భర్తృహరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎కవి-కాలము: clean up, typos fixed: సాధారణముగా → సాధారణంగా
పంక్తి 23:
{{వ్యాఖ్య|<big>విప్రేణా భూతపూర్వం ఫలమిధి తపసా ౽ లంబి సూర్యప్రసాదా</big><br /><big>ల్లబ్ధ్వా తస్మాత్ స్వయం తత్ప్ర చురతరజరా పఞ్చతా కుఞ్చనాఢ్యమ్</big><br /><big>హిత్వా మోహం స్వకాన్తా స్వతివిమల ధియీ తం నిషే వ్యాక్త భవ్యో</big><br /><big>యోగీన్ద్రో భర్తృహర్యాహ్వయ ఇహ కురుతే ౽ ద్యాపి విద్యా విలాసం.</big>|||రామచంద్ర బుధేంద్రుడు|}}
 
అను శ్లోకమున "ఒకానొక బ్రాహ్మణుడు తనకు సూర్యప్రసాదముచే లభించిన ఫలమును తన ప్రభువగు భర్తృహరికి నొసగగా దానిని అతడు తన ప్రియభార్యకు ఇచ్చెను. ఆమె దానిని తాను భుజింపక, తన జారునకును, అతడు తన మరో ప్రియురాలికి అర్పించెననియు, ఈ సంగతి తెలిసినంతనే రాజు లోక వృత్తముపై అసహ్యించుకొని, విరాగియై అడవులకు జేరెను." అన్న జన ప్రతీతిని ఇచట తడవి యున్నాడు గాని, దాని సత్యా సత్యముల విమర్శించినట్లు స్ఫురింపదు. సాధారణముగాసాధారణంగా ప్రసిద్ధ పురుషులను గూర్చి అవినీతులు తమ బుద్ధి బలము కొద్దీ గాథలను ఎన్నింటినో కల్పించుటయు, వాటిని అలాగే సత్యములని పామరజనము విశ్వసించుటయు మనకు నేటికిని అనుభవమే. ఇదియొక గ్రుడ్డి ఛాందస వృత్తము. వ్యాఖ్యాతలెల్లరు " రత్నము రత్నమే కదా! అది యేనాటిదన్న ప్రశ్న మనకేల?" అన్న నుడికి దాసానుదాసులై తలయొగ్గిరే గాని తమ కవి స్తుత్యాదికములలో అతని కాలమును నిర్ణయించుటకు తగినంత విశదముగా అతనిని ప్రశాసించిన వారును లేరు.
 
అట్లుండినను ప్రబలమైన ఆధారాంతరముచే దీనినికొంతవరకు నిశ్చయింపవచ్చును. పారసీక భాషలో "కలిల ఉ - దిమ్నా" అను గ్రంథము ఉంది. ఇది క్రీ.శ 531-579 ప్రాంతముల పారసీక దేశమును పాలించిన యొకానొక పాదుషా ప్రోత్సాహమున రచియింపబడిన గ్రంథము. దీనికి మూలము మన సంస్కృత పంచతంత్ర మనుట సర్వాంగీకరింపబడిన విషయము. కనుక పంచతంత్రము అధమ పక్షము క్రీ.శ ఆరవ శతాబ్దారంభము నాటికే ప్రాచుర్యమందియుండెననుట కెలాంటి సంశయమును లేదు. పంచతంత్ర మా మూలాగ్రము స్వతంత్ర మైన రచన కాదు. నాటికి ప్రశస్తము లైయుండిన గ్రంథరాజము లనేకముల నుండి బహుళముగా నుదాహరణముల గైకొనియున్నది. దాని కాధారములగు గ్రంథములలో ఈ నీతి శతక మొకటి. ఇందుండి యొక శ్లోకము " గజభుజఙ్గ విహఙ్గమ బంధనం శశిదివాకరయోర్గ్రం హపీడనమ్; మతిమతాం చ విలోక్య దరిద్ర్క్వ తాం విధిరహో బలవాని తిమే మతిః" (చూడండి. 85 నీతి శతకం) అను శ్లోకమందు లోనికి గ్రహింపబడియున్నది.
"https://te.wikipedia.org/wiki/భర్తృహరి" నుండి వెలికితీశారు