పొట్టి శ్రీరాములు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 82:
డిసెంబర్ 15 శ్రీరాములు ఆత్మార్పణ రోజు!! ఉదయం నుంచే ఆయన స్పృహలో లేరు. కళ్లు తెరిచారు. అంతలోనే మూతలు పడపోయేవి. చేతులు కదిపేందుకు కూడా శక్తి లేదు. 15.8 కేజీలు బరువు తగ్గారు.<ref> {{Cite web |url=https://www.bbc.com/telugu/india-43402522|title=‘అమరజీవి’ పొట్టి శ్రీరాములు: చనిపోయే దాకా దీక్షను కొనసాగించటానికి కారణాలేంటి? ఈ దీక్ష ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసమా? మద్రాసు నగరం కోసమా?|publisher=బీబీసీ|date=2018-03-16|first=మల్లేశ్వరరావు|last=బీఎస్ఎన్}}</ref> నాడి కదలిక, శ్వాసతీరుల్లో మార్పు వచ్చింది. 16 గంటలపాటు మూత్రం స్తంభించింది. నోటిమాట కష్టమైంది. అప్పుడప్పుడు అపస్మారకంలోకి వెళ్లేవారు. సందర్శకులను నిలిపివేశారు. సాయంత్రం వచ్చిన ప్రకృతి చికిత్సకులు వేగిరాజు కృష్ణమరాజు, ఆయన సతీమణులతో మాట్లాడలేకపోయినా... చిరునవ్వుతో స్వాగతం పలికారు. అప్పటి నుంచి క్రమంగా శరీరం చల్లబడిపోయింది. రాత్రి 11.23 గంటలకు పొట్టి శ్రీరాములు ఆంధ్రరాష్ట్రం కోసం తనను తాను బలిదానం చేసుకొన్నాడు.
 
ఇక మరణించాక మరీ దారుణం ఎదురైంది. తెలుగువారి హీన దీన హైన్య చాతకానితనం ఎటువంటిదంటే ఆయన శవాన్ని ముట్టుకోవడానికి కూడా నలుగురు తెలుగువాళ్ళు రాలేదు. ఆయన మన తెలుగువారి కోసమే చనిపోయారని తెలిసినా కూడా స్పందించలేదు. చివరి వరకు దీక్షలో తోడుగా ఉన్న [[యెర్నేని సుబ్రహ్మణ్యం|సాధు సుబ్రహ్మణ్యం]] కనీసం మన గుడివాడ వాళ్ళవైనా సహాయం అడిగి శవదహనం చేద్దామని ఆశయాన్ని చంపుకుని వ్యక్తిగత భిక్షగాడిగా గుడివాడకు చెందిన సినీగాయకుడు ఘంటసాల దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి మన గుడివాడ నుండి వచ్చాడు గనుక మనమైనా సాగనంపుదాం అని ఒప్పించి తెచ్చారు. ఘంటసాల వెంట మోపర్రు దాసు అనే కళాకారుడు నేను గుడివాడ వాడినే కదా నేనూ వస్తానని వచ్చారు. తెలుగుజాతి కోసం తన ప్రాణాలు దానం చేసిన ఆ మహనీయుడి శవాన్ని ఎవరికీ తెలియకుండా తీసుకువెళ్ళటం సబబుకాదు అని తెలుగువాళ్ళ కళ్లు తెరిపించడానికి ఈ శవమే దిక్కు కావాలని ఒక ఎద్దులబండి మాట్లాడి శవాన్ని అందులోకి ఎక్కించారు. అప్పటికప్పుడే ఆశువుగా ఘంటసాల తన వీరకంఠాన్ని ఎలుగెత్తి తెలుగుజాతి పౌరుషం చచ్చిందని, చీము నెత్తురు లేని తెలుగుజాతి కోసం అసువుల బాసిన శ్రీరాములు నువ్వు అంటూ గొంతెత్తి పాడతూ శవయాత్ర ప్రారంభించారు. యేర్నేని [[యెర్నేని సుబ్రహ్మణ్యం|సాధు సుబ్రహ్మణ్యం]] గారే అమరజీవి శ్రీరాములకు దహనక్రియలు కర్మకాండ జరిపారు. {{Citation needed}}
; పర్యవసానాలు
పొట్టి శ్రీరాములు, ప్రాణాలర్పించటంతో ఆగ్రహావేశులైన ప్రజలు హింసాత్మకచర్యలకు పాల్పడ్డారు. మద్రాసు లో జరిగిన ఆయన అంతిమ యాత్రలో నినాదాలతో ప్రజలు ఆయన త్యాగనిరతిని కొనియాడారు. తదుపరి జరిగిన పరిణామాలలో మద్రాసు నుండి [[విశాఖపట్నం]] వరకు ఆందోళనలు, హింస చెలరేగాయి. పోలీసు కాల్పుల్లో ప్రజలు మరణించారు. చివరికి డిసెంబర్ 19న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేస్తూ ప్రధానమంత్రి [[జవహర్‌లాల్ నెహ్రూ]] ప్రకటన చేసాడు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే ఒక్క రోజు కూడా ఆంధ్రులు మద్రాసులో రాజధాని పెట్టుకోటానికి వీల్లేదని మరునాడే వెళ్ళిపోవాలని [[చక్రవర్తుల రాజగోపాలాచారి]] తెగేసి చెప్పాడు. అయితే కాకతీయులు పాలించిన [[వరంగల్లు]] రాజధానిగా బాగుంటుందని [[అంబేద్కర్]] సూచించాడు. [[రాజమండ్రి]] కూడా మంచిదేనన్నారు. [[విజయవాడ]] కమ్యూనిస్టుల కంచు కోట కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు వొప్పుకోలేదు. [[నెల్లూరు]], చిత్తూరు నాయకులు మాకు మద్రాసు దగ్గరగా వున్న సౌకర్యం వదులుకోవాలా అని అలిగారు. కోస్తా వాళ్ళను మేము నమ్మం, రాజధాని [[రాయలసీమ]]లోనే పెట్టాలని, లేకపోతే ఆంధ్ర రాష్ట్రమే వద్దని [[నీలం సంజీవరెడ్డి]] తదితరులు ఎదురుతిరిగారు. గత్యంతరంలేక కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1న [[బళ్ళారి]], [[బరంపురం]], [[హోస్పేట]], [[తిరువళ్ళూరు]] లాంటి తెలుగు ప్రాంతాలు కూడా వదులుకొని [[ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు|ఆంధ్ర రాష్ట్రం]] ఏర్పరచారు.
"https://te.wikipedia.org/wiki/పొట్టి_శ్రీరాములు" నుండి వెలికితీశారు