"ఏనుగుల వీరాస్వామయ్య" కూర్పుల మధ్య తేడాలు

 
ఉన్నత ఉద్యోగంలో తనకున్న విశేష స్థాయిని అతను ఎప్పుడూ చెప్పుకోలేదు. సందర్భానుసారంగా మాత్రమే మనం గ్రహించాలి. తన యాత్ర ఆరంభంలో అప్పటి విధానం ప్రకారం వీరాస్వామయ్య మద్రాసు దొరలనుండి "క్యారక్టర్లు" (ఇతర స్థలాలలో ఉండే అధికారులకు తనగురించిన పరిచయ పత్రాలు కావచ్చును) తీసుకొని వెళ్ళాడు. అవి చూసి దేశమంతటా దొరలు, సంస్థానాధీశులు వీరాస్వామయ్యను విశేషంగా మన్నించి అతని అవసరాలన్నీ సమకూర్చారు. గవర్నరు లాంటి హోదా ఉద్యోగులు కూడా అతనిని మన్నించారు. ఆ కాలంలో సంస్థానాధీశులకు మాత్రమే వారి పరివారం ఆయుధాలు ధరించడాని అనుమతి ఉండేది. అలాంటి సదుపాయం వీరాస్వామి పరివారానికి కలుగజేశారు. గంగను దాటే ముందు వీరాస్వామయ్య సామానులను తనిఖీ చేయాలని పట్టుబట్టిన కస్టమ్స్ ఉద్యోగిని ఆ పే కమిషనర్ వెంటనే డిస్మిస్ చేశాడు. అయితే అతనిని క్షమించమని వీరాస్వామయ్య కోరాడు.
 
 
తన యాత్ర తనకొక్కడికే పుణ్యవంతం కావాలని అతను కోరుకొనలేదు. నూరుమందికి పైగా ఉన్న తన పరిజనం చేత యాత్రాఫలసిద్ధికి కావలసిన విధులు, కర్మలు అన్నింటినీ చేయించాడు. దారిలో తన పరిజనానికి ఆయనే వైద్యుడు కూడాను. దారిలో అస్వస్థతకు గురైన నౌకర్లు కూడా యాత్రను పూర్తి చేయాలని స్థానికి కూలీల ద్వారా డోలీలు ఏర్పాటు చేయించాడు. ఆఖరికి స్థానికంగా తెచ్చుకొన్న తాత్కాలిక కూలీకి జ్వరమొస్తే అతనిని మోసుకెళ్ళడానికి మరో నలుగురు కూలీలను నియమించాడు. కాశీలో చలికాలంలో రక్షణ కోసం అందరికీ తగు వస్త్రాలు, నూనెలు కొని ఇచ్చాడు.
తన యాత్రా ఫలాన్ని తనకొకడికే పరిమితం చేసుకోలేదు. నలభై బిందెల గంగాజలాన్ని పది బాడుగ గుర్రాలమీద చెన్నపట్నం పంపించే ఏర్పాటు చేయించాడు. అయినా ఆ జలం రవాణాకు ఏమయినా అంతరాయం కలుగుతుందేమోనని మరొక ఎనిమిది బిందెల తనవెంట రెండు బండ్లలో తీసుకొని వచ్చాడు. ఆ పుణ్య తీర్ధాన్ని మద్రాసులో ఇంటింటికి పంచాడు.
 
 
దానగుణానికి వీరాస్వామి పెట్టింది పేరు. తన శక్తికి మించిన దేవాలయ పునరుద్ధరణ కార్యక్రమాలను తలకెత్తుకొని విజయవంతంగా పూర్తి చేశాడు. తనకెవరైనా కొంచెమైనా సహాయపడితే అది మరచిపోకుండా గుర్తుంచుకొని అంతకు ఎన్నోరెట్ల సహాయం చేసేవాడు. తన కూతురి వివాహానికి, బంధువుల ఆక్షేపణను లక్ష్యపెట్టుండా, సమస్త జాతులవారికి భోజనాలు ఏర్పాటు చేసెను. ఇంత ఖర్చు చేసేబదులు పిల్లదానికి కొంత ఆస్తి ఏర్పరుచవచ్చునుగదా అని బంధువులు ప్రశ్నించారు. చిన్నదాని పోషణ నిమిత్తము ద్రవ్యమును మనుష్యాధీనముగా నుంచుటకు బదులుగా ఈశ్వరుని చేతిలో భద్రంగా ఉంచుతున్నాని చెప్పాడు వీరాస్వామయ్య.
 
==కాశీయాత్ర==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/349610" నుండి వెలికితీశారు