నటరాజ రామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

చి Copy edit
పంక్తి 38:
 
== జీవిత విశేషాలు ==
రామకృష్ణ తల్లి దమయంతీ దేవి [[నల్గొండ జిల్లా]]కు, తండ్రి రామమోహనరావు [[తూర్పు గోదావరి జిల్లా]]కూ చెందినవారు. వీరు [[ఇండోనేషియా]] లోని [[బాలి]] ద్వీపానికి వలస వెళ్ళారు. రామకృష్ణ అక్కడే 1933 [[మార్చి 21]] న జన్మించాడు.<ref name=":0">{{Cite news|title=కూచిపూడిKuchipudi లెజెండ్legend నటరాజNataraja రామకృష్ణRamakrishna పాసెస్passes ఎవేaway|date=7 June 2007|archiveurl=https://web.archive.org/web/20190311055106/https://www.thehindu.com/news/national/andhra-pradesh/kuchipudi-legend-nataraja-ramakrishna-passes-away/article2084870.ece|archivedate=7 Mar 2011|url=https://www.thehindu.com/news/national/andhra-pradesh/kuchipudi-legend-nataraja-ramakrishna-passes-away/article2084870.ece|newspaper=ది హిందూ}}</ref> ఆయన చిన్నతనంలోనే తల్లి మరణించింది.
 
వారి కుటుంబం నాగపూరుకు వలస వచ్చేసింది. నటరాజ రామకృష్ణకు చిన్ననాటి నుంచే నాట్యం పట్ల ఆసక్తి కలిగింది. ఆయన నాట్యం నేర్చుకోవడం తండ్రి ఇష్టపడలేదు. "''మా వంశం కళలను పోషించాలే గానీ కళాకారులుగా వాటిని ఆరాధించకూడదని వారి అభిప్రాయం"'' అని తన ఆత్మకథలో రామకృష్ణ రాసుకున్నాడు. తాను రచించిన ''దాక్షిణాత్యుల నాట్యకళా చరిత్ర'' పుస్తకానికి లభించిన కేంద్ర ప్రభుత్వ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నపుడు కూడా ఆయన తండ్రి సంతోషించలేదని కూడా రాసుకున్నాడు.<ref>{{Cite book|title=అర్ధ శతాబ్ది-ఆంధ్రనాట్యం|last=నటరాజ|first=రామకృష్ణ|publisher=|year=1995|location=హైదరాబాదు|pages=36|url=https://archive.org/details/in.ernet.dli.2015.391476/page/n68|isbn=}}</ref>
"https://te.wikipedia.org/wiki/నటరాజ_రామకృష్ణ" నుండి వెలికితీశారు