గోన బుద్ధారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి బొమ్మ చేర్చాను #WPWP, #WPWPTE
చి clean up, replaced: క్రీ.శ. → సా.శ., typos fixed: మహాబూబ్ నగర్ → మహబూబ్ నగర్, భాద్యత → బాధ్యత, → (2), , → ,
పంక్తి 1:
[[దస్త్రం:Ranganatha Ramayanamu.pdf|thumb|'''గోన బుద్ధారెడ్డి''' తన తండ్రి పేర రంగనాథ రామాయణము గ్రంథాన్ని రచించాడు]]
'''[[గోన బుద్ధారెడ్డి]]''' ఒక [[తెలుగు]] కవి. పదమూడవ శతాబ్దమునకు చెందిన ఇతను [[కాకతీయులు|కాకతీయుల]] సామంతరాజుగా పనిచేశాడు. [[కందూర్]] రాజధానిగా పాలిస్తూ తన తండ్రి పేర [[రంగనాథ రామాయణము]] గ్రంథాన్ని రచించాడు. ఇది పూర్తిగా ద్విపద ఛందస్సులో క్రీసా.శ.1294-1300 కాలంలో<ref>తెలంగాణ సాహిత్య వైశిష్ట్యం, రచన: ఆచార్ ఎస్వీ రామారావు, పేజీ 28</ref> రచించబడింది. [[యుద్ధకాండ]] వరకు ఇతను రచించగా మిగిలిన భాగాన్ని ఇతని కుమారులు పూర్తిచేశారు. ఇతని కుమారుడు గోన గణపతిరెడ్డి తండ్రిపేరిట బుద్ధేశ్వరాలయాన్ని నిర్మించాడు. ఉత్తరకాండ కర్తలయిన కాచ, విఠలనాథులు ఇతని కుమారులేనని కొందరు పరిశోధకులు పేర్కొన్నారు.<ref>కాకతీయ చరిత్రము, తేరాల సత్యనారాయణశర్మ రచన, ముద్రణ 2002, పేజీ 168</ref> ఐతే ప్రముఖ సాహిత్య విమర్శకుడు [[వేటూరి ప్రభాకరశాస్త్రి]] గోన బుద్ధారెడ్డి పినతండ్రి కుమారుడైన మరో గన్నారెడ్డి కుమారులే ఉత్తర రంగనాథరామాయణ కర్తలను పరిశోధన వెలువరించారు.<ref name="సింహావలోకనము" /> గోన బుద్ధారెడ్డి రచించిన రామాయణమే తెలుగులో తొలి [[రామాయణము|రామాయణ]] కావ్యంగా ప్రశస్తి వహించింది. అంతకుముందు [[తిక్కన]] రచించినది నిర్వచనోత్తర రామాయణమే కాని [[సంపూర్ణ రామాయణం]] కాదు.<ref>పాలమూరు సాహితీ వైభవము, ఆచార్య ఎస్వీ రామారావు, 2010 ప్రచురణ, పేజీ 8</ref>
 
== కుటుంబ నేపథ్యం ==
పంక్తి 6:
 
== జీవిత విశేషాలు ==
[[కాకతీయులు|కాకతీయ]] రుద్రదేవుడు కందూరు చోడులను (నేటి మహబూబ్ నగర్ జిల్లా) లోని వర్ధమానపురం (నేటి నందివడ్డేమాన్, మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నది) నుంచి పారద్రోలడంతో, ఆ స్థానంలో గోరెడ్డిని తన సామంతుడిగా నియమించాడు. ఇతని కుమారుడు గన్నారెడ్డి రాజధానిగా పాలించాడు.<ref>తెలంగాణ చరిత్ర, సుంకిరెడ్డి నారాయణరెడ్డి రచన, 2011, పేజీ 129</ref> ఇతని అల్లుడు మాల్యాల గుండ దండధీశుడు వర్థమానపురం పాలకుడైనాడు. ఇతని మరణానంతరం గోన బుద్ధారెడ్డి గుండేశ్వరాలయం నిర్మించింది<ref name="సింహావలోకనము">{{cite book|last1=ప్రభాకరశాస్త్రి|first1=వేటూరి|title=సింహావలోకనము|date=2009|publisher=తిరుమల తిరుపతి దేవస్థానం|location=తిరుపతి|url=https://archive.org/details/in.ernet.dli.2015.371392|accessdate=7 December 2014}}</ref>. ఈమె తొలి తెలుగు కవయిత్రిగా ఖ్యాతి చెందింది.
 
== సాహిత్యం ==
పంక్తి 14:
గోన బుద్ధారెడ్డి వ్రాసిన రంగనాథ రామాయణం తెలుగు నాట అత్యంత ప్రాచుర్యం వహించిన గ్రంథాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఆంగ్ల విద్య తెలుగు నాట ప్రవేశించని రోజుల్లో [[సంస్కృతము|సంస్కృత]] భాషా పాఠకులు తప్ప తక్కిన విద్యార్థులందరికీ చిన్నతనంలోనే ''పెద్ద పుస్తకం'' పట్టించి చదివించేవారు. ఇంతకీ ఈ పెద్ద పుస్తకం అంటే మూడు పుస్తకాలకు సామాన్య నామం. ఆ మూడు పుస్తకాలు ఇవి:
# [[కవిత్రయం]] వారి [[ఆంధ్రమహాభారతం]]
# [[గోన బుద్ధారెడ్డి]] కృతమైన [[రంగనాథ రామాయణము]]
# [[పోతన]] [[శ్రీమదాంధ్ర భాగవతం|భాగవతం]]
 
గోన బుద్ధారెడ్డి ములికినాటి సీమకు [[రాజధాని]] అయిన [[గండికోట]]కు అతిచేరువలోని పెద్దపసుపల లేదా కొట్టాలపల్లెకు చెందినవాడు. నేటికీ గోనా వంశస్ధులు ఆగ్రామాలలో మరియూ [[జమ్మలమడుగు]]లో నివసించుచున్నారు.
 
==గోన సంస్థానం==
కాకతీయ పరిపాలన కాలం (995-1323) లో గోన బుద్ధారెడ్డి మహాబూబ్మహబూబ్ నగర్ జిల్లాలోని రాజ్యాలైన వర్ధమానపురం (ప్రస్తుతం నంది వడ్డెమాన్), [[ఖిల్లా ఘన్‌పూర్]] (ఘనపూర్ కోట) నుండి పరిపాలన చేసాడు. అతని కుటుంబం, గోన సంస్థానం కాకతీయ సామ్రాజ్యంలో ప్రసిద్ధమైనది. అతని మరణం తరువాత అతని సోదరుడూ గోన లుకుమా రెడ్డి రాజ్యపాలన భాద్యతలనుబాధ్యతలను స్వీకరించాడు.<ref>{{cite web|url=http://mahabubnagar.nic.in/Dynasties.php|title=History of District § Kakatiyas (995-1323)|work=mahabubnagar.nic.in|publisher=The Official Website of Mahabubnagar District|access-date=2018-06-22|archive-url=https://web.archive.org/web/20180521035141/http://www.mahabubnagar.nic.in/Dynasties.php|archive-date=2018-05-21|url-status=dead}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/గోన_బుద్ధారెడ్డి" నుండి వెలికితీశారు