సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం: కూర్పుల మధ్య తేడాలు

కొన్ని భాషా సవరణలు
భాషా సవరణ
పంక్తి 40:
}}
[[File:Satish Dhawan Space Centre.jpg|thumb|alt=సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం OSM పటం (స్థిర చిత్రం)|సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం OSM పటం (స్థిర చిత్రం)]]
'''సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం''' ('''సతీష్ ధావన్ స్పేస్ సెంటర్''' - SDSC) లేదా '''షార్''' (శ్రీహరికోట - SHAR) భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, [[భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ|ఇస్రో]] నిర్వహణలో ఉన్న ఉపగ్రహ ప్రయోగ కేంద్రం. ఇది ఆంధ్రప్రదేశ్‌లో [[పులికాట్ సరస్సు]]- [[బంగాళాఖాతము|బంగాళాఖాతాల]] నడుమ [[శ్రీహరికోట]] అనే ద్వీపంలో సుమారు 175 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. మొదట్లో షార్ గా పిలవబడిన ఈ కేంద్రాన్ని 2002 నుంచి మాజీ ఇస్రో ఛైర్మన్ [[సతీష్ ధావన్]] పేరు మీదుగా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని పిలుస్తున్నారు. భూమధ్యరేఖకు దగ్గరగా ఉండడం, ఇస్రో ఈ స్థలాన్ని ఎంచుకోవడాఅనికి ఒక కారణం. రాకెట్ ప్రయోగ కేంద్రం [[భూమధ్య రేఖకురేఖ]]<nowiki/>కు ఎంత దగ్గరగా ఉంటే భూమ్యాకర్షణను అధిగమించి పైకి వెళ్ళేందుకు రాకెట్‌కు అంత తక్కువ ఇంధనం ఖర్చౌతుంది. సరిగ్గా భూమధ్య రేఖ పైన అత్యంత తక్కువ ఇంధనం ఖర్చౌతుంది. శ్రీహరికోట 13 డిగ్రీల 43 సెకండ్ల అక్షాంశం మీద ఉంది. భౌగోళికంగా, సాంకేతికంగా, ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్న ఫ్రెంచి గయానాలోని కౌరు రాకెట్ ప్రయోగ కేంద్రం కేవలం ఏడు డిగ్రీల అక్షాంశంపై ఉండగా, శ్రీహరికోట కేంద్రం భూమధ్య రేఖకు అత్యంత దగ్గరగా ఉన్న కేంద్రాల్లో ప్రపచంలో రెండో స్థానంలో ఉంది.
 
== చరిత్ర ==
1969 లో శ్రీహరికోట రాకెట్ కేంద్రంగా ఎంపికయింది. శ్రీహరికోట పేరు మీదుగా దాన్నిదానికి SHAR అని విక్రం సారాభాయ్ నామకరణం చేశాడు.<ref name="isro">{{Cite book|url=https://www.isro.gov.in/pslv-c25-mars-orbiter-mission/fishing-hamlet-to-red-planet-download-e-book|title=From Fishing Hamlet to Red Planet: India's Space Journey|editor1-last=Rao|editor1-first=P. V. Manoranjan|editor2=B. N. Suresh|editor3=V. P. Balagangadharan|publisher=Harper Collins|year=2015|isbn=9789351776901|location=India|pages=328|language=en|chapter=4.1 The Spaceport of ISRO - K. Narayana|quote= ఈ కేంద్రానికి విక్రం సారాభాయ్ షార్ (SHAR - శ్రీహరికోట రేంజ్ అనే పేరుకు సంక్షిప్త రూపం) అని నామకరణం చేశాడు. చాలా మంది దీన్ని శ్రీహరికోట హై అల్టిట్యూడ్ రేంజ్ అని తప్పుగా భావించారు. సంక్షిప్త రూపాన్ని '''శర్''' అని పలికితే బాణం అనే అర్థం కూడా వస్తుంది. బాణాన్ని ఎక్కుపెట్టినట్టు రాకెట్ ఎక్కుపెట్టడం అనే అర్థం కూడా వస్తుంది.}}</ref> 1971 అక్టోబరు 9న రోహిణి-125 సౌండింగ్ రాకెట్ ను ప్రయోగాత్మకంగా పరీక్షించడంతో కేంద్రం కార్యకలాపాలు మొదలయ్యాయి.<ref>{{cite web |url=http://www.astronautix.com/r/rh125.html |title=RH-125 |publisher=[[Encyclopedia Astronautica]]}}</ref> అది మొదలు, [[చంద్రయాన్|చంద్రయాన్-1]], [[మార్స్ ఆర్బిటర్ మిషన్]]తో సహా ఎన్నో ప్రయోగాలకు ఈ కేంద్రం వేదికైంది. ఇంతటి విశిష్టత కలిగిన శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం పేరును ఇస్రో మాజీ ఛైర్మన్ [[సతీష్ ధావన్]] జ్ఞాపకార్థం 2002 సెప్టెంబరు 5న '''''సతీష్ ధావన్ స్పేస్ సెంటర్''''' గా మార్చారు. ఇది భారతదేశంలోని ఏకైక ఉపగ్రహ ప్రయోగ కేంద్రం. ఇక్కడనుండి ఎన్నో PSLV, GSLV ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించారు. అసెంబ్లింగ్, టెస్టింగ్‌తో పాటు ప్రయోగాలకూ ఇది వేదికగా ఉంది. ఇప్పటిదాకా 575 సౌండింగ్ రాకెట్లనూ 42కు పైగా ఉపగ్రహాలనూ ప్రయోగించారు.
 
షార్‌లో ప్రస్తుతం రెండు లాంచి ప్యాడ్‌లు ఉన్నాయి. మొదటి వేదికను 1990ల్లో నిర్మించగా రెండోది 2005 లో ఉపయోగంలోకి వచ్చింది. ఈ రెండిటివల్ల ఏడాదికి 6 ప్రయోగాలను జరిపే సౌకర్యం ఉంది. ప్రస్తుతం మూడో వేదిక నిర్మాణం లో ఉంది. దీన్ని మానవ సహిత ప్రయోగాలకు అనువుగా నిర్మిస్తున్నారు.