాధ్యపడలేదు.<ref>{{cite web|url=https://www.deccanchronicle.com/entertainment/bollywood/131016/i-lost-the-election-and-also-a-friend-in-rajesh-khanna-shatrughan-sinha.html|title=I had lost the election and also a friend in Rajesh Khanna: Shatrughan Sinha|author=|date=13 October 2016|website=Deccan Chronicle|access-date=6 April 2019}}</ref>
 
ఇతడు 2009 సాధారణ ఎన్నికలలో బీహార్ రాష్ట్రంలోని పాట్నా సాహిబ్ లోకసభ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి శేఖర్ సుమన్‌పై గెలుపొందాడు. తరువాత 2014 సాధారణ ఎన్నికలలో కూడా గెలిచాడు. ఇతడు వాజపేయి మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిగా, నౌకాయాన[[రేవులు, నౌకాయానం, జలరవాణా శాఖ]] మంత్రిగా ఉన్నాడు.<ref>{{cite web|url=http://india.gov.in/govt/loksabhampbiodata.php?mpcode=4468 |title=Detailed Profile - Shri Shatrughan Prasad Sinha - Members of Parliament (Lok Sabha) - Who's Who - Government: National Portal of India |publisher=India.gov.in |date=31 August 2009 |access-date=13 February 2011}}</ref> 2006లో ఇతడు బి.జె.పి. సాంస్కృతిక, కళా విభాగానికి అధిపతిగా నియమితుడైనాడు.
 
2019 సాధారణ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఇతనికి టికెట్ ఇవ్వడానికి నిరాకరించడంతో మనస్తాపం చెంది ఇతడు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.<ref>{{cite news|url=https://www.indiatoday.in/elections/lok-sabha-2019/story/bjp-mp-shatrughan-sinha-joins-congress-leaving-bjp-heavy-heart-1495486-2019-04-06|title=Shatrughan Sinha joins Congress, as parting shot to BJP says he forgives those who hurt him|agency=Ist|date=|newspaper=India Today|access-date=6 April 2019}}</ref>
"https://te.wikipedia.org/wiki/శత్రుఘ్న_సిన్హా" నుండి వెలికితీశారు