ఆర్యభట్టు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
చి clean up, replaced: క్రీ.శ. → సా.శ. (3), typos fixed: లబ్ద → లబ్ధ, , → ,
పంక్తి 17:
| influenced = [[లల్లా]], [[బాస్కరుడు]], [[బ్రహ్మగుప్తుడు]], [[వరాహమిహిర]]
}}
'''ఆర్యభట''' భారతదేశ అత్యున్నత గణిత, ఖగోళ శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడు. ఇతను క్రీసా.శ. 426-550 ప్రాంతంలో నివసించినట్లు అంచనా. ఆర్యభట్టు కుసుమపురము (ఈనాటి [[పాట్నా]]) లో నివసించాడు. ఇతను [[ఆర్యభట్టీయం]], ఆర్య సిధ్ధాంతం, [[సూర్య సిద్ధాంతం]], గోళాధ్యాయం, సంస్కృత గణిత సంఖ్యా శాస్త్రాన్ని రచించాడు. ఇవే కాక ఆర్యభట్టు ''[[పై]]'' విలువను సుమారుగా కనుక్కున్నట్లు చెప్తారు. ఆధునిక [[గణితము|గణితం]]లోని సైన్, కొసైన్ లను ఇతను "జ్యా" ,"కొ జ్యా"గా నిర్వచించాడు. భారతదేశపు తొలి కృత్రిమ ఉపగ్రహానికి ఇతని పేరు ([[ఆర్యభట్ట (కృత్రిమ ఉపగ్రహం)|ఆర్యభట్ట]]) పెట్టారు.
 
ప్రపంచ వ్యాప్తంగా ఆధునిక శాస్త్రజ్ఞులంతా ఆర్యభట్టు ఖగోళ శాస్త్రానికి, గణిత శాస్త్రానికి చేసిన సేవలు ఎనలేనివని గుర్తించారు. గ్రీకులు ఆయన్ను ఆర్డువేరియస్ అనీ, అరబ్బులు అర్జావస్ అనీ వ్యవహరించే వారు. ఒకానొక కాలంలో ఆయన సిద్ధాంతాల గురించి భారతీయ పండితులు విరివిగా చర్చించుకొనే వారు. సుమారు వేయి సంవత్సరాల క్రితం [[భారత దేశము|భారత్]] ను సందర్శించిన అల్-బెరూనీ అనే అరబ్బు పండితుడు ఆయన రచనల్లో ఆర్యభట్టు గురించి ప్రస్తావించాడు. ఆ రచనల్లో ఒక చోట "కుసుమపురానికి చెందిన ఆర్యభట్టు తన పుస్తకంలో మేరు పర్వతం హిమాలయాల్లో సుమారు యోజనం ఎత్తున ఉందని ప్రతిపాదించాడు" అని రాశాడు. దీన్ని బట్టి ఆర్యభట్ట అతను సూత్రీకరించిన కొన్ని సమీకరణాల సాయంతో పర్వతాల ఎత్తును కొలిచాడని అర్థమవుతుంది.
పంక్తి 25:
ఆయన జన్మస్థలం పూర్వం పాటలీపుత్రంగా పిలవబడిన [[పాట్నా]]కు సమీపంలో ఉన్న కుసుమపురం. కొద్ది మంది ఆయన్ను విక్రమాదిత్యుని ఆస్థానంలో పనిచేసిన ప్రముఖ ఖగోళ శాస్త్రజ్ఞుడు, గణిత శాస్త్రవేత్త అయిన [[వరాహమిహిరుడు|వరాహ మిహురుడికి]] సమకాలికుడిలా భావిస్తున్నారు. విక్రమాదిత్యుడు పండితులను బాగా ఆదరించేవాడు. ఆయన ఆస్థానంలో నవరత్నాలు అనబడే తొమ్మిది మంది కవులుండే వాళ్ళు. వాళ్ళలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన [[కాళిదాసు]] కూడా ఒకడు. ఆర్యభట్టు ఈ తొమ్మిది మందిలో లేకుండా ఉన్నాడంటే ఆయన ఆలోచనలను ఆయన సమకాలికులు అంతగా పట్టించుకునే వారు కాదని తెలుస్తోంది. వరాహమిహిరుడి ఆలోచనలు కూడా కొన్ని ఆర్యభట్టు ఆలోచనలతో విరుద్ధంగా ఉన్నాయి. కానీ ఆయన ఈ నవరత్నాలు ప్రాచుర్యంలోకి రాకమునుపే జీవించి ఉంటాడనీ, లేకపోతే అతడు తక్కువ సమయంలో అంత ప్రాముఖ్యత సంపాదించుకొనే వాడు కాదనీ కొంత మంది భావన. అతని పుస్తకం ఆర్యభట్టీయం కూడా 23 ఏళ్ళ వయసులో వ్రాసి ఉన్నట్లుగా భావిస్తున్నారు. కలియుగం 3600 వ సంవత్సరం నాటికి (అంటే సా.శ. 499) తన వయసు 23 సంవత్సరాలను అతడు ఆర్యభట్టీయంలో రాసాడు.<ref name="Roupp1997">{{cite book|author=Heidi Roupp|title=Teaching World History: A Resource Book|url=https://books.google.com/books?id=-UYag6dzk7YC&pg=PA112|accessdate=24 June 2012|date=1997|publisher=M.E. Sharpe|isbn=978-1-56324-420-9|pages=112–}}</ref>
 
ఆర్యభట్టుడు అతని గ్రంథాలలో శాలివాహన శకాన్నిగానీ, విక్రమాదిత్య శకాన్నిగాని ఉపయోగించలేదు. యుధిష్టర యుగాన్నే (కలియుగం) చెప్పేడు. అందువల్ల ఈయన యుధిష్టర యుగం వాడుకలో ఉండేటప్పుడే జన్మించి వుంటాడు. వరాహమిహిరుడు తనగ్రంధాల్లో శకభూపాలకాలమని, శకేంద్రకాలమని ఉపయోగించాడు. ఇదే విక్రమాదిత్యకాలమని [[భట్టోత్పలు]] డన్నాడు. భాస్కరుడు కూడా తన సిద్ధాంత గ్రంథాల్లో శాకనృప సమయమని ఉపయోగించాడు. ఇదే శాలివాహన శకమని కొందరు పెద్దలు చెబుతారు. ఈ రెండు శకాలు వాడుక లోనికి ఎప్పుడు వచ్చాయో అన్న విషయం చెప్పడం కష్టం. కాని ఇవి రెండూ వాడుక లోనికి రాక పూర్వమే ఆర్యభట్టుడు జన్మించాడు. ఆర్యభట్టుడు [[బ్రహ్మగుప్తుడు|'''బ్రహ్మగుప్తుడి'''కి]] పూర్వుడు. అనేక వందలసార్లు బ్రహ్మగుప్తుడు ఆర్యభట్టు నామాన్ని ఉదహరించాడు. వరాహమిహిరుని కన్నా పూర్వుడని అనేక ఆధారాలు ఉన్నాయి. ఎందుచేతనంటే, వరాహమిహిరుని గ్రంథాలు శ్రీసేనుడి [[రోమక సిద్ధాంతం]] మీదా, [[విష్ణుచంద్రుడు|విష్ణుచంద్రుడి]] [[వశిష్ట సిద్ధాంతం]] మీదా అధారపడి ఉన్నాయి. ఈ రెండు సిద్ధాంతాలు ఆర్యభట్టుని సిద్ధాంతాలను ఆధారంగా చేసుకొని వ్రాయబడినవని బ్రహ్మగుప్తుదు సూచించాడు. కాబట్టి ఆర్యభట్టుడు బ్రహ్మగుప్తుడికి, వరాహమిహిరునికి పూర్వుడన్నమాటను నమ్మవచ్చు. బ్రహ్మగుప్తుడు శాలివాహన శకంలో ఆరవ శతాబ్దానికి చెందినవాడు. వరాహమిహిరులు ఇద్దరున్నారు. రెండవ శతాబ్దంలో ఒకడు, ఐదవ శతాబ్దంలో ఒకడు. ఈ రెండవ వరాహమిహిరునికి పూర్వులైన విష్ణుచంద్ర శ్రీసేన దుర్గసింహులకు కూడా ఆర్యభట్టుడు పూర్వుడు. ఈ విషయాలన్నీ పరిశీలిస్తే, ఆర్యభట్టుడు నిస్సందేహంగా శాలివాహనశకం ఐదవ శతాబ్దానికి కొన్ని సంవత్సరాలు ముందుగానే ఉన్నాడని నిర్ధారణకు రావచ్చును. ఇంకా సూక్ష్మంగా చర్చిస్తే ఆర్యభట్టుడు క్రీసా.శ.426లో జన్మించాడని, ఆర్యభట్టీయమనే గ్రంథాన్ని క్రీసా.శ.499లో వ్రాసాడని చెప్పవచ్చును.
 
ఆర్యభట్టుడు ఎప్పుడూ కూడా ఆకాశంవైపు చూస్తూ కంటికి కనబడ్డవాటికి, అప్పటికి ఉన్నట్టి సిద్ధాంతాల వలన ఫలితాలకూ గల వ్యత్యాసాన్ని గుర్తించి, చాలా విచారించి దేవుని గూర్చి తపస్సు చేసేడట. దాని ఫలితమే '''దశ గీతిక''' అనే చిన్న గ్రంథం. ఈయన రచించిన ఆర్యభట్టీయమనే గ్రంథంలోని భాగాలు రెండు -దశగీతిక, ఆర్యాష్టోత్తరశతకము. ఈ దశగీతికలో పదమూడు శ్లోకాలున్నాయి. ఇవన్నీ వ్యాకరణ సూత్రాల్ని పాటించకుండా వ్రాయబడ్డవి. ఈ గ్రంథంలో చిన్నచిన్న సూత్రాల్లో గూఢంగా అనంతమైన శాస్త్రజ్ఞానాన్ని ఇమిడ్చి పెట్టాడు. గణితపాదం, కాలక్రియపాదం, గోళార్ధ ప్రకాశిక అనే మూడూ ఆర్యాష్టోత్తరశతకంలో ప్రకరణాలు. ఆర్యభట్టుని గ్రంథాలకు వ్యాఖ్యానకారులు చాలామంది ఉన్నారు. వారిలో ముఖ్యులు దశకగీతిప్రకాశిక వ్రాసిన సూర్యదేవదీక్షితుడు, కేరళకు చెందిన [[నీలకంఠ సోమయాజి]].
పంక్తి 51:
|}
 
దీని అర్థం త్రిభుజం యొక్క వైశాల్యం దాని భూమి, ఎత్తుల లబ్దంలోలబ్ధంలో అర్ధ భాగానికి సమానం.
;బీజ గణితం
ఆర్యభట్టీయంలోనే శ్రేణుల మొత్తాన్ని గణించడానికి ఈ క్రింది సూత్రాలు ప్రవేశ పెట్టాడు.
"https://te.wikipedia.org/wiki/ఆర్యభట్టు" నుండి వెలికితీశారు