జిమ్ సర్భ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
| years_active = 2010–ప్రస్తుతం
}}
జిమ్ సర్భ్ (జననం: 27 ఆగస్ట్ 1987) ఒక భారతీయ చలనచిత్ర, రంగస్థల నటుడు. ఇతను నీర్జా సినిమాలో ప్రతినాయకుడిగా నటించాడు<ref>{{Cite web|title=Jim Sarbh Wiki, Age, Girlfriend, Family, Caste, Biography & More – WikiBio|url=https://wikibio.in/jim-sarbh/|access-date=2022-03-25|language=}}</ref>.
==వ్యక్తిగత జీవితం==
జిమ్ సర్భ్ 1987 ఆగస్టు 27 న [[భారత దేశం|భారతదేశం]]<nowiki/>లోని [[మహారాష్ట్ర]]<nowiki/>లోని [[బొంబాయి]]<nowiki/>లో పార్సీ జొరాస్ట్రియన్ కుటుంబంలో జన్మించాడు. ఇతని తల్లి రిటైర్డ్ ఫిజియోథెరపిస్ట్, తండ్రి మాజీ మాస్టర్ మెరైనర్, పి&ఓ పోర్ట్స్ సౌత్, మిడిల్ ఈస్ట్ ఆసియా రీజినల్ డైరెక్టర్. సర్భ్‌కు మూడేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఇతని కుటుంబం భారతదేశం నుండి ఆస్ట్రేలియాకు వెళ్లి, మళ్ళి తిరిగి ఇతనికి ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు బొంబాయికి వచ్చారు, ఇతను దక్షిణ ముంబైలోని బాంబే ఇంటర్నేషనల్ స్కూల్‌లో, తరువాత పశ్చిమ ముంబైలోని [[బాంద్రా]]<nowiki/>లోని అమెరికన్ స్కూల్ ఆఫ్ బాంబేలో చదివాడు. జిమ్ [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|యునైటెడ్ స్టేట్స్‌]]<nowiki/>లోని [[జార్జియా]]<nowiki/>లోని [[అట్లాంటా]]<nowiki/>లోని ఎమోరీ విశ్వవిద్యాలయం నుండి సైకాలజీలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి చేశాడు.
==కెరీర్==
ఇతను ఎమోరీ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాక, అట్లాంటాలోని అలయన్స్ థియేటర్‌లో సాహిత్య ఇంటర్న్‌గా ఒక సంవత్సరం పాటు పనిచేశాడు. తరువాత సర్భ్ 2012లో తిరిగి ముంబైకి వెళ్లి స్థానిక థియేటర్ ప్రొడక్షన్స్‌లో నటించడం ప్రారంభించాడు<ref>{{Cite web|date=2016-04-03|title=Neerja actor Jim Sarbh talks about his career and more|url=https://indianexpress.com/article/entertainment/bollywood/neerja-actor-jim-sarbh-acting-naturally/|access-date=2022-03-25|website=The Indian Express|language=}}</ref>. ఇతను 2015 లో ఫోర్బ్స్ ఇండియా అండర్ 30 జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. సర్భ్ 2016 లో రామ్ మాధ్వని బయోగ్రాఫికల్ డ్రామా చిత్రం అయిన నీర్జాతో చలనచిత్ర రంగ ప్రవేశం చేసాడు. అంతేకాకుండా లైక్ సమ్మర్ లైక్ రెయిన్ అనే లఘు చిత్రానికి కూడా పనిచేశాడు. 2020లో, ఇతను అక్టోబర్‌లో జీ5 లో విడుదలైన బెజోయ్ నంబియార్ చిత్రం అయిన తైష్‌లో నటించాడు.
===చలనచిత్రాలు===
{| class="wikitable"
పంక్తి 126:
|}
==అవార్డులు==
* బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ (ఫిలింఫెర్ అవార్డులు) - నీర్జా(2017)<ref>{{Cite web|last=December 5|first=India Today Web Desk|last2=December 5|first2=2016UPDATED:|last3=Ist|first3=2016 14:24|title=Star Screen Awards 2016 winners list: nirja movie|url=https://www.indiatoday.in/movies/bollywood/story/22nd-star-screen-awards-2016-pink-amitabh-bachchan-alia-bhatt-355663-2016-12-05|access-date=2022-03-25|website=India Today|language=}}</ref>
* బెస్ట్ యాక్టర్ ఇన్ నెగటివ్ రోల్ (ఆసియావిజన్ అవార్డులు) - పద్మావత్(2019)<ref>{{Cite web|last=Hooli|first=Shekhar H.|date=2019-02-17|title=Asiavision Movie Awards 2018 winners list: Ranveer Singh, jim sirbh|url=https://www.ibtimes.co.in/asiavision-movie-awards-2018-winners-list-ranveer-singh-dhanush-trisha-honoured-photos-videos-792105|access-date=2022-03-25|website=www.ibtimes.co.in|language=}}</ref>
==ఇవి కూడా చూడండి==
*[[రాజ్ కపూర్]]
"https://te.wikipedia.org/wiki/జిమ్_సర్భ్" నుండి వెలికితీశారు