దేవదాసి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి clean up, replaced: క్రీ.శ. → సా.శ. (2), typos fixed: మహ → మహా, → (4), ( → (
పంక్తి 7:
 
==భారతదేశంలో ==
భారతదేశ చరిత్రలో జోగిని, దేవదాసి వ్యవస్థల నేపథ్యం విభిన్న కోణాల్లో, దశల్లో కనపడుతుంది. జోగిని, దేవదాసి వ్యవస్థలు వైష్ణవ సంప్రదాయంలో కనపడతాయి. కాళిదాసు కీర్తనలో మాతంగి అంటే దళిత స్త్రీ అని అర్థం. మాతంగి రూపాన్ని మహాదివ్య సరస్వతిగా అభివర్ణించారు. క్రీసా.శ. 3వ శతాబ్దానికి చెందిన జోగి మరణశాసనం జోగిని వ్యవస్థ గురించి వివరిస్తుంది. వాత్సాయనుడి కామసూత్రాల్లో వీరు వివిధ కళల్లో నైపుణ్యంగలవారని, గణిక, విలాసవతి పేర్లతో ఈ సంప్రదాయాన్ని కొనసాగించేవారని పేర్కొన్నారు.
దేవదాసి అనే పదాన్ని ఆర్యులు వినియోగించిన వైదిక ధర్మాచరణ నుంచి తీసుకొన్నారు.నాడు అనార్యులను, అవర్ణులను దస్యులు అని పిలిచేవారు.దేవాలయాల్లో పరిచారికలుగా ఉండే వీరిని దేవదాసి అని పిలిచేవారు.దేవదాసి వ్యవస్థ భారతదేశమంతటా ఉందని హ్యుయాన్‌త్సాంగ్ పేర్కొన్నారు. చరిత్రను నిశితంగా పరిశీలిస్తే స్త్రీలను దేవతలు, యోగిని, శక్తిమాత, డాకిణి, షాకిని, జోగినిగా పిలిచేవారని తెలుస్తున్నది. యోగం, యాగం, యజ్ఞం కలిగిన స్త్రీలను యోగినులుగా ఆరాధించేవారు. భారతీయ సంప్రదాయంలోని 64 కళల్లో నాట్యం విలక్షణ సాంస్కృతిక జీవన విధానంగా గుర్తింపు పొందింది. రాజులు తమ రాజమందిరాల్లో మద్యం తాగుతూ నాట్యగత్తెల నాట్యాన్ని ఆస్వాదిస్తూ విందులు, వినోదాలు జరుపుకొనేవారు.దేవాలయాల్లో పండుగలు, ఉత్సవాలు జరిగేటప్పుడు నాట్యాలకు అధిక ప్రాధాన్యమిచ్చేవారు. కాళిదాసు తన మేఘదూత కావ్యంలో ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో బాలికలను చిన్న వయసులోనే దేవతలు, దేవుళ్లకు సమర్పించే సంప్రదాయం ఉందని పేర్కొన్నారు. క్రీసా.శ. 10వ శతాబ్దంలో ట్రావెన్‌కోర్, తంజావూరు సంస్థానాల్లో 400 మందికిపైగా దేవదాసీలు ఉండేవారని, దేవాలయాల్లో పూజారుల తర్వాత స్థానం దేవదాసి లేదా జోగినులదే అని అనేక అధ్యయనాల్లో వెల్లడయ్యింది.
 
==తెలంగాణలో==
సామాజిక దురాచారాలైన జోగిని, దేవదాసి వ్యవస్థలు తెలంగాణ సమాజంలో నేటికీ కనపడటం బాధాకరమైన విషయం. తెలంగాణను చారిత్రకంగా పరిశీలిస్తే భౌగోళికంగా తూర్పున బంగాళాఖాతం నుంచి పశ్చిమాన అరేబియా మహాసముద్రం వరకు విస్తరించి ఉండేది. దీంతో ఈ దురాచారాలు ఆ కాలంలో చోళ రాజ్యంలో సర్వసాధారణంగా కనపడేవి. జోగిని, దేవదాసీలను దేవర్ అడిగళర్ అని పిలిచేవారు. ఈ పేరుకు అర్థం దేవతలకు బానిస.
జగన్నాథ దేవాలయంలో వీరిని మహరిమహారి అని పిలిచేవారు. దీనికి అర్థం మోహన నారి. అంటే సమ్మోహనానికి మన్మథ క్రీడలకు ఇష్టపడిన, ప్రేరేపించే స్త్రీ దేవదాసిగా మారుతుంది. ఫ్రెంచ్ మత గురువు అబుదుబేయ్ (1792-1823) రచించిన హిందూ మానర్స్, కస్టమ్స్ అండ్ సెర్మనీస్ గ్రంథంలో శైవమతాన్ని ఆచరించిన కాకతీయ, రెడ్డి రాజులు, వెలమరాజుల కాలంలో జోగిని వ్యవస్థ ఉన్నట్లుగా పేర్కొన్నాడు.
 
==దేవదాసి - కఠిన జీవనం==
పంక్తి 90:
* 1882లో దేశంలో మొదటిసారిగా బాలికలను దేవునికి సమర్పించే విధానానికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమైంది.
* 1922లో హైదరాబాద్‌లో జరిగిన అఖిల భారత ఆది హిందూ సాంఘిక సదస్సులో జగన్‌మిత్ర మండలి (భాగ్యరెడ్డి వర్మ) దళిత బాలికలను దేవతలకు సమర్పించే జోగిని వ్యవస్థ నిషేధానికి తీర్మానం చేసింది.
* 1956లో ఐక్యరాజ్య సమితి సాధారణ మండలి అధికరణం 1 (d) ప్రకారం బానిసత్వం ఏ రూపంలోనైనా (లైంగిక, సేవ, వెట్టి) నేరం.
* విజయవాడ కేంద్రంగా 1974లో స్థాపించిన సంస్కార్ అనే స్వచ్ఛంద సంస్థను జోగిని వ్యవస్థపై పోరాడాలని నాటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కుముద్‌బెన్ జోషి కోరారు. ఈ సంస్థ అధ్యక్షులు లవణం, కార్యదర్శి హేమలతా లవణం.
* నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ యాక్షన్ (NISA) పేరుతో కుముద్‌బెన్ జోషి జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు.
పంక్తి 101:
* ఆంధ్రప్రదేశ్ జోగిని వ్యవస్థ వ్యతిరేక సంఘటన్, ఆశ్రయ్ సంస్థలు జోగినుల ఉద్దరణకు చేపట్టిన కార్యక్రమాలు.
# జోగినులకు విద్య నేర్పడం
# జోగినులకు మిగతా స్త్రీల మాదిరిగా వివాహం జరిపించడం.
# జోగినులకు పింఛన్లు ఇవ్వడం.
# జోగినులకు పుట్టిన సంతానానికి సామాజిక గుర్తింపువ్వడం.
# జోగిని దురాచారానికి గ్రామపెద్దలను బాధ్యుల్ని చేస్తూ చట్టాలను సవరించడం.
* గ్రేస్ నిర్మల అధ్యక్షతన మహబూబ్‌నగర్‌లో ఆంధ్రప్రదేశ్ జోగిని వ్యవస్థ వ్యతిరేక సంఘటన్ ఏర్పాటు చేయడం.
"https://te.wikipedia.org/wiki/దేవదాసి" నుండి వెలికితీశారు