అత్తగారి కథలు: కూర్పుల మధ్య తేడాలు

వి
కొంచెం విస్తరణ
పంక్తి 7:
 
1994లో ఈ రచనకు [[ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు]] వచ్చింది.
 
"అత్తగారి కథలు" ఐదు సంపుటాలుగా లభిస్తున్నాయి
# అత్తగారి కథలు - 1వ భాగం
# అత్తగారి కథలు - 2వ భాగం
# అత్తగారూ నక్సలైట్లూ
# భానుమతి కథలు - 1
# భానుమతి కథలు - 2
 
వీటిలో ఉన్న కొన్ని కథలు
* మానవతా కోణంలో కొంత విషాదం ఉన్నవి - లోభి హృదయం, పతిత, జీవితంలోని అగాధాలు , శమంతకమణి-చాఱుశాస్త్రి
* మూఢాచారాలను విమర్శించేవి - మెకానిక్, ఎందుకులెండి, పెద్ద ఆకారాలు - చిన్న వికారాలు, వస్త్రాపహరణం, మరో ప్రపంచం, కోరికలు-కొరతలు, ఇరుగు పొరుగు, మావాడి లవ్ ఆఫైర్స్
* హాస్య ప్రధానమైనవి - చక్రపాణి రాజధాని, రాంగ్ నెంబర్, త్రిశంకు నరకం, వరసలు, రంభా చక్రపాణీయం, కృత్యాదవస్థ, గుభేళ్ళు, చక్రపాణి ఇంద్రలోక యాత్ర, సినిమా జీవులా-చిరంజీవులా
 
ఈ కథలలో రచయిత్రి చిత్రించిన అత్తగారి స్వభావం హాస్యాన్ని, పెద్దరికాన్ని, మానవతను మనకళ్ళముందు మూర్తీభవింపజేస్తుంది.
 
==అత్తగారి స్వభావం==
అత్తగారి పుట్టిల్లు చంగల్పట్టు, మెట్టినిల్లు రాయలసీమ, నివాసం మదరాసు. నిష్టగా ఉండే శ్రీవైష్ణవురాలు. ఆమె యంట్లో ఆమె మాటకు తిరుగు లేదు. ఇంట్లోవాళ్ళూ, ఇరుగు పొరుగూ అందరూ ఆవిడ మాట జవదాటరు. ఆవిడను అమితంగా ప్రేమిస్తారు. అందరినీ ఆప్యాయంగా పలకరించడంలోనూ, ఆవకాయ పెట్టడంలోనూ, అరటిపొడి చెయ్యడంలోనూ, చాకలి పద్దులు రాయడంలోనూ ఆవిడకు ఎవరూ సాటి లేరని ఆమె విశ్వాసం. అందుకే తన తప్పును ఒక పట్టాన ఒప్పుకోదు. అసలు తప్పు అని తెలుసుకోలేని అమాయకురాలు ఆవిడ. బస్సు, వ్యాను ఒకటే అని ఆమె అభిప్రాయం. జపాన్ అంటే ఢిల్లీ దగ్గర ఉందంటుంది. "సవతులన్న తరువాత పోట్లాడుకోవద్దూ, మీరిద్దరూ పోట్లాడుకోరే" అని పాలవాడి పెళ్ళాలతో పోట్లాడుతుంది. నవనాగరికురాలైన కోడలు, సత్యకాలపు కోడలు గురించిన రచనలలో భానుమతి సృష్టి పరాకాష్ట.
 
 
 
 
 
==ఇవి కూడా చూడండి==
 
==మూలాలు, వనరులు==
{{మూలాలజాబితా}}
 
* '''శత వసంత సాహితీ మంజీరాలు'''లో వ్యాసం - రచయిత: మల్లాది సూరిబాబు
 
==బయటి లింకులు==
 
 
[[వర్గం:తెలుగు కథలు]]
"https://te.wikipedia.org/wiki/అత్తగారి_కథలు" నుండి వెలికితీశారు