జిమ్ సర్భ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
జిమ్ సర్భ్ 1987 ఆగస్టు 27 న భారతదేశంలోని మహారాష్ట్రలోని బొంబాయిలో పార్సీ జొరాస్ట్రియన్ కుటుంబంలో జన్మించాడు. ఇతని తల్లి రిటైర్డ్ ఫిజియోథెరపిస్ట్, తండ్రి మాజీ మాస్టర్ మెరైనర్, పి&ఓ పోర్ట్స్ సౌత్, మిడిల్ ఈస్ట్ ఆసియా రీజినల్ డైరెక్టర్. సర్భ్‌కు మూడేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఇతని కుటుంబం భారతదేశం నుండి ఆస్ట్రేలియాకు వెళ్లి, మళ్ళి ఇతనికి ఎనిమిదేళ్ల వయసులో తిరిగి బొంబాయికి వచ్చారు, ఇతను దక్షిణ ముంబైలోని బాంబే ఇంటర్నేషనల్ స్కూల్‌లో, తరువాత పశ్చిమ ముంబైలోని బాంద్రాలోని అమెరికన్ స్కూల్ ఆఫ్ బాంబేలో చదివాడు. జిమ్ యునైటెడ్ స్టేట్స్‌లోని జార్జియాలోని అట్లాంటాలోని ఎమోరీ విశ్వవిద్యాలయం నుండి సైకాలజీలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి చేశాడు.
==కెరీర్==
ఇతను ఎమోరీ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాక, అట్లాంటాలోని అలయన్స్ థియేటర్‌లో సాహిత్య ఇంటర్న్‌గా ఒక సంవత్సరం పాటు పనిచేశాడు. తరువాత సర్భ్ 2012లో తిరిగి ముంబైకి వెళ్లి స్థానిక థియేటర్ ప్రొడక్షన్స్‌లో నటించడం ప్రారంభించాడు. ఇతను 2015 లో ఫోర్బ్స్ ఇండియా అండర్ 30 జాబితాలో చోటు సంపాదించుకున్నాడు.
సర్భ్ 2016 లో రామ్ మాధ్వని బయోగ్రాఫికల్ డ్రామా చిత్రం అయిన నీర్జాతో చలనచిత్ర రంగ ప్రవేశం చేసాడు. అంతేకాకుండా లైక్ సమ్మర్ లైక్ రెయిన్ అనే లఘు చిత్రానికి కూడా పనిచేశాడు. 2020లో, ఇతను అక్టోబర్‌లో జీ5 లో విడుదలైన బెజోయ్ నంబియార్ చిత్రం అయిన తైష్‌లో నటించాడు.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/జిమ్_సర్భ్" నుండి వెలికితీశారు