"ఏనుగుల వీరాస్వామయ్య" కూర్పుల మధ్య తేడాలు

 
==కాశీయాత్ర==
వీరాస్వామయ్య కాశీయాత్ర జర్నల్ మొదటి వాక్యం ఇది -
:''జగదీశ్వరుండు నాచేత కొంత దేశాటనము జేయింపదలచి నన్నునేలుచున్న సీప్రీం కోరటు దొరలగుండా సెలవిప్పించినాడు. గనుక నేను కాశీయాత్ర బోవలెనని ౧౮౩౦ సంవత్సరము మే నెల ౧౮వ తేదీ కుజవారము రాత్రి ౯ ఘంటలకు చెన్నపట్టణము విడిచి మాధవరము చేరినాను. అది తండయారు వీధిలోనుండే నా తోటకు ౩ గడియల దూరము.''
 
ఇలా 1830 మే 18న అతని కాశీయాత్ర ప్రారంభమైంది. అతని యాత్రలో సందర్శించిన కొన్ని వూర్లు, మజిలీలు, స్థలాలు ఇలా ఉన్నాయి. ఇక్కడ వ్రాసిన తేదీలు వాటి ప్రక్కన ఇచ్చిన ఏదో ఒక వూరి మజిలీకి చెందినవవుతాయి.
 
* 1830 మే 18 - చెన్న పట్నం, మాధవరం, పాలవాయి సత్రం, వెంకటేశనాయుడి సత్రం (పెదపాళెము),తిరువళ్ళూరు, కనకమ్మ సత్రం (కార్వేటి నగరం), బుగ్గగుడి, పుత్తూరు, వడమాలపేట సత్రం, అలమేలు మంగాపురం.
 
* మే 23 - దిగువ తిరుపతి, తిరుపతి కొండ
 
* మే 30 - కరకరంబాడు, శెట్టిగుంట, బాలపల్లె, కోడూరు, వోగంబాడు, పుల్లంపేట, నందలూరు, అత్తిరాల, భాకరాపేట, వొంటిమిట్ట
 
* కడప, పుష్పగిరి, కాజీపేట, దువ్వూరు, వంగలి
 
* జూన్ 2 - అహోబిళం, శ్రీరంగాపురం, రుద్రవరము, మహానంది, బండాతుకూరు, వెలపనూరు, ఓంకారము, వెంపెంట, ఆత్మకూరు, నాగులోటి, పెద్ద చెరువు
 
* జూన్ 16 - శ్రీశైలము, భీముని కొల్లము, పెద్దచెరువు
 
* జూన్ 20 - నివృత్తి సంగమం (కృష్ణ దాటడం), ముసలిమడుగు
 
* జూన్ 21 - సిద్ధేశ్వరం ఘాటు, పెంటపల్లి, పానగల్లు, చిన్నమంది, వనపర్తి, గణపురం, చోళీపురం, మనోజీపేట, జడచర్ల, నాగనపల్లె (బాలనగరం), జానంపేట (ఫరక్కునగరం), షాపురం
 
* జూన్ 29 - హయిదరాబాదు (బేగం బజారు)
 
* జూలై 8 - శికిందరాబాదు, గోలకొండ
 
* జూలై 20 - మేడిచర్ల, మాషాపేట, బిక్కనూరుపేట, కామారెడ్డిపేట, మల్లుపేట, యాదలవాయి, జగనంపల్లె, వేములవాడ, దూదుగాం, స్వర్ణ, ఆర్మూరు, రామనపేట
 
* జూలై 31 - (గోదావరి దాటడం), నిర్మల (కుశ దర్పణం)
 
* ఆగష్టు 2 - వొడ్డూరు, విచ్చోడా, యేదులాబాదు (పిన్నగంగ దాటడం), గూంగాం
 
* ఆగష్టు 14 - నాగపూరు
* ఆగష్టు 21 - కామిటి
* ఆగష్టు 26 - రామటెంకి
* సెప్టెంబరు 6 - నర్మదావది దాటడం, తిలవారా
* సెప్టెంబరు 8 - జబ్బల్ పూరు
* సెప్టెంబరు 13 - గోసలపూరు
* సెప్టెంబరు 22 - రీమా
* సెప్టెంబరు 29 - మిరిజాపూరు
* అక్టోబరు 9 - వింధ్యవాసిని
* అక్టోబరు 12 - ప్రయాగ (అలహాబాదు)
* అక్టోబరు 23 - గంగమీద ప్రయాణం
* అక్టోబరు 27 - కాశీ, హరిద్వాఱము, గంగోత్తరి, బదరీ నారాయణము, కాశ్మీరము
* డిసెంబరు 17 - గయకు ప్రయాణం, గాజీపూరు
* డిసెంబరు 28 - పట్నా, జ్వాలా ముఖి, దేవప్రయాగ
* 1831 జనవరి 1 - పున:పునః నది, నీమా నదామా
* జనవరి 4 - గయ
* ఫిబ్రవరి 18 - పట్నా
* మార్చి 5 - గంగానదిపై ప్రయాణం, మూంగేరి (మాంఘీరు), భాగల్పూరు
* మార్చి 17 - రాజా మహలు
* ఏప్రిల్ 1 - కృష్ణనగరు
* ఏప్రిల్ 9 - కలకత్తా
* జూన్ 3 - వుడుబడియా, భద్రకాళి, రాణీసరాయి
* జూన్ 18 - మహానది దాటడం, కటకం, పిప్పిలి
* జూన్ 21 - జగన్నాధము (భువనేశ్వరం)
* జూన్ 27 - నరసింగగాటు
* జూన్ 28 - మాణిక్యపట్టణం, చిలక సముద్రం
* జూన్ 30 - గంజాం (ఋషికుల్య నది)
 
==కాశీయాత్ర చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/349698" నుండి వెలికితీశారు