రాంకీ: కూర్పుల మధ్య తేడాలు

అనువాదమంతా మెరుగు పరిచాను
ట్యాగు: 2017 source edit
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
1990 లో వచ్చిన ''మారుతి పండి'' విజయం తర్వాత అదే సంవత్సరంలో ఎన్. కె. విశ్వనాథన్ దర్శకత్వంలో వచ్చిన ఇనైంద కైగల్ అనే యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో నటించాడు. ఇందులో అతను ప్రధాన కథానాయకుడు అరుణ్ పాండియన్, కథానాయిక నిరోషాతో కలిసి నటించాడు. ఈ చిత్రం ఘనవిజయాన్ని సాధించి రాంకీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. 1990 లో, అతను [[నిరోషా]]తో కలిసి [[ఘటన]] అనే చిత్రంలో నటించాడు.<ref>{{Cite web |url=http://www.telugujunction.com/movies/movie_id/2571 |title=ఆర్కైవ్ నకలు |access-date=2020-04-24 |website= |archive-date=2018-10-18 |archive-url=https://web.archive.org/web/20181018101417/http://www.telugujunction.com/movies/movie_id/2571 |url-status=dead }}</ref> 1991 లో మనోబాల దర్శకత్వం వహించిన వెట్రీ పాడిగల్ అనే సినిమాలో నటించాడు. ఇందులో [[శరత్ కుమార్]] ప్రతినాయక పాత్రలో నటించారు.<ref>{{Cite web | url=http://www.woodsdeck.com/movies/4028-nilave-mugam-kaattu-1999 | title=Nilave Mugam Kaattu Tamil Movie Reviews, Photos, Videos (1999) | website= | access-date=2020-04-24 | archive-url=https://web.archive.org/web/20200110231406/http://www.woodsdeck.com/movies/4028-nilave-mugam-kaattu-1999 | archive-date=2020-01-10 | url-status=dead }}</ref>. ఆత్మ (1993), తంగా పప్పా (1993), మాయాబజార్ (1995), కరుప్పు రోజా (1996) వంటి విజయవంతమైన భయానక చిత్రాలలో నటించాడు. 1997 లో రాంకి మొత్తం పది చిత్రాలతో నటించాడు. కాని పుత్తం పుదు పూవే అనే సినిమా విడుదల కాలేదు. 1990వ దశకంలో నిరోషా, [[కుష్బూ]], [[ఊర్వశి (నటి)|ఊర్వశి]] లాంటి కథానాయికలతో అతను పండించిన నటన విజయవంతమైంది. 1999 లో, కార్తీక్, దేవయానితో కలిసి నటించిన ''నీలవే ముగం కాట్టు'' చిత్రంలో రెండవ పాత్రలో నటించారు. ''పూవెల్లం కెట్టుప్పర్'' (1999) ''కాదల్ రోజావే'' (2000) వంటి సినిమాల్లో కొన్ని సన్నివేశాలలో కనిపించాడు.
 
2000 వ దశకంలో, ''పలయతు అమ్మన్'' (2000), శ్రీ రాజ రాజేశ్వరి (2001),'' పాడై వీటు అమ్మన్'' (2002) వంటి భక్తి చిత్రాలలో రాంకీ రెండవ పాత్రలలో నటించారు. 1991 లో [[ఆర్.కె.సెల్వమణి]] దర్శకత్వం వహించిన ''కుట్రపతిరికై '' సుదీర్ఘకాలం తర్వాత 2007లో విడుదలైంది. అయితే, 15 సంవత్సరాల తర్వాత కావడంతో కొన్ని దృశ్యాలను తొలగించి విడుదల చేశారు.<ref>{{Cite web| url=https://www.indiaglitz.com/kuttrapathirikai-review-tamil-movie-9117 |title = Kuttrapathirikai review. Kuttrapathirikai Tamil movie review, story, rating}}</ref>.
 
ఆరు సంవత్సరాల విరామం తర్వాత అతను 2013లో ''మాసని'', బిర్యానీ అనే చిత్రాలతో తమిళ సినిమాకు తిరిగి వచ్చాడు. 2016 లో, అతని తదుపరి చిత్రాలు వాయ్‌మాయ్, అట్టి విడుదలయ్యాయి. 2017 లో అతను ఆకతాయి అనే తెలుగు చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. తరువాత తమిళ హర్రర్ కామెడీ చిత్రం,'' ఆంగిలా పదమ్'' లో ప్రధాన పాత్రలో నటించాడు. 2018 లో, తెలుగు చిత్రం [[ఆర్‌ఎక్స్‌ 100]] తరువాత, సుందర్ సి దర్శకత్వంలో విశాల్, తమన్నా ప్రధాన పాత్రధారులుగా వచ్చిన యాక్షన్ అనే చిత్రంలో నటించాడు.<ref>https://www.sify.com/movies/rx-100-review-a-raw-love-story-marred-by-violence-review-telugu-shnlJocfifgbd.html</ref><ref>https://www.sify.com/movies/action-review-a-below-average-action-thriller-review-tamil-tlpqOSdjdcefc.html</ref>.
"https://te.wikipedia.org/wiki/రాంకీ" నుండి వెలికితీశారు