ఏనుగుల వీరాస్వామయ్య: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ కొంచెంగా
పంక్తి 1:
'''ఏనుగుల వీరాస్వామయ్య''' ([[1780]] - [[1836]]) తెలుగు రచయిత, యాత్రికుడు. ఇతడు [[కాశీయాత్ర చరిత్ర]] విశేషాలు పుస్తకరూపంగా వెలువరించిన వ్యక్తిగా సుప్రసిద్ధులు.
 
 
కాశీయాత్ర చరిత్ర మొదటిసారి అచ్చు అయినపుడు కోమలేశ్వరం శ్రీనివాసపిళ్ళై వ్రాసిన ముందుమాట వలన, తన రచనలో సందర్భానుసారంగా వీరాస్వామయ్య పేర్కొన్న విషయాల వలన, దిగవల్లి వేంకటశివరావు, ముక్తేవి లక్ష్మణరావు సంపాదకత్వంలో వెలువడిన కాశీయాత్ర చరిత్ర గ్రంధాలలోని పీఠికల ద్వారా వీరాస్వామయ్య జీవిత విశేషాలు తెలుస్తున్నాయి.
 
==బాల్యం==
 
ఏనుగుల వీరాస్వామయ్య తెలుగు నియోగి బ్రాహ్మణ కుటుంబంలో శ్రీవత్స గోత్రంలో 1780 ప్రాంతంలో జన్మించాడు. తండ్రి పేరు సామయమంత్రి. 9వ యేటనే వీరాస్వామయ్య తండ్రి గతించాడు. వారి కుటుంబం కొన్ని తరాలుగా మద్రాసులో వుండేది.
 
 
==ఉద్యోగం==
12 యేళ్ళకే వీరాస్వామయ్య ఆంగ్లం ధారాళంగా చదవడం నేర్చుకొన్నాడు. ఆ వయసులోనే "బోర్డ్ ఆఫ్ ట్రేడ్"లో "వాలంటీరు"గా ఉద్యోగంలో కుదిరాడు. అప్పటిలో ఇంగ్లీషు వేర్చుకొన్నవారు అధికంగా వాలంటీరుగానే చేరి, తమ శక్త్యనుసారం పై ఉద్యోగాలకు ఎదిగేవారు. అతి చిన్న వయసులోనే అతని ప్రతిభ చూసి పై అధికారులు అతనిని తమ వద్ద పనిచేయించుకోవాలని పోటీ పడేవారట. తెలుగు, తమిళ, ఇంగ్లోషు భాషలలో కూడా అతను మంచి ప్రభ సాధించి ఉండవచ్చును. 13వ యేట తిరునల్వేలి జిల్లా కలెక్టర్ ఆఫీసులో "ఇంటర్ప్రిటర్"గా ఉద్యోగంలో కుదిరాడు. అప్పట్లో కలెక్టర్ చాలా చాలా పెద్ద ఉద్యోగం. అంత చిన్నవయసులో కలెక్టర్ ఆఫీసులో చేరగలగడం వీరాస్వామయ్య ప్రతిభకు తార్కాణం.
 
రెండు సంవత్సరాల తరువాత వీరాస్వామయ్య చెన్నపట్నం చేరి అనేక వ్యాపార సంస్థలలో పనిచేసి బుక్‌కీపింగ్ లాంటి అనేక విద్యలలో నిపుణుడయ్యాడు. బోర్డ్ ఆఫ్ ట్రేడ్‌లో ఎకౌంటెంట్‌గా పని చేశాడు. ఈ సమయంలోనే సంస్కృతంలోను, జ్యోతిష్యం, ఖగోళం, స్మృతులు, పురాణాలు వంటి అనేక విషయాలలో పండితుడైనట్లున్నాడు. 15యేళ్ళ బాలుడు బాధ్యత గల ఉద్యోగంలో పై అధికారుల మెప్పును పొందుతూ అంత శాస్త్రవిజ్ఞానం సంపాదించడం ఆశ్చర్యకరం. అతని ప్రతిభను గుర్తించి మద్రాసు సుప్రీం కోర్టువారు అతనికి "హెడ్ ఇంటర్ప్రిటర్" ఉద్యోగాన్ని ఇచ్చారు. ఇది చాలా గొప్ప ఉద్యోగంగా భావింపబడేది. పాశ్చాత్య చట్టాలను, స్థానిక ధర్మ సంప్రదాయాలను, ఆచారాలను సమన్వయపరుస్తూ విచారణ జరపడానికి బ్రిటిష్ జడ్జీలకు ఇంటర్‌ప్రిటర్లు సహాయపడేవారు. క్రొత్త ఉద్యోగంలో చేరేముందు పాత సంస్థవారు అతనికి ఘనమైన వీడ్కోలు ఇస్తూ బంగారపు నశ్యపు డబ్బాను బహూకరించారు. అప్పటిలో బ్రిటష్ పాలనలో ఉన్న ప్రాంతాలలోని బలమైన చట్టాలవలన నెలకొన్న స్థిరత్వానికి, ఇతర పాలకుల ప్రాంతాలలో జరిగే
అరాచకాలకు మధ్య భేదాన్ని వీరాస్వామయ్య యాత్రా చరిత్రలో స్పష్టంగా గమనించవచ్చును.
 
 
అప్పటికి కృష్ణా గోదావరి నదులపై ఆనకట్టలు కట్టలేదు. 19వ శతాబ్ది ఉత్తరార్ధంలో తీవ్రమైన కరువు కాటకాలు వచ్చాయి. ప్రజల ఆకలి తీర్చడానికి "గంజిదొడ్లు" (ఆహార సహాయ కేంద్రాలు) ఏర్పాటు చేశారు. అలాంటి గంజిగొడ్లదగ్గర ఒక తపస్విలా తన బాధ్యత నిర్వహించి వీరాస్వామయ్య వీలయినంతమందికి సహాయపడ్డాడు.
 
 
==పాండిత్యం==
 
ఆంగ్ల విద్య, పాశ్చాత్య విజ్ఞానాల అవుసరం వీరాస్వామయ్య బాగా గుర్తించాడు. అప్పటికి విశ్వవిద్యాలయాలు లేవు. కొద్దిపాటి కళాశాలలు కూడా లేవు. ఆ కాలంలోనే తన పలుకుబడితో "హిందూ లిటరరీ సొసైటీ" స్థాపించి వీరాస్వామయ్య ఆధునిక విద్యకు బాట వేశాడు. మద్రాసులో విశ్వవిద్యాలయం స్థాపించాలనే భావనకు ఈ చర్య పునాది వేసింది. (ఇదంతా లార్డ్ మెకాలేకు చాలా ముందుకాలం.)
 
అచ్చు పుస్తకాలు లేని ఆ కాలంలో వీరాస్వామయ్య సంపాదించిన పాండిత్యం ఆశ్చర్యకరంగా ఉంటుంది. సందర్భానుసారంగా తన రచనలో అతను ఉదాహరించిన విషయాలు శృతి, స్మృతులపై అతని జ్ఞానాన్ని, అతని తార్కిక లక్షణాన్ని, సత్యశోధన పట్ల నిబద్ధతను తెలియజేస్తాయి. ఖగోళ శాస్త్ర విషయాల గురించిన పండిత సభలో అతని వాదాన్ని హర్షించి పండితులు రత్నహారాన్ని బహూకరించారు. ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా పరిశీలించేవాడు.
 
==వ్యక్తిత్వం, హోదా==
 
 
==కాశీయాత్ర==
 
==కాశీయాత్ర చరిత్ర==
 
==మిత్రులు, సంస్థలు==
 
==బ్రౌను దొరతో లేఖలు==
 
 
==మూలాలు, వనరులు==