"ఏనుగుల వీరాస్వామయ్య" కూర్పుల మధ్య తేడాలు

==కాశీయాత్ర==
వీరాస్వామయ్య కాశీయాత్ర జర్నల్ మొదటి వాక్యం ఇది -
:''జగదీశ్వరుండు నాచేత కొంత దేశాటనము జేయింపదలచి నన్నునేలుచున్న సీప్రీంసూప్రీం కోరటు దొరలగుండా సెలవిప్పించినాడు. గనుక నేను కాశీయాత్ర బోవలెనని ౧౮౩౦ సంవత్సరము మే నెల ౧౮వ తేదీ కుజవారము రాత్రి ౯ ఘంటలకు చెన్నపట్టణము విడిచి మాధవరము చేరినాను. అది తండయారు వీధిలోనుండే నా తోటకు ౩ గడియల దూరము.''
 
ఇలా 1830 మే 18న అతని కాశీయాత్ర ప్రారంభమైంది. అతని యాత్రలో సందర్శించిన కొన్ని వూర్లు, మజిలీలు, స్థలాలు ఇలా ఉన్నాయి. ఇక్కడ వ్రాసిన తేదీలు వాటి ప్రక్కన ఇచ్చిన ఏదో ఒక వూరి మజిలీకి చెందినవవుతాయి.
 
* '''1830 మే 18''' - చెన్న పట్నం, మాధవరం, పాలవాయి సత్రం, వెంకటేశనాయుడి సత్రం (పెదపాళెము),తిరువళ్ళూరు, కనకమ్మ సత్రం (కార్వేటి నగరం), బుగ్గగుడి, పుత్తూరు, వడమాలపేట సత్రం, అలమేలు మంగాపురం.
 
* మే 23 - దిగువ తిరుపతి, తిరుపతి కొండ
* డిసెంబరు 17 - గయకు ప్రయాణం, గాజీపూరు
* డిసెంబరు 28 - పట్నా, జ్వాలా ముఖి, దేవప్రయాగ
* '''1831 జనవరి 1''' - పున:పునః నది, నీమా నదామా
* జనవరి 4 - గయ
* ఫిబ్రవరి 18 - పట్నా
* జూన్ 28 - మాణిక్యపట్టణం, చిలక సముద్రం
* జూన్ 30 - గంజాం (ఋషికుల్య నది)
* జూలై 1 - నాయుడిపేట, ఛత్రపురం, బురంపురం
 
* జూలై 3 - యిచ్ఛాపురం, గంజాం జిల్లాలోని రేవులు, కంచర్ల, పలాశీ, రఘునాధపురం, హరిశ్చంద్రపురం, నరసన్నపేట, రావులవలస
 
* జూలై 7 - శ్రీకాకుళము, శ్రీకూర్మము
 
* జూలై 9 - వెజ్జపురం, గిరివాడిపాళెం, గంజాం మరియు విజయనగరం తాలూకాలలోని అగ్రహారాలు, మహాస్థలాలు
 
* జూలై 10 - విజయనగరం, ఆలమంద, సుబబవరం, సింహ్వాచలము, కసంకోట, అనకాపల్లి, యలమంచిలి, దివ్యల, నక్కపల్లి, వుపమాకా, తుని, నాగలాపల్లి, యానాం, నీలపల్లి, యింజరము, మాదయ పాళెము, వుప్పాడా
 
* జూలై 20 - పిఠాపురము, పెద్దాపురము
 
* జూలై 21 - రాజానగరము
 
* జూలై 21 - రాజమహేంద్రవరము, కాకినాడ, కోనసీమ, ధవిళేశ్వరం, భద్రాద్రి, కోరంగి
 
* జూలై 28 - గోదావరి దాటడం, వాడపల్లి, రాల (ర్యాలి), ఆచంట, శింగవృక్షము, బొండాడ, యేలూరిపాడు, కలిదండి. తుమ్మడి
 
* ఆగష్టు 2 - మచిలీ బందరు
 
* కొత్తపాళెం - చల్లపల్లి, కళ్ళేపల్లి
 
* ఆగష్టు 19 - కృష్ణానదిని దాటడం, కనగాల, భట్టుప్రోలు, లంజదిబ్బ, చందవోలు, బాపట్ల, వేటపాళెం, చినగంజాం, అమ్మనబోలు, ఆకులల్లూరు, వెలగపూడి సత్రము, కరేడు, కొత్త సత్రము, జువ్వులదిన్నె, పంటల్లూరు, కొడవలూరి సత్రం
 
* ఆగష్టు 14 - పినాకినీ నదిని దాటడం, నెల్లూరు
 
* ఆగష్టు 27 - మనుబోలు, గూడూరు, నాయుడుపేట, బ్రాహ్మణపుదూరు, దొరవారి కోనేరు, మన్నారు పోలూరు (కోటపోలూరు), చిలకలపూడి రామస్వామి సత్రం, సుళూరుపేట, గుమ్మడిపూడి
 
* సెప్టెంబరు 1 - పొన్నేరి, విచ్చూరు
* సెప్టెంబరు 2 - తిరువట్టూరు
 
* '''1831 సెప్టెంబరు 3''' - చెన్నపట్టణము
 
చివరి అధ్యాయంలో కొన్ని వాక్యాలు:
: ౩వ తేదీ సాయంకాలము ౫ గంటలకు బయలువెళ్ళి యిష్టులతో గూడా చెన్నపట్టణమునకు అరకోశెడు దూరములో తండయారువేడులో ఉండే నాతోటయిల్లు ఆరు గంటలకు చేరినాను. ... ... నేను స్వస్థలమును వదలి మళ్ళీ చేరిన కాలము ౧౫ మాసాలు ౧౫ దినాలు ౧౦ నిముషాలు. నా స్వస్థలము వదలి దూర దేశమును సంచరించి మళ్ళీ వచ్చినట్టు నాకు నా పరివారానికిన్ని తోపచేయక వొకరికి కాలిలో ముల్లు గూడా నాటినట్టు తోపచేయకుండా తృణానికి తక్కువబ అయిన నన్ను రాజఠీవిగానే స్ౄలము చేర్చినాడు గనుక అవ్యాజముగా ఈశ్వరుడు తృణాన్ని మేరువు చేస్తాడనే మాట సత్యం సత్యం పునఃసత్యమని నా సహోదరులైన లోకులు నమ్మవలసినది. (''తరువాత చెన్నపట్నం చరిత్ర గురించి వ్రాసాడు రచయిత'')
 
==కాశీయాత్ర చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/349708" నుండి వెలికితీశారు