కాళిదాసు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎చరిత్ర: clean up, replaced: నగరము → నగరం (2)
చి clean up, replaced: క్రీ.శ. → సా.శ. (3)
పంక్తి 21:
"పురా కవీనాం గణనాం ప్రసంగే, కనిష్ఠకాధిష్ఠితకాళిదాసా|, అద్యాపి తత్తుల్యకవే రభావా, దనామికా సార్థవతీ బభూవ|| " అని చెప్పఁబడి ఉంది. ఈతని విషయమై కట్టుకథలు అనేకములు ఉన్నాయి. అయినను మీఁద ఉదహరించిన విషయములనుబట్టి కాళిదాసులు ఇరువురు అనియు వాస్తవము ఐన చరిత్రము ఇదియే అనియు ఊహింపవలసి ఉంది.
 
క్రీసా.శ.634వ శతాబ్దము నాటి [http://en.wikipedia.org/wiki/Aihole అయిహోళీ] ప్రశస్తిలో కాళిదాసు యొక్క చర్చ ఉంది. ఇది కాళిదాసుదిగా చెప్పబడిన కాలములలో అతి దగ్గరది. అంతేగాక, మరి కొందరు కాళిదాసును [[విక్రమాదిత్యుడు|విక్రమాదిత్యుని]] ఆస్థానములో విద్వాంసునిగా చెప్పిరి.ఎక్కువ చరిత్రకారులు కాళిదాసుని గుప్త రాజులయిన చంద్రగుప్త విక్రమాదిత్యుడు, అతని కొడుకు అయిన కుమార గుప్తుని కాలమయిన క్రీసా.శ.4వ శతాబ్దము నాటి వానిగా పరిగణింతురు. రెండవ చంద్రగుప్తుడు విక్రమాదిత్యునిగా పేరునొంది, గుప్తుల స్వర్ణయుగములోని చివరి కాలములో రాజ్య పాలన చేసెను. అదే సమయములో గుర్తుంచుకోదగ్గ విషయమేమంటే, కాళిదాసు తన రచనలలో ఎక్కడా కూడా సుంగ వంశమును [[యాదవ కులములొ ఒక శాఖ]] తప్ప మరెవరి ప్రస్తావనా చేయలేదు. పురూరవుడు, ఊర్వశిలు నాయికానయకులుగా కాళిదాసు రచించిన విక్రమోర్వశీయములో, పురూరవుని పేరును నాటకములో విక్రమునిగా మార్చిన విధానము, కాళిదాసుకు తన రాజయిన విక్రమాదిత్యుని మీద గల అభిమానముగా భావింతురు. అదే విధముగా [[కుమార సంభవము]] రచన కూడా కుమారగుప్తుని కథగానే రాసాడని మరికొందరి అభిప్రాయము. అలాగే, [[రఘువంశము]]లో హూణుల ప్రస్తావన కూడా స్కందగుప్తుడు హూణులపై సాధించిన విజయము తాలూకు ఆనవాళ్ళని మరో అభిప్రాయము. అదే కావ్యము లోని [[రఘువు|రఘు మహారాజు]] యొక్క జైత్రయాత్ర కూడా, చంద్రగుప్తుని తాలూకు జైత్రయాత్రా వర్ణనయే అని మరికొందరి అభిప్రాయము. కాళిదాసు మేఘసందేశమును ఈనాటి మహారాష్ట్ర లోని నాగపూర్ వద్ద గన రామ్టెక్ లేదా రామగిరి అన్న ప్రదేశములో రచన కావించాడని మరికొందరి అభిప్రాయము. రెండవ చంద్రగుప్తుని కుమార్తె అయిన ప్రభావతీగుప్తను ఇచ్చి వివాహము చేసిన వెంకట రాజు యొక్క రాజధాని రామగిరికి దగ్గరలోనే ఉండటము పైన చెప్పిన వానికి ఓ కారణము.
 
కానీ, చాలా మంది పండితులు ఈ క్రింది కారణాల వల్ల పైన ఉదహరించిన వానిపై అభ్యంతరములు వ్యక్తం చేసారు.
పంక్తి 36:
కాళిదాసు క్రీ.పూ.1వ శతాబ్దిలో జన్మించాడు. మొదట్లో ఇతడు తన అందము, అమాయకత్వము వలన గుర్తింపు పొందాడు. విక్రమాదిత్యుని ఆస్థానములో ప్రసిద్ధి నొందిన [[నవరత్నములు|నవరత్నములలో]] ఒకడిగా మన్ననలను పొందాడు. విద్వత్తులో తనను పరాజయించిన వానినే పరిణయమాడెదను అని ప్రతిజ్ఞ పూనిన విద్యోత్తమ అనబడే ఓ యువరాణి, విక్రమాదిత్యుని ఆస్థానములోని పండితులనందరినీ తన పాండిత్యముచే పరాజయము పాలుచేసింది. ఈ అవమానము సహించలేని ఆ పండితులు, ఆనాటికి మందబుద్ధిగా ఉన్న కాళిదాసుని గొప్ప పండితుడని ఆమెను మోసగించి, వారిరువురికినీ పరిణయము గావించిరి. పెళ్ళి తరువాత కాళిదాసు నిజస్వరూపమును గ్రహించిన ఆమె తన అవివేకమునకు, తనకు జరిగిన అవమానమునకు క్రుంగిపోవును. ఇది గ్రహించిన కాళిదాసు జ్ఞాన సముపార్జనకునూ, విద్వత్తు గల భార్యకు తగు సమానునిగను ఉండవలెనన్న తలంపుతో, తన ఇష్టదైవమయిన కాళికాదేవిని ప్రసన్నము చేసుకొనుటకు ఇల్లు విడుచును. అతని ప్రార్థన ఆలకించిన మాత ప్రసన్నురాలై, కాళిదాసుకు గొప్ప విద్వత్తును, మాటనేర్పరి తనాన్ని అనుగ్రహించును. భార్యతో వివాహానికి పూర్వము జరిగిన విద్యా పాటవ ప్రదర్శనలో, విద్యోత్తమ తన మొదటి ప్రశ్నగా, '''అస్తి కశ్చిత్ వాగ్విశేషా:?''' (నీ భాషలో ఏమైనా ప్రత్యేకత యున్నదా?) అని అడుగుతుంది.దానికి ప్రతిగా కాళిదాసు తన మందబుద్ధితో అరకొరగా సమాధానము ఇస్తాడు. కానీ మాత అనుగ్రహముతో, గొప్ప జ్ఞానసముపార్జనతో ఇంటికి తిరిగి వచ్చిన కాళిదాసు భార్యతో, ఆమెను తన భార్యగా కన్నా, తనకు జ్ఞానమార్గోపదేశము చేసిన గురువుగా తలచి, ఆమె ప్రశ్నకు నివాళిగా, ఆమె గతములో సంధించిన ప్రశ్నలోని మూడు పదాలతో ప్రారంభింపబడిన తన మూడు కావ్యాలలోని మొట్ట మొదటి వాక్యాల ద్వారా తన సరికొత్త ఉనికిని తెలియచేస్తాడు. అవే అస్తితో మొదలయ్యే (అస్త్యుతారాస్యా దిశి) [[కుమారసంభవము]], కశ్చిత్ తో మొదలయ్యే (కశ్చిత్ కాంతా) [[మేఘ సందేశం (సంస్కృతం)|మేఘసందేశం]], వాక్ తో మొదలయ్యే (వాగర్థావివ సంపృక్తౌ) [[రఘువంశము]].
కాళిదాసు జన్మస్థలము రకరకాలుగా చెప్పబడింది. అతడు తన కుమారసంభవము కావ్యములో హిమాలయములను వర్ణించిన తీరుని బట్టి కొందరు ఇతడు హిమాలయ పరిసర ప్రాంతవాసిగా అభిప్రాయపడ్డారు. కానీ, మేఘసందేశంలో ఉజ్జయిని నగరం తాలూకు వర్ణనలతో, ఇతడు ఉజ్జయిని నగరంనకు చెందిన వాడని మరికొందరి వాదన.
కాళిదాసు నేటి శ్రీలంకలో కుమారదాస చక్రవర్తి కాలములో హత్య గావింపబడినాడని ఓ వాదన. కానీ, కుమారదాసుడు క్రీసా.శ.6వ శతాబ్దికి చెందిన వాడగుటవలన, ఆ వాదన వాదనగానే మిగిలిపోయింది.
===సంస్కృతకవిగా===
ఒక సంస్కృతకవి. కాళికాదేవిని కొలిచి ఆదేవి యొక్క వరప్రసాదమును పొందినందున ఇతనికి ఈ పేరు కలిగెను. ఇతఁడు మిక్కిలి ప్రసిద్ధుఁడు. కవిసమయము చక్కగా తెలిసినవాఁడు. ఉపమానోపమేయములను పోల్చి చెప్పుటయందు మిక్కిలి సమర్ధుఁడు కాబట్టి ఇతఁడు చెప్పెడు ఉపమాలంకారము శ్లాఘింపఁ దగినదిగా ఉండును. కనుకనే "ఉపమా కాళిదాసస్య" అను వచనము లోకమునందు ప్రసిద్ధముగా వాడఁబడుచున్నది. మఱియు ఈమహాకవి విక్రమార్కుని ఆస్థానము లోని కవులలో ఒకఁడై ఉండెను.
"https://te.wikipedia.org/wiki/కాళిదాసు" నుండి వెలికితీశారు